• తాజా వార్తలు

ఫేస్ బుక్ నుంచి త్వరలో స్మార్ట్ ఫోన్

నిన్న రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగులో ముకేశ్ అంబానీ ఉచితంగా 4జీ స్మార్ట్ ఫీచర్ ఫోన్ ను ప్రకటించిన వార్త దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ గా మారిపోయింది. అదింకా చక్కర్లు కొడుతుండగానే మరో వార్త ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అది... ఫేస్ బుక్ ఫోన్. ఫేస్ బుక్ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించడంతో ఈ వార్త గుప్పుమంది.
    కొందరు అంతర్జాతీయ బ్లాగర్ల వెబ్ సైట్లలో ఫేస్ బుక్ ఫోన్ కు సంబంధించిన వార్తలు వెలువడ్డాయి. స్పీకర్లు, కెమేరాలు, మెక్రోఫోన్లు, టచ్ స్క్రీన్ ఉండే ఒక ‘‘మాడ్యులర్ ఎలక్ర్టో మెకానికల్ డివైస్’’కు పేటెంట్ కోరుతూ ఫేస్ బుక్ ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పేటెంట్ల విభాగానికి సమర్పించిన పత్రాలు కొన్ని వెల్లడైనట్లుగా చెప్తున్నారు. వాటి ఆధారంగానే ఈ ప్రచారం మొదలైంది.
    అయితే.. ఇంతకుముందు కూడా ఇలాగే ఫేస్ బుక్ ఫోన్ గురించి వార్తలు వచ్చినా ఆ సంస్థ దాన్ని కొట్టిపారేస్తూ వచ్చింది. అలాంటి ఆలోచనేమీ లేదని చెప్పుకొచ్చింది. అయితే... గత ఏప్రిల్ లో ఫేస్ బుక్ ఆగ్మెంటెడ్ రియాలిటీపై ప్రత్యేక ప్రాజెక్టు ఒకటి మొదలుపెట్టింది. ఆగ్మెంటెడ్ రియాలిటీని స్మార్టు ఫోన్ కెమేరాలకు సింక్ చేసేలా ఈ పని ముమ్మరంగా సాగుతోంది. అయితే... సోషల్ మీడియాకు బాగా ఉపయోగపడే ఆగ్మెంటెడ్ రియాలిటీని విస్తారం చేయడానికే ఈ ప్రయత్నమని ఫేస్ బుక్ చెప్తోంది. అయితే... సిలికాన్ వ్యాలీ వర్గాలు మాత్రం ఇదంతా ఫేస్ బుక్ ఫోన్ కోసమేనని అంటున్నాయి.
 

జన రంజకమైన వార్తలు