• తాజా వార్తలు
  •  

నోకియా 5.. ఈ రోజే రిలీజ్

 దాదాపు నెల‌రోజులుగా ప్రీ ఆర్డ‌ర్స్ బుక్ చేసుకుంటున్న నోకియా 5  ఈ రోజు  (ఆగ‌స్టు 15) నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ల‌భించ‌నుంది. అయితే సెలెక్టెడ్ సిటీస్‌లో మాత్ర‌మే రేప‌టి నుంచి అందుబాటులోకి రాబోతోంది.  నోకియా స్మార్ట్‌ఫోన్లు త‌యారుచేస్తున్న HMD Global ఇప్ప‌టివ‌ర‌కు త‌న‌స్మార్ట్ ఫోన్ల‌ను మొద‌ట ఆన్‌లైన్లోనే అమ్మింది. అయితే నోకియా 5ను మొద‌ట ఆఫ్‌లైన్ స్టోర్ల‌లోనే అమ్మ‌బోతోంది.

ఏయే సిటీస్ లో ముందు? 

ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబ‌యి, బెంగుళూరు, చెన్నై, ఛండీగఢ్‌, జైపూర్‌, కోల్‌క‌తా, ల‌క్నో, ఇండోర్‌, హైద‌రాబాద్‌, పుణె, అహ్మ‌దాబాద్‌, కాలిక‌ట్ న‌గ‌రాల్లోని సెలెక్టెడ్ అవుట్‌లెట్స్‌లో నేటి నుంచి నోకియా 5 సేల్స్ ప్రారంభ‌మ‌వుతాయి. నోకియా 5 మేట్ బ్లాక్‌, సిల్వ‌ర్‌, టెంప‌ర్డ్ బ్లూ, కాప‌ర్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. అయితే ఫ‌స్ట్ మేట్ బ్లాక్ కల‌ర్ వేరియంట్స్ మాత్ర‌మే ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో దొరుకుతాయి. త‌ర్వాత మిగిలిన క‌ల‌ర్స్‌ను కూడా తీసుకొస్తారు. మిగిలిన న‌గ‌రాల్లోని ఆఫ్‌లైన్ స్టోర్ల‌కు కూడా త‌ర్వాత ద‌శ‌లో అమ్మ‌కాలు ప్రారంభిస్తామ‌ని HMD Global అనౌన్స్ చేసింది. 

నోకియా 5 లాంచింగ్ ఆఫ‌ర్స్ 

Nokia 5 ... 12,4999 రూపాయ‌ల‌కు దొరుకుతుంది. వొడాఫోన్ క‌స్ట‌మ‌ర్లు 149 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే ఈ ఫోన్ మీద నెల‌కు 5 జీబీ డేటా మూడు నెల‌ల‌పాటు ఫ్రీగా ఇవ్వ‌బోతున్నారు. అంతేకాదు నోకియా 5 కొనుగోలుదార్ల‌కు  2,500 రూపాయ‌ల  Makemytrip.com వోచ‌ర్లు కూడా ఇస్తారు. దీనిలో  1,800  హోట‌ల్ బిల్స్ మీద‌, 700 రూపాయ‌ల డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జీల్లోనూ వాడుకోవ‌చ్చు. 

నోకియా 5 స్పెసిఫికేష‌న్స్ 

* 5.2 ఇంచెస్ హెచ్ డీ డిస్‌ప్లే

* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 430 ఎస్‌వోసీ ప్రాసెస‌ర్‌

* 2 జీబీ ర్యామ్‌

* 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ (128 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్‌)

* 13 మెగాపిక్సెల్ రియ‌ర్ కెమెరా విత్ ఫ్లాష్‌లైట్

* 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా

* 3,000  ఎంఏహెచ్ బ్యాట‌రీ

*  ఆండ్రాయిడ్ 7.1.1 నూగ‌ట్ ఓఎస్

జన రంజకమైన వార్తలు