• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - 2019 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎలా ఉండ‌నుంది?

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌.. ఈ పేరు తెలియ‌ని టెకీలు ఉండ‌రు. కంప్యూట‌ర్‌లో ఓన‌మాలు నేర్చుకునే ద‌శ‌లోనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఏమిటో మ‌న‌కు తెలిసిపోతుంది. దీనిలో వ‌ర్డ్‌, ఎక్స‌ల్‌, ప‌వ‌ర్ పాయింట్‌ లాంటి టూల్స్ ఉండేది.  వీటి ద్వారా బేసిక్‌గా మ‌న అవ‌స‌రాల‌ను చాలా వ‌ర‌కు తీర్చుకునే అవ‌కాశం ఉంది. మారుతున్న ప‌రిస్థితుల‌కు తోడు ఎప్ప‌టిక‌ప్పుడు వెర్ష‌న్లు కూడా మారిపోతూ ఉంటాయి ఎంఎస్ ఆఫీస్‌లో! ఎంఎస్ ఆఫీస్‌1999 నుంచి వెర్ష‌న్లు మారుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం ఎంఎస్ ఆఫీస్ 2016 వెర్ష‌న్ న‌డుస్తోంది. మ‌రి త‌ర్వాత వెర్ష‌న్ ఎంఎస్ ఆఫీస్ 2019 అని వినిపిస్తోంది. మ‌రి ఈ కొత్త వెర్ష‌న్ ఎలా ఉండ‌బోతోంది?

ఈ ఏడాది ద్వితీయార్ధంలో..
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అన‌గానే మ‌న‌కు గుర్తొచ్చేది ఎక్స‌ల్‌, ప‌వ‌ర్ పాయింట్‌, అవుట్ లుక్‌, వ‌న్‌నోట్ ఆఫీస్ సూట్‌లో మ‌రిన్ని ఆప్ష‌న్లు ఉంటాయి. ఆఫీస్ ఆన్‌లైన్‌, ఆఫీస్ మొబైల్‌, ఆఫీస్ 2016తో పాటు ఆఫీస్ 365 కూడా దీనిలో ఉంది. రాబోయే ఎంఎస్ ఆఫీస్ 2019లో కూడా మ‌రిన్ని కొత్త ఆప్ష‌న్లు ఉండ‌బోతున్నాయి. ఈ కొత్త వెర్ష‌న్‌తో కూడిన సాఫ్ట్‌వేర్ 2018 ఏడాది మ‌ధ్య‌లోనే వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది. బేటా వెర్ష‌న్ కింద ఈ కొత్త వెర్ష‌న్‌ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో వ‌ద‌లుతున్నారు. కొత్త ఏడాదిలో 365 ప్రొ ప్ల‌స్ క‌లిసిన వెర్ష‌న్ రిలీజ్ కానుంది. 

కొత్త ఫీచ‌ర్లు ఏం ఉండ‌బోతున్నాయంటే..
ఎంఎంస్ ఆఫీస్ 2019 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. దీనికి కార‌ణం దీనిలో ఉండే ఫీచ‌ర్లే. ఈ కొత్త ఫీచ‌ర్ల‌తో ఆఫీస్ మ‌రింత వేగంగా అంద‌రికి చేరువ‌వుతుంద‌నేది ఆ సంస్థ న‌మ్మ‌కం.  రాబోయే వెర్ష‌న్‌లో అలాంటి కొత్త ఫీచ‌ర్లు ఏమి ఉన్నాయో చూద్దాం..

1. కొత్త‌గా మ‌రియు మెరుగుప‌రిచిన ఇంకింగ్ ఫీచ‌ర్లు, ప్రెష‌ర్ సెన్సిటివిటీ, ట్లిట్ ఎఫెక్టులు, ఇక్ రిప్లే 

2. డేటాను అనాల‌సిస్ చేయ‌డానికి న్యూ ఎక్స‌ల్ ఫార్మ‌లాలు, చార్ట్‌లు ఉంటాయి. మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్ కాలిక్యులేష‌న్స్‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

3. మోర్ఫా, జూమ్ లాంటి విజువ‌ల్ యానిమేష‌న్ ఫీచర్లు ఉంటాయి. ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్స్‌ను మ‌రింత మెరుగు ప‌రిచేందుకు ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

4. ఆఫీస్ 365 హోమ్ ధ‌ర 99.99 డాల‌ర్లు, ఆఫీస్ 365 ప‌ర్స‌న‌ల్ ధ‌ర 69.99 డాల‌ర్లు, ఆఫీస్ హోమ్‌, స్టూడెంట్  2016 పీసీ వెర్ష‌న్ ధ‌ర 149.99 డాల‌ర్లుగా నిర్ణయించారు.

జన రంజకమైన వార్తలు