• తాజా వార్తలు

 ప్రివ్యూ - చేతికి క‌ట్టుకుంటే చాలు మీ నిద్ర జాతకం  మొత్తం చెప్పే రిస్ట్  గ్యాడ్జెట్  

స‌రిగా నిద్ర‌ప‌ట్ట‌డం లేదా?   నిద్ర‌లో అనీజీగా ఉంటుందా? అయితే ఈ రిస్ట్ గ్యాడ్జెట్ ధ‌రించి నిద్ర‌పోండి. అస‌లు మీ నిద్ర ఎంత సుఖంగా ఉంది?  లోపాలేమి ఉన్నాయి మొత్తం చెప్పేస్తుంది.  యాక్టిమీట‌ర్ అని పేరు పెట్టిన ఈ గ్యాడ్జెట్‌తో మీ నిద్రలో స‌మ‌స్య‌ల‌ను గుర్తిస్తారు. వాటి ద్వారా మీకు వ్యాయామం, చికిత్స ఏది అవ‌స‌ర‌మో వైద్యులు రిక‌మెండ్ చేయొచ్చు. 
పిల్లాడి నుంచి వృద్ధుల వ‌ర‌కు స్టడీ
మ‌నిషికి తిండి ఎంత ముఖ్య‌మో నిద్ర అంతే ముఖ్యం. స‌రైన నిద్ర ఆరోగ్యానికి చిహ్నమంటారు డాక్ట‌ర్లు. అందుకే జ‌ర్మ‌నీలోని లూడ్విగ్ మాక్సిమిల‌న్ యూనివ‌ర్సిటీ ఆప్ మ్యూనిచ్ రీసెర్చ‌ర్లు మ‌నిషి నిద్ర అల‌వాట్ల మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల పిల్లాడి నుంచి 92 ఏళ్ల వృద్ధుల వ‌ర‌కు దాదాపు 20వేల రోజుల నిద్ర డేటాను వాళ్లు సేక‌రించారు. 574 డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌ల‌ను స్టడీ చేశారు.  
యాక్టిమీట‌ర్ ఎలా ప‌ని చేస్తుందంటే..
నిద్ర క్వాలిటీని గుర్తించ‌డానికి యాక్టిమీట‌ర్ అనే రిస్ట్ బ్యాండ్ లాంటి ప‌రిక‌రాన్ని డిజైన్ చేశారు. దీన్ని చేతికి క‌ట్టుకుని నిద్ర పోతే నిద్ర క్వాలిటీని 0 నుంచి 100 లోపు మెజ‌ర్ చేస్తారు. 100 వ‌స్తే మంచి నిద్ర ప‌డుతున్న‌ట్లు. లోకోమీట‌ర్ ఇనాక్టివిటీ డ్యూరింగ్ స్లీప్ (LIDS) అని ఈ మెజ‌ర్‌మెంట్‌కు పేరు పెట్టారు.  వ‌చ్చిన రీడింగ్‌నుబ‌ట్టి వాళ్లు గ‌తంలో స్ట‌డీ చేసిన స‌మ‌స్య‌ల్లో దేనికి ద‌గ్గ‌రగా ఉందో ఎసెస్ చేస్తారు.  గ‌తంలో ఇలాంటి డివైస్‌లు చాలా వ‌చ్చాయ‌ని, అయితే త‌మ ద‌గ్గ‌ర వేల కొద్దీ కేస్ స్టడీస్‌కు సంబంధించిన అధ్య‌య‌నం ఉండ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌ను ఈజీగా గుర్తించ‌గ‌లుగుతామ‌ని ఈ సైంటిస్ట్‌లు చెబుతున్నారు. 

జన రంజకమైన వార్తలు