• తాజా వార్తలు
  •  

స్మార్ట్ బాక్స్ డెలివ‌రీ టెర్మిన‌ల్స్‌..ఆన్‌లైన్‌లో కొంటే ఇక్క‌డ డెలివ‌రీ తీసుకోవచ్చు

చైనీస్ మొబైల్ కంపెనీ షియోమి త‌న ఈ కామ‌ర్స్ ఫ్లాట్‌ఫాం ఎంఐ.కామ్ కు మ‌రో కొత్త ఎట్రాక్ష‌న్ తీసుకొచ్చింది.  స్మార్ట్‌బాక్స్‌తో టై అప్ చేసుకుని యూజ‌ర్లు ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసిన వ‌స్తువుల‌ను స్మార్ట్‌బాక్స్‌కు డెలివ‌రీ చేస్తుంది. అక్క‌డి నుంచి యూజ‌ర్లు వాటిని తీసుకెళ్లిపోవ‌చ్చు. దీనివ‌ల్ల డెలివ‌రీలో డిలే త‌గ్గుతుంది. 
ఏమిటి ఉప‌యోగం?
స్మార్ట్‌బాక్స్ ద్వారా ప్రొడ‌క్ట్ డెలివ‌రీ చాలా ఈజీ ప్రాసెస్‌. మీరు ప్రొడ‌క్ట్ డెలివ‌రీ అయిన‌ట్టు వ‌చ్చిన ఓటీపీని స్మార్ట్ బాక్స్ టెర్మిన‌ల్‌లో ఎంట‌ర్ చేస్తే మీ ప్రొడ‌క్ట్ దానిలో నుంచి బ‌య‌టికి వ‌స్తుంది.  ఈ స్మార్ట్‌బాక్స్‌ల‌ను న‌గ‌రాల్లో ప‌లు ప్రాంతాల్లో పెడ‌తారు.  డే అండ్ నైట్ ఎప్పుడైనా వెళ్లి తెచ్చుకోవ‌చ్చు. డెలివ‌రీ టైమ్‌కి ఇంటి దగ్గ‌ర ఉండ‌లేని వారికి, డెలివ‌రీకి టైం ఎక్కువ ప‌ట్టే ప్రాంతాల వారికి ఇది చాలా ఉప‌యోగం.  ఇండియా మొత్తం ఇలాంటి ఏర్పాటు చేయాల‌ని ఎంఐ ప్లాన్ చేస్తోంది. ముందుగా ఢిల్లీలోని దేశ రాజ‌ధాని ప్రాంతంలో  ఇంట్ర‌డ్యూస్ చేసింది.
ఇలా వాడుకోవ‌చ్చు
దీనికోసం మీరు ఎంఐ.కామ్‌లో ప్రొడ‌క్ట్ ఆర్డ‌ర్ చేసేట‌ప్పుడే మీకు అందుబాటులో ఉన్న కియోస్క్ అడ్ర‌స్ మెన్ష‌న్ చేయాలి. ఏయే ప్రాంతాల్లో బాక్స్‌లుంటాయో సైట్లో చూపిస్తుంది. స్మార్ట్ బాక్స్‌కు మీ ప్రొడ‌క్ట్ రీచ్ కాగానే మీకు ఎస్ఎంఎస్ వ‌స్తుంది. 72 గంట‌ల్లోపు మీరు దాన్ని తీసుకోవాలి. అయితే మీ ప్రొడ‌క్ట్ దొంగిలించ‌బ‌డితే ప‌రిష్కారం ఏమిట‌న్న‌ది మాత్రం ఎంఐ క్లారిటీ ఇవ్వ‌లేదు. అమెజాన్ యూఎస్‌లో ఇలాంటి ఫ్లాట్‌ఫారంనే ఏర్పాటు చేసింది. అందులో డెలివ‌రీతోపాటు ప్రొడ‌క్ట్ రిట‌ర్న్ కూడా అక్క‌డేచేసే అవ‌కాశం ఉంది.  

జన రంజకమైన వార్తలు