• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ: మ‌న‌ల్ని నిద్రపుచ్చే రోబో - సోమ్ నోక్స్

ర‌జ‌నీకాంత్ రోబో సినిమా చూశారుగా వంట ద‌గ్గ‌ర నుంచి ఫైట్స్ వ‌ర‌కు.. మెహందీ ద‌గ్గ‌ర నుంచి అష్టావ‌ధానం వ‌ర‌కు ఏదైనా చిటికెలో చేసి పారేస్తుంది. అయితే అది సినిమా! అంతా సినిమాటిక్‌గానే సాగిపోతుంది. మ‌రి నిజ జీవితంలో రోబోలు అంత ఎఫెక్టివ్‌గా అన్ని ప‌నులు చేయ‌గ‌ల‌వా? మ‌న‌కు సంబంధం లేకుండానే ప్ర‌తి ప‌నిని చ‌క్క‌బెట్ట‌గ‌ల‌వా? .. సోమ్‌నోక్స్ లాంటి రోబోను  చూస్తే రోబోల వ‌ల్ల ఏ ప‌నైనా సాధ్య‌మే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎవ‌రూ ఊహించ‌లేని ప‌ని చేస్తుంది. మ‌నుషుల‌కు నిద్ర చాలా అవ‌స‌రం. కానీ ఇప్పుడున్న బిజీ బిజీ లైఫ్ స్ట‌యిల్‌లో మ‌నం నిద్ర‌పోయేది చాలా త‌క్కువ‌. దీని వ‌ల్ల చాలా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సోమ్‌నోక్స్ రోబో మ‌న నిద్ర‌కు సాయం చేస్తుంది. మ‌రి ఈ రోబో ఎలా ప‌ని  చేస్తుందో చూద్దామా..

డెఫ్ట్ యూనివ‌ర్సిటీ సృష్టి..
నెద‌ర్లాండ్స్‌లోని డెఫ్ట్ యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్నాల‌జీ వాళ్లు ఈ కొత్త రోబోను త‌యారు చేశారు. సోన్‌మాక్స్ పేరుతో త‌యారు చేసిన ఈ  రోబో చేసే ప‌ని  చాలా గొప్ప‌ది. ఎందుకంటే మ‌న‌ల్ని నిద్ర‌పుచ్చుతుంది మ‌రి.  అంటే మ‌న స్లీప్‌ను ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో పెట్టి సౌండ్ స్లీప్ వ‌చ్చేలా చేయడం  ఈ రోబో ప్ర‌త్యేక‌త‌.  జాగ్‌టెన్‌బ‌ర్గ్ అత‌ని బృందం ఈ సోమ్‌నాక్స్‌ను త‌యారు చేసింది. పీ న‌ట్ షేప్‌లో ఉండే ఈ రోబోలో ఒక సీక్రెట్ మెకానిజంను వాడారు. మ‌న‌ల్ని నెమ్మ‌దిగా నిద్ర‌పుచ్చి.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తోంద‌ట ఈ రోబో.

ఎలా ప‌ని చేస్తుందంటే..
సోమ్‌నొక్స్ రోబో ప‌ని చేసే తీరే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ రోబోను మ‌నం హోల్డ్ చేసి ప‌డుకోవాలి. మ‌న శ్వాస‌ను నియంత్రించి... త‌న బ్రిథింగ్ ల‌య‌లోకి మన‌ల్ని తీసుకొచ్చి నెమ్మ‌దిగా నిద్ర‌లో జారుకునేలా చేయ‌డమే ఈ రోబో ప్ర‌త్యేక‌త‌. ఈ టెక్నాల‌జీకి ఎంతో స్పంద‌న వ‌చ్చింది. అందుకే వాళ్లు యూనివ‌ర్సిటీని ప్రాజెక్ట్ కంపెనీగా మార్చేయాల‌ని డిసైడ్ చేసేశారు ఈ రోబో సృష్టిక‌ర్త‌లు. అయితే దీన్ని అంద‌రికి అందుబాటులోకి తీసుకు రావాలంటే భారీగా ఖ‌ర్చు అవుతుంద‌ని అందుకే క్రౌడ్ ఫండింగ్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు వారు చెబుతున్నారు. 

జన రంజకమైన వార్తలు