• తాజా వార్తలు

ప్రివ్యూ - ఈ మార్చిలో రానున్న జియో ఫైబ‌ర్ ఎలా ఉండనుంది !

రియ‌ల‌న్స్ జియో.. ఇది సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. దేశంలో ల‌క్ష‌లాది మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్న ఈ సంస్థ ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్ లాంటి బ‌డా టెలికాం సంస్థ‌ల‌కు వణుకు పుట్టిస్తోంది. మార్కెట్లో త‌న ప‌ట్టుకోల్పోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తు ముందుకెళుతోంది. దీనిలో భాగంగా జియో.. బ్రాడ్‌బ్యాండ్ మీద దృష్టి సారించింది. ఇప్ప‌టిదాకా మొబైల్ డేటాను త‌క్కువ ద‌ర‌కే అందిస్తూ అంద‌ర్ని త‌న‌వైపు తిప్పుకున్న ఈ ముఖేశ్ అంబానీ సంస్థ‌.. తాజాగా బ్రాడ్‌బ్యాండ్‌ను తీసుకొచ్చే ప‌నిలో ప‌డింది. ఈ మార్చిలోనే రియ‌ల‌న్స్ జియో ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్ అరంగేట్రం చేయ‌డానికి రంగం సిద్ధం అవుతోంది.

టెస్టింగ్ ద‌శ‌లో..
ఇప్పుడు ఇంటింటికి జియో ఇంట‌ర్నెట్‌ను తీసుకెళ్లే ఉద్దేశంలో ఉన్న జియో... దీనిలో భాగంగా ఫైబ‌ర్ బ్యాడ్‌బాండ్‌ను తీసుకొచ్చే ప‌నిలో ఉంది. ప్ర‌స్తుతానికి దీన్ని టెస్టింగ్ నిర్వ‌హిస్తున్నారు. భార‌త్‌లోని ప‌ది న‌గ‌రాల్లో ఈ టెస్టు చేస్తున్నారు. సూర‌త్‌, ముంబ‌యి, అహ్మ‌దాబాద్‌, వ‌దోద‌ర‌, దిల్లీ, హైద‌రాబాద్‌, జామ్‌న‌గ‌ర్, విశాఖ‌ప‌ట్నం ఈ టెస్టింగ్ చేస్తున్న న‌గ‌రాల జాబితాలో ఉన్నాయి. తొలి ద‌శ‌లో  భాగంగా అహ్మ‌దాబాద్‌, దిల్లీ, హైద‌రాబాద్‌, విశాఖ‌ప్న‌టం, జైపుర్‌, కోల్‌క‌తా, ముంబ‌యి, సూర‌త్‌, వ‌దోద‌ర‌లో జియో ఫైబ‌ర్‌ను తీసుకు రావాల‌ని జియో ప్ర‌య‌త్నిస్తోంది.

3 నెల‌ల‌కు ఉచితంగా 100 ఎంబీపీఎస్‌
జియో వ‌చ్చిన కొత్త‌లో ఆరు నెల‌ల పాటు ఉచితంగా నెట్ అందించింది.  దీంతో జ‌నాలంద‌రూ జియో బాట ప‌ట్టారు. ఉచితంగా 4జీ స్పీడ్‌తో ఇంట‌ర్నెట్ వ‌స్తుంటే ఎవ‌రు వ‌దులుకుంటారు. అందుకే ఆ త‌ర్వాత జియో డ‌బ్బుల‌కు డేటా అమ్మినా...ధ‌ర పెంచినా కూడా ఎవ‌రూ పెద్ద‌గా బాధ‌ప‌డ‌లేదు. ఇదే సూత్రాన్ని బ్రాడ్‌బ్యాండ్‌కు కూడా అమ‌లు చేయాల‌నేది రిల‌య‌న్స్ వ్యూహం. మూడు నెల‌ల పాటు ఉచితంగా రోజుకు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంట‌ర్నెట్ అందించాల‌ని జియో ప్ర‌య‌త్నిస్తోంది. ఉచిత ఆఫ‌ర్ అయిపోయిన త‌ర్వాత నెల‌కు రూ.500 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే రోజుకు 600 జీబీ డేటాతో ఇంట‌ర్నెట్ వ‌స్తుంది. రూ.2 వేలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 1000 జీబీ డేటా వ‌స్తుంది.  స్సీడ్ మాత్రం 100 ఎంబీపీఎస్‌కు త‌గ్గ‌దు.

జన రంజకమైన వార్తలు