• తాజా వార్తలు

5000 ఎంఏహెచ్ బ్యాటరీతో తొలి ఫోన్ తెస్తున్న మోటోరోలా

అందమైన మోఢళ్లు, అదిరిపోయే ఫీచర్లు ఉన్నా కూడా బ్యాటరీ విషయంలో సరైన పర్ఫార్మెన్సు ఇవ్వలేని మోటోరోలా ఫోన్లపై చాలామందికి నమ్మకం తక్కువ. ఇప్పుడు ఆ లోపాన్ని సవరిస్తూ మోటోరోలా సరికొత్త స్మార్టు ఫోన్ ను తీసుకొస్తోంది. ఎన్నడూ లేనట్లుగా తొలిసారిగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్టు ఫోన్ ను మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో ఈ4 ప్లస్‌'ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వేరియంట్ ను బట్టి రూ.11,600. నుంచి రూ.13400 వరకు ఉండనుంది.
మరోవైపు ఇంతే బ్యాటరీ సామర్థ్యంలో మోటోరోలా ఈ4 పవర్ పేరుతో మరో ఫోన్ ను కూడా లాంచ్ చేయబోతున్నప్పటికీ ఈ4 ప్లస్ దానికంటే ముందే మార్కెట్ కు రానున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మోటోరోలా నుంచి 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న తొలి స్మార్టు ఫోన్ ఈ4 ప్లస్సే కానుంది. ఇది ఇప్పటికే గ్లోబల్ గా లాంఛ్ అయినా త్వరలో ఇండియాలో రానుంది.
మోటో ఈ4 ప్లస్ స్పెసిఫికేషన్లు
* 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
* 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.4 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
* 2/3 జీబీ ర్యామ్
* 16/32 జీబీ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 7.1 నూగట్
* 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా

జన రంజకమైన వార్తలు