• తాజా వార్తలు

ఐఫోన్‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ 8లో వైర్‌లెస్ ఇయ‌ర్ ప్ల‌గ్స్‌ను తీసుకొస్తుందా?  



యాపిల్‌, శాంసంగ్‌..  హైఎండ్ ఫోన్ల‌లో పోటీ ఈ రెండింటి మ‌ధ్య‌నే ఉంటోంది.  అందుకే ఫీచ‌ర్స్ విష‌యంలో యాపిల్‌, శాంసంగ్ ఫోన్లు ఒక‌దానినొక‌టి బీట్ అవుట్ చేయ‌డ‌మో,  ఫాలో అయిపోవ‌డ‌మో జ‌రుగుతుంది.  ఇప్పటికే యాపిల్‌ సంస్థ వైర్‌లెస్‌ ఎయిర్‌ పాడ్స్‌ను తీసుకొచ్చింది. దానికి పోటీగా శాంసంగ్ రాబోయే  మోడ‌ల్ గెలాక్సీ నోట్ 8లో వైర్‌లెస్‌ ‘ఇయర్‌ప్లగ్స్‌’ను తీసుకురాబోతోంది.  
బిక్స్‌బీతో ప‌ని చేసేలా డిజైన్ 
ఈ ఎయిర్‌ప్లగ్స్ శాంసంగ్ తన సొంత వర్చువల్‌ అసిస్టెంట్‌ బిక్స్‌బీతో పని చేసేలా డిజైన్ చేయ‌నున్నారు.  నాయిస్ క్యాన్సిలేష‌న్ టెక్నాలజీతో ఈ ఇయ‌ర్‌ఫోన్స్ డిజైన్ చేశారు. ఈ ఇయర్‌ఫోన్స్‌ గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8ప్లస్‌ మోడల్స్‌కు పనిచేసేలా శాంసంగ్ ఏర్పాట్లు  చేస్తోంది. బిక్స్‌బీ శాంసంగ్ సొంత వాయిస్ అసిస్టెంట్‌. దీనిద్వారా  మొబైల్‌ను వాయిస్‌తో కంట్రోల్ చేసుకోవ‌చ్చు.  ఈ వైర్‌లైస్ ఇయ‌ర్‌ఫోన్స్‌ను బిక్స్‌బీతో ఆప‌రేట్ చేసుకోవ‌డం గెలాక్సీ నోట్ 8కు పెద్ద ఎట్రాక్ష‌న్ అవుతుంది.  ఎస్‌8, ఎస్ 8+ల‌తో ఈ ఏడాది ఫ్లాగ్ షిప్ ఫోన్ కంటెస్ట్‌లో స్ట్రాంగ్ గా నిల‌బ‌డిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 8ను కూడా  సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.  
 

జన రంజకమైన వార్తలు