• తాజా వార్తలు
  •  

తొలి ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ రాజ‌కీయ‌వేత్త‌.. శామ్‌!! 

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. కృత్రిమ మేథ‌స్సు. 21వ శతాబ్ద‌పు అత్యుత్త‌మ ఆవిష్క‌ర‌ణ‌ల్లో ఒక‌టి.  ఎందుకంటే మనిషిలా ఆలోచించే టెక్నాల‌జీ. ఇప్ప‌టికే ఈ ఏఐ టెక్నాల‌జీ .. ఎడ్యుకేషన్‌, హెల్త్ రంగంలో పెను మార్పులు తీసుకొస్తోంది. ఇప్పుడు ఈ టెక్నాల‌జీ క‌న్నుపాలిటిక్స‌పై పడింది. ఏఐ టెక్నాల‌జీతో పొలీటీషియ‌న్ త‌యారుచేశాడు ఒకాయ‌న‌. ఏమిటా వింత‌.. ఎలా ప‌నిచేస్తుందో చూసొద్దాం ప‌దండి..

ఎవ‌రు త‌యారుచేశారు? 

న్యూజిలాండ్‌కు చెందిన 49 ఏళ్ల ఎంట‌ర్‌ప్రెన్యూర్ నిక్ గెరిస్ట‌న్ ఆలోచ‌న‌ల్లో నుంచి రూపుదిద్దుకుందే ఈ ఏఐ పొలిటీషియ‌న్‌. పేరు శామ్‌. ఇది ఒక వ‌ర్చ్యువ‌ల్ పొలిటీషియ‌న్‌. ఎవ‌రైనా పర్స‌న్ హౌసింగ్‌, ఎడ్యుకేష‌న్‌, ఇమిగ్రేష‌న్‌లాంటి లోక‌ల్ ఇష్యూస్ మీద క్వ‌శ్చ‌న్స్ రైజ్‌చేస్తే శామ్ జ‌వాబులిస్తుంద‌ట‌. శామ్ ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌తోపాటు త‌న హోంపేజీలో కూడా ప్ర‌జ‌లనుంచి వ‌చ్చే క్వ‌శ్చ‌న్ ఆధారంగా నేర్చుకుని స‌మాధానాలిస్తుంద‌ని నిక్ చెబుతున్నారు. రాజ‌కీయాల్లో ఎంతో బ‌యాస్ ఉంది. క్లైమేట్ చేంజ్‌లాంటి సంక్లిష్ట స‌మ‌స్య‌లు ప్ర‌పంచ‌మంతా పెద్ద ఇష్యూగా మారాయి. వీట‌న్నింటిమీద శామ్ వ‌ర్క‌వుట్ చేస్తుంద‌ని చెబుతున్నారు. 

ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంద‌ట‌
2020 చివ‌ర్లో న్యూజిలాండ్‌లో జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గబోతున్నాయి. ఆ ఎన్నిక‌ల్లో శామ్‌ను పోటీ చేయిస్తామంటున్నారు నిక్‌. ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు కానీ మ‌నిషి బుర్ర‌కే అంద‌ని రాజ‌కీయాల‌ను ఓ టెక్నాల‌జీ ఎలా అందిపుచ్చుకుంటుంద‌నేది ఆస‌క్తికరం కానుంది.  వాద‌ప్ర‌తివాదాలు, ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో నిత్యం వేడెక్కే పోలిటిక్స్‌లో  ఓకంప్యూట‌ర్ బుర్ర‌ను చొప్పించాల‌నే ఆలోచ‌న మాత్రం కొత్త‌దే కాదు ఆలోచింప‌జేసేది అంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు. చూద్దాం ఏం జ‌రుగుతుందో?  టెక్నాల‌జీ చేసే వింత‌లు ఇంకెన్ని చూస్తామో!!!

జన రంజకమైన వార్తలు