• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - వాస‌న చూసి వ్యాధిని పసిగ‌ట్టే.. ఈ -నోస్‌

టెక్నాల‌జీ అన్నింటినీ ఈజీ చేస్తోంది.  క్లినిక‌ల్ డ‌యాగ్నోస్టిక్స్‌లోనూ టెక్నాల‌జీ చాలా మార్పులు తెచ్చింది.. తెస్తోంది కూడా. పెద్ద పేగు సంబంధిత రోగాల‌ను గుర్తించాలంటే పెద్ద త‌తంగ‌మే. స్టూల్ (మ‌లం) శాంపిల్ తీసుకుని దాన్ని ప‌రీక్ష చేసి నిర్ధారించాలి. దీన్ని సులువుగా మార్చ‌డానికి కొత్త టెక్నిక్‌ను సైంటిస్ట్‌లు క‌నిపెట్టేశారు.  అదే ఎల‌క్ట్రానిక్ నోస్‌.  శాంపిల్ తీసి దీని ద‌గ్గ‌ర పెడితే క్రాన్స్ డిసీజ్‌, అల్స‌రేటివ్ కోలిటైటిస్ వంటి రోగాల‌ను ఇట్టే క‌నిపెట్టేస్తుంద‌ట‌. 
90% క‌చ్చితం
స్పెయిన్‌లోని పాలిటెక్నిక్ యూనివ‌ర్సిటీ ఆఫ్ వాలెన్షియా, లా ఫే హెల్త్ ఇన్వెస్టిగేషన్  ఇనిస్టిట్యూట్ సైంటిస్ట్‌లు క‌లిసి ఈ ఎల‌క్ట్రానిక్ నోస్‌ను త‌యారు చ‌శారు. దీనికి మూసీ 32 ఈ నోస్  (Moosy 32 eNose)అని పేరు పెట్టారు. పెద్ద ప్రేగు సంబంధిత రోగాలు ముఖ్యంగా  క్రాన్స్ డిసీజ్‌, అల్స‌రేటివ్ కోలిటైటిస్ ల‌ను ఈ నోస్ ద్వారా కేవ‌లం మూడే నిముషాల్లో 90% యాక్యురేట్‌గా డిటెక్ట్ చేయొచ్చ‌ని చెబుతున్నారు.
ఎలా ప‌ని చేస్తుంది?  
ఈ నోస్‌లో స్పెష‌ల్ సెన్స‌ర్లు ఉంటాయి. ఇవి వోల‌టైల్  ఆర్గానిక్ కాంపౌండ్స్‌(గాఢ‌మైన వాస‌న క‌లిగిన ర‌సాయ‌న స‌మ్మేళ‌నాల)ను స్మెల్ చూసి గుర్తించ‌గలుగుతాయి. పెద్ద పేగు సంబంధిత వ్యాధులున్న మ‌నిషి మ‌లంలో గాఢ‌మైన వాస‌న‌లు వ‌స్తాయి. వాటిని బ‌ట్టి ఈజీగా వ్యాధిని గుర్తిస్తాయి. అంతేకాదు వ్యాధి తీవ్ర‌త‌ను కూడా అంచ‌నా వేస్తాయి.  ఇప్ప‌టివ‌ర‌కు 445 నుంచి సాంపిల్స్ క‌లెక్ట్ చేసి టెస్ట్‌లు చేశారు. పరిశోధ‌న మ‌రింత అభివృద్ధి చేయాల్సి ఉంద‌ని సైంటిస్ట్‌లు చెబుతున్నారు.  

జన రంజకమైన వార్తలు