• తాజా వార్తలు

ప్రివ్యూ - ఈ గ్లాస్ వ‌స్తే మీ ఫోన్ కింద ప‌డినా ఫిక‌ర్ అక్క‌ర్లేదు..

వేలు పెట్టి స్మార్ట్‌ఫోన్ కొంటాం.. కానీ కింద‌ప‌డిందంటే  గ్లాస్ ప‌గిలి ఫోన్ పనికి రాకుండా పోతుంది.ల‌క్ష‌లు పెట్టే కొనే టీవీలు, పెద్ద పెద్ద హోట‌ల్స్‌లో ఉండే భారీ ఆక్వేరియ‌మ్స్ ఇలా ఒక‌టేమిటి గ్లాస్‌తో చేసిన ఏ వ‌స్తువైనా చూడడానికి ఎంత అందంగా ఉంటుందో  కింద ప‌డితే అంతే సంగ‌తులు.   అద్దం పగిలినా దానిక‌దే తిరిగి అతుక్కోగ‌ల అద్దాన్నిక‌నిపెట్ట‌గ‌లిగితే ఇంకేం కింద‌ప‌డినా బెంగ‌ప‌డ‌క్క‌ర్లేదు. అదిగో అలాంటి సెల్ఫ్ హీలింగ్ గ్లాస్‌ను త‌యారుచేయ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. 
జ‌పాన్‌లోని టోక్యో యూనివ‌ర్సిటీలో యూయెన‌గిస‌వా అనే ఓ కెమిస్ట్రీ రీసెర్చ‌ర్ అడెహెసివ్స్ (వ‌స్తువుల‌ను అతికిండ‌చానికి వాడేజిగురు)పై ప‌రిశోధ‌న చేస్తుండగా యాక్సిడెంటల్‌గా దీన్ని కనిపెట్టారు.  గ్లాస్ సాంపిల్‌నురెండు ముక్క‌లుగా కింద విర‌గ్గొట్టి వాటిని క‌లిపారు.30సెకండ్ల త‌ర్వాత గ్లాస్ దానిక‌దే అతుక్కుపోయి పాత రూపంలోకి వ‌చ్చేసింది. అంటే ఒక వేళ గ్లాస్ ప‌గిలితే ఆ ముక్క‌ల‌ను క‌లిపితే ఆటోమేటిగ్గా అవి అతుక్కుని పూర్వ‌రూపానికి వ‌చ్చేస్తాయి.అదే  ఫోన్ గ్లాస్‌లాంటిది అయితే క్రాక్స్ దగ్గ‌ర సింపుల్‌గా ప్రెస్‌చేస్తే చాలు అవి ఎలాంటి క్రాక్స్ లేకుండా అతుక్కుపోతుంది.
నిజంగా సాధ్య‌మవుతుందా?
అయితే ఈ సెల్ఫ్ హీలింగ్ గ్లాస్ ఇప్ప‌టికిప్పుడు అందుబాటులోకి రాదు. ఎందుకంటే ఇది జ‌స్ట్ ప్ర‌యోగ‌ద‌శే. అత్యంత మ‌న్నిక‌గా,లైట్‌వెయిట్‌తో దీన్నిత‌యారుచేయాలంటే చాలా సంవ‌త్స‌రాలే ప‌డుతుంది. అంతేకాదు ఒక‌సారి పగిలాక దానిక‌దే అతుక్కున్నాఅంత ప‌టిష్టంగా ఉండ‌దు. కానీ 15 నుంచి 20ఏళ్ల‌పాటు నిల‌వ‌గ‌లిగే గ్లాస్‌ను  త‌యారుచేయ‌వ‌చ్చ‌ని, అయితే ఇందుకు చాలాకాలం ప‌ట్టొచ్చంటున్నారు రీసెర్చ‌ర్స్‌.  యెన‌గిస‌వా రీసెర్చ్‌తో మాత్రం దీనికి మార్గం ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు