• తాజా వార్తలు
  •  

శాంసంగ్ ఫోన్లకి ఆండ్రాయిడ్ 8 ఓరియో అప్ డేట్ ఎప్పుడు వస్తుందంటే..

ఆండ్రాయిడ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌తో ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్ అప్‌డేట్ అవుతుంటాయి. అదేవిధంగా ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ 8 ఓరియో అప్‌డేట్ వ‌స్తోంది. ఇది కొన్నాళ్లు ఉన్న త‌ర్వాత నెక్స్ట్ జ‌న‌రేష‌న్ ఓఎస్‌ను గూగుల్ డెవ‌ల‌ప్ చేసి రిలీజ్‌చేస్తుంది.  ప్ర‌స్తుతం చాలా స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ మార్ష్‌మాల్ 6, 6.0.1, ఆండ్రాయిడ్ నోగ‌ట్ 7.0 ఓఎస్‌ల‌తోనే న‌డుస్తున్నాయి. త‌ర్వాత త‌రం ఆండ్రాయిడ్ 8 ఓరియో అప్‌డేట్ ఇంకా చాలా ఫోన్ల‌కు రాలేదు. ఈ అప్‌డేట్ శాంసంగ్ ఫోన్ల‌కు ఎప్పుడు వ‌స్తుందో ఈ ఆర్టిక‌ల్‌లో చూద్దాం
మార్చి నుంచే మొద‌లు
* శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8+ స్మార్ట్‌ఫోన్ల‌కు ఇప్ప‌టికే రెండు నెలల నుంచి ఆండ్రాయిడ్ ఓరియో 8 బీటా వెర్ష‌న్ అందుబాటులో ఉంటుంది.  మార్చి 18క‌ల్లా ఫుల్ ఓఎస్ అప్‌డేట్ వ‌స్తుంది.
* శాంసంగ్ గెలాక్సీ నోట్ 8కు మార్చి28 వరకు అందుతుంది
* శాంసంగ్ గెలాక్సీ  ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్,  ఏ ఎస్ (2017),  టాబ్ ఎస్ త్రీ, 9 .7 ఇంచ్ మోడల్స్‌కు స‌మ్మ‌ర్‌లోగా వ‌స్తుంద‌ని స‌మ‌చారం.అంటే  మ‌రో నెల‌, నెలా 15 రోజుల్లో రావ‌చ్చు.
* 2016లో వ‌చ్చిన ట్యాబ్ ఏ, ట్యాబ్ యాక్టివ్‌2, లాస్ట్ ఇయ‌ర్ రిలీజ‌యిన శాంసంగ్ జే3, ట్యాబ్ ఏ, ఈ ఏడాది  వ‌చ్చిన గెలాక్సీ ఏబీల‌కు మాత్రం ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ రావ‌డానికి ఇంకా చాలాకాలం ప‌డుతుంది. ఈ సంవ‌త్స‌రం చివ‌రి వ‌ర‌కు ఈ మోడ‌ల్స్‌కు ఓరియో అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. 

జన రంజకమైన వార్తలు