• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - నెక్స్ట్ ఆండ్రాయిడ్ వెర్ష‌న్ నుంచి కాల్ రికార్డింగ్  ఫీచ‌ర్  ఉండ‌దా?

గూగుల్ ఆండ్రాయిడ్ డివైస్‌ల కోసం ఇంచుమించుగా ఏడాదికో కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ (ఓఎస్‌)ను రిలీజ్ చేస్తోంది. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ ఓరియో ఇంకా అన్ని ఫోన్లకు రాక ముందే మ‌రో కొత్త ఓఎస్ డెవ‌ల‌ప్ చేస్తోంది. ఆండ్రాయిడ్ పీ (Android P)గా పిలిచే ఈ కొత్త ఓఎస్‌లో గూగుల్ ఏం డెవ‌ల‌ప్‌మెంట్స్ తీసుకురాబోతుందా అని టెక్ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త ఓఎస్ రావ‌డానికి ఇంకా టైమ్ ఉన్న‌ప్ప‌టికీ కాల్ రికార్డింగ్‌లో మార్పులు ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. 

కావాలంటే డిసేబుల్ చేసుకోవ‌చ్చు
ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ( AOSP)లో  కొన్ని కోడ్స్‌ను బ‌ట్టి చూస్తే అందులో call recording tone అనే ప‌దం ఎక్కువసార్లు క‌నిపించిందని  ఎక్స్‌ప‌ర్ట్‌లు చెబుతున్నారు.అంటే ఈ కాల్ రికార్డింగ్ ఫీచ‌ర్‌లో మార్పులు ఉండబోతున్నాయ‌ని భావిస్తున్నారు. అస‌లు కాల్ రికార్డింగ్ ఫీచ‌ర్‌ను ఓఎస్ నుంచి తొల‌గిస్తారా అనే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. కాల్ రికార్డింగ్ టోన్‌ను 1400 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ టోన్‌గా చెబుతారు. ఇది మ‌నం కాల్ రికార్డ్ చేస్తున్న‌ప్పుడు ప్ర‌తి 15 సెక‌న్ల‌కు ఒక‌సారి  రిపీట్ అవుతుంది. దీన్ని కాల్ మాట్లాడుతున్న అవ‌త‌లి వ్య‌క్తి కూడా ఈ 15 సెక‌న్ల‌కోసారి వ‌చ్చే బీప్ లాంటి సౌండ్‌ను విన‌గ‌లుగుతాడు.  టెలికం రెగ్యులేట‌రీ కంప్ల‌యిన్స్ రిక్వ‌యిర్‌మెంట్స్‌ను రీచ్ కావ‌డం కోసం మొబైల్ ఓఎస్‌ల్లో ఈ ఫీచ‌ర్‌ను పెడుతున్నారు.అయితే గూగుల్ త‌యారు చేస్తున్న ఆండ్రాయిడ్ పీ ఓఎస్‌లోని కొన్ని కోడ్స్‌ను బ‌ట్టి చూస్తే మొబైల్ నెట్‌వ‌ర్క్ సంస్థ‌లు కావాలంటే ఇలా 15 సెక‌న్ల‌కోసారి వ‌చ్చే రిపీట్ సౌండ్‌ను డిసేబుల్ చేసుకోవ‌చ్చు. దీన్ని బ‌ట్టి కొత్త ఓఎస్‌లో కాల్ రికార్డింగ్ ఫీచ‌ర్ నామ‌మాత్రంగా మారిపోనుంద‌ని భావిస్తున్నారు.
మార్చిలో బీటా వెర్ష‌న్‌.. అక్టోబ‌ర్‌లో ఫుల్ వెర్ష‌న్‌
ఆండ్రాయిడ్ పీ కి సంబంధించిన బీటా వెర్ష‌న్‌ను గూగుల్  ఈ  మార్చి నెల‌లో రిలీజ్ చేయ‌బోతోంది. అన్నీ పూర్త‌య్యాక అక్టోబ‌ర్‌లో జ‌రిగే గూగుల్ ఐవో ప్రోగ్రామ్‌లో ఫుల్ వెర్ష‌న్ రిలీజ‌వుతుంది.  నోకియా, వ‌న్‌ప్ల‌స్ లాంటి కంపెనీలు త‌మ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ పీ ఓఎస్‌ను ఇస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. 

జన రంజకమైన వార్తలు