• తాజా వార్తలు

పాన‌సోనిక్ నుంచి కంటికి క‌న‌ప‌డ‌ని టీవీ.. ఫ‌స్ట్ ఇండియాకే వ‌స్తుందా?

పాన‌సోనిక్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తయారు చేస్తున్న ప్ర‌పంచ‌పు తొలి ఇన్‌విజ‌బుల్ టెలివిజ‌న్ (కంటికి క‌న‌ప‌డని టీవీ) ఇండియాలోనే ఫ‌స్ట్ లాంచ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఏడాది క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ షోలో దీన్ని పాన‌సోనిక్ ప్ర‌ద‌ర్శించింది. అప్ప‌టి నుంచి టెక్నాల‌జీ రంగంలో ఎక్స్‌ప‌ర్ట్‌ల‌ను, టాప్ కంపెనీల్లో కూడా ఈ ఇన్విజ‌బుల్ టీవీ చాలా క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. ఇండియన్ టీవీ మార్కెట్‌లో పాన‌సోనిక్‌కు 7.5% వాటా ఉంది. అయితే ప్రీమియం రేంజ్ 4కే అల్ట్రా హైడెఫినిష‌న్ టీవీల మార్కెట్‌లో షేర్ పెంచుకోవాల‌ని భావిస్తోంది. దీనిలో భాగంగానే ఈ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ఇన్విజ‌బుల్ టీవీని అన్ని దేశాల కంటే ముందు ఇండియాలో లాంచ్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇన్విజబుల్ టీవీ అంటే.. ఇన్విజ‌బుల్ టీవీ అంటే ఈ టీవీని ఆఫ్ చేసిన‌ప్పుడు అది ఒక సాధార‌ణ గ్లాస్ మాదిరిగా మాత్ర‌మే ఉంటుంది. అప్పుడు దాన్ని చూస్తే టీవీ అనుకోరు. దాని ముందు చెయ్యి ఊపినా లేదా ట‌చ్ చేసినా టీవీ ఆన్ అవుతుంది. ఆఫ్ చేయాల‌న్నా అదే గెస్చ‌ర్స్ చాలు. ఆఫ్ చేసిన‌ప్పుడు కేవ‌లం గ్లాస్ మాదిరిగా క‌నిపించ‌డం కోసం ఎల్ఈడీ స్క్రీన్‌ను తొలుత ఉప‌యోగించారు. దీన్నే క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ షోలో ప్ర‌ద‌ర్శించారు.ప‌క్కాగా గ్లాస్‌లా క‌నిపించ‌డం కోసం దీని స్థానంలో ఓఎల్ఈడీ స్క్రీన్‌ను వాడుతున్‌‌ట్లు పానసోనిక్ చెబుతోంది. ఎల్ల్డఎల్ీ దీనిలో గెస్చ‌ర్స్ ఆధారంగా ప‌ని చేసే యాప్స్ ఉంటాయి. ఇవి మ‌న గెస్చ‌ర్ ను బ‌ట్టి మ్యూజిక్ ప్లే చేయ‌డం, మూవీని చూపించ‌డం వంటివ‌న్నీ చేస్తాయి. రెండేళ్లు ప‌ట్ట‌చ్చు ఈ టీవీనీ పూర్తి స్థాయిలో మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టేంత పెద్ద సంఖ్య‌లో ఉత్ప‌త్తి చేయ‌డానికి రెండు సంవ‌త్స‌రాలు ప‌ట్ట‌వ‌చ్చ‌ని పాన‌సోనిక్ చెబుతుంది. అయితే ఇండియ‌న్ మార్కెట్‌లో ఉన్న స్కోప్‌ను బ‌ట్టి ఈ టీవీని ఇక్కడే మొద‌ట లాంచ్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని, దీని గురించి ఇప్పుడే మాత్రం క‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని పాన‌సోనిక్ సీనియ‌ర్ అఫీషియ‌ల్స్ చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు