• తాజా వార్తలు

ప్రివ్యూ - మీ  మెడిసిన్స్ అన్నింటినీ ఒకే ప‌ర్స‌న‌లైజ్డ్ పిల్‌గా మార్చే 3డీ ప్రింటర్

లైఫ్ స్టైల్ మారిపోయింది. కంప్యూట‌ర్ ముందు కూర్చుంటే దాదాపు అన్ని ప‌నులు ఆన్‌లైన్‌లో చ‌క్క‌బెట్టేసుకోవ‌చ్చు.    దీంతో మ‌న‌కు ఆ కాస్త వ్యాయామం కూడా లేక బోల్డ‌న్ని జ‌బ్బులు. ఇక వ‌య‌సుమీద ప‌డితే వ‌చ్చేవి మ‌రిన్ని. వీట‌న్నింటినీ త‌గ్గించుకోవ‌డానికి రోజుకు 10, 15 ర‌కాల మందు బిళ్ల‌లు మింగ‌డం . అయితే అన్ని మందులు మింగాలంటే విర‌క్తి పుట్టడం ఖాయం. ప‌ని ఒత్తిడిలో ప‌డి మ‌రిచిపోయేవాళ్లూ త‌క్కువేం కాదు. వీట‌న్నింటినీ ప‌రిష్కారంగా ఒక రోజులో మీరు వేసుకునే మందుల‌న్నీ ఒకే క్యాప్సూల్‌గా ఇచ్చేస్తే. ఆ ఊహే  సూప‌ర్‌ అనుకుంటున్నారా? ఊహ‌కాదు నిజం. త్వ‌ర‌లో అందుబాటులోకి కూడా రాబోతోంది. 
3డీ ప్రింట‌ర్‌తో 
రోడ్ ఐలాండ్ అనే స్టార్ట‌ప్ కంపెనీ ఆటో కాంపౌండ‌ర్ పేరుతో ఓ చిన్న త్రీ డీ ప్రింట‌ర్‌ను  త‌యారుచేసింది.  ఇది టోస్ట‌ర్ సైజ్‌లో ఉంటుంది.  మందుబిళ్ల‌లను మిక్స్ చేసి ఒకే క్యాప్సూల్‌గా అందిస్తుంది.  మామూలుగా మ‌నకు మెడిక‌ల్ షాపులో ప్రిస్క్రిప్ష‌న్ చూసి మెడిసిన్స్ ఇవ్వ‌డానికి ఎంత టైం ప‌డుతుందో ఇంచుమించుగా అంతే టైంలో మీ ఆల్ ఇన్ వ‌న్ పిల్ త‌యార‌యిపోతుంది. మీరు రోజులో రెండు మూడుసార్లు వేసుకునే మందులు ఒకే క్యాప్సూల్‌గా లేదా ర‌క‌ర‌కాల మందుల‌న్నీ క‌లిపి ఒక‌టే పాలీ పిల్‌గా త‌యారుచేస్తుంది.  ప్ర‌తి డోస్‌కు మ‌ధ్య‌లో ఆటో క్లీన్ చేస్తుంది కాబ‌ట్టి  కంటామినేషన్ ప్రాబ్లం కూడా వ‌స్తుంది. 
ఈ ఆటో కాంపౌండ‌ర్ ధ‌ర 5వేల డాల‌ర్ల‌కు పైగా ఉంటుంది. 2 మిలియ‌న్ డాల‌ర్ల‌తో చేప‌ట్టే ఈ  వెంచ‌ర్ తొలి ప్రింట‌ర్ల‌ను 2018 ఫ‌స్ట్ క్వార్ట‌ర్‌లో రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.  

జన రంజకమైన వార్తలు