• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - పేటీఎం రూపే డెబిట్ కార్డ్..

గ‌ల్లీలో పాల బూత్ నుంచి ఢిల్లీలో హోట‌ల్ వ‌ర‌కు పేటీఎం ఇప్పుడు అంద‌రూ యాక్సెప్ట్ చేస్తున్న పేమెంట్ సిస్టం పేటీఎం.  అందుకే పేటీఎంను ఇప్ప‌టివ‌ర‌కు 10కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.  డిజిట‌ల్ వాలెట్‌గా స‌క్సెస్ అయిన పేటీఎం త‌ర్వాత ఈ కామ‌ర్స్ సైట్ పేటీఎం మాల్‌, పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌, భీమ్ యూపీఐ స‌ర్వీస్‌లు కూడా ప్రారంభించింది. ఇప్ప‌డు పేటీఎం రూపే డెబిట్ కార్డ్‌ను కూడా ఇంట్ర‌డ్యూస్ చేసింది. మీరు ఆర్డ‌ర్ చేస్తే మీ పేరు మీద పేటీఎం రూపే డెబిట్ కార్డ్ మీ ఇంటికే డెలివ‌రీ అవుతుంది. ఈ డెబిట్ కార్డ్‌తో మీ పేటీఎం వాలెట్‌లోని మ‌నీని  ఏ ఏటీఎంలోనైనా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.   కార్డ్‌కు ఏడాదికి 100 రూపాయ‌ల యాన్యువ‌ల్ స‌బ్‌స్క్రిప్ష‌న్ చెల్లిస్తే చాలు.
పేటీఎం డెబిట్ కార్డ్‌ను ఎలా పొందాలి?
1.పేటీఎం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. ఇప్ప‌టికే మీకు పేటీఎంలో అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి.  లేక‌పోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. 
3.ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇప్ప‌టికే మీకు ఈ అకౌంట్ ఉంటే నేరుగా త‌ర్వాత స్టెప్‌కు వెళ్లిపోవ‌చ్చు.
4.త‌ర్వాత యాప్‌లో బ్యాంక్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీకు New Physical Card ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఇక్క‌డ మీరు కొత్త కార్డ్‌ను ఆర్డ‌ర్ చేయాలి.
6.మీ షిప్పింగ్ అడ్ర‌స్ ఎంట‌ర్ చేసి పేమెంట్ మెథ‌డ్‌తో యాన్యువ‌ల్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌, డెలివ‌రీ ఛార్జీలు పే చేయాలి.
7.  డైరెక్ట్‌గా పేటీఎం రూపే డెబిట్ కార్డ్ మీ ఇంటికే హోం డెలివ‌రీ అవుతుంది.
పేటీఎం డెబిట్ కార్డ్‌ను ఎలా వాడుకోవాలి?
ఏటీఎంల్లో 

మీ బ్యాంక్ డెబిట్ కార్డ్ మాదిరిగానే స్వైప్ చేసి పిన్ ఎంట‌ర్‌చేసి ట్రాన్సాక్ష‌న్ చేసుకోవాలి. మామూలు బ్యాంక్ డెబిట్ కార్డ్‌ల మాదిరిగానే  విత్‌డ్రాయ‌ల్‌, మినీ స్టేట్‌మెంట్ తీసుకోవ‌చ్చు. మెట్రో సిటీస్ లో అయితే నెల‌కు 3సార్లు, నాన్ మెట్రో సిటీస్‌లో నెల‌కు 5సార్లు మ‌నీ తీసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత ట్రాన్సాక్ష‌న్‌కు 20 రూపాయ‌ల ఛార్జి ప‌డుతుంది. 
ఆన్‌లైన్ సైట్స్‌, యాప్స్‌లో.. 
ఆన్‌లైన్ సైట్స్‌, యాప్స్‌లో పేమెంట్ ఆప్ష‌న్స్‌లో డెబిట్ కార్డ్‌ను సెలెక్ట్ చేసి మీ పేటీఎం డెబిట్ కార్డ్‌పై ఉన్న 16 అంకెల నెంబ‌ర్, ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ ఎంట‌ర్ చేయాలి. ఇప్పుడు ఇది పేటీఎంకు రీడైరెక్ట్ అవుతుంది. అప్పుడు ఓటీపీని ఎంట‌ర్ చేస్తే పేమెంట్ పూర్తవుతుంది.
పేటీఎం రూపే డెబిట్ కార్డ్ బెనిఫిట్స్‌
పేటీఎం రూపే డెబిట్ కార్డ్ పేటీఎం పేమెంట్ బ్యాంక్ ద్వారా వ‌స్తుంది. ఇది జీరో బ్యాల‌న్స్ అకౌంట్‌.  
* కేవ‌లం ఏడాదికి 100 రూపాయ‌ల యాన్యువ‌ల్ స‌బ్‌స్రిప్ష‌న్ చెల్లిస్తే చాలు. ఇది ఏ బ్యాంక్ అకౌంట్‌తో పోల్చినా త‌క్కువే. 
* అన్ని ఏటీఎంల్లోనూ ప‌నిచేస్తుంది.
* రూపేతో ప‌వ‌ర్ అవుతుంది కాబ‌ట్టి రూపే కార్డ్‌కు వ‌చ్చే ఆఫ‌ర్ల్లు, డిస్కౌంట్స్ దీనికి కూడా వ‌ర్తిస్తాయి.
ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్‌
* పేటీఎం పేమెంట్ బ్యాంక్ యూజ‌ర్స్‌కే మాత్ర‌మే ఈ కార్డ్ ఇస్తారు.
* కార్డ్ పోగొట్టుకుంటే 100 రూపాయ‌లు, డెలివ‌రీ ఛార్జీ చెల్లిస్తే కొత్త కార్డ్ ఇస్తారు.
* ఇండియాలో జ‌రిగే ట్రాన్సాక్ష‌న్ల‌కు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంట‌ర్నేష‌నల్ ట్రాన్సాక్ష‌న్ల‌కు ప‌నికిరాదు.

జన రంజకమైన వార్తలు