• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - ఆన్‌లైన్‌ పెమెంట్లలో విధ్వంసక ఆవిష్కరణ - ఖాతా 

సాధార‌ణంగా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాలంటే ఏం చేస్తాం? క‌్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఇంకా లేక‌పోతే నెట్‌బ్యాంకింగ్ వాడ‌తాం. ఇప్పుడు వ్యాలెట్‌లు కూడా వ‌చ్చేశాయి. అయితే వీట‌న్నిటిని వెంట‌నే వాడేయ‌డం కుద‌ర‌దు. సీవీవీ, ఓటీపీ, పాస్‌వ‌ర్డ్‌లు ఇంకా చాలా కావాలి. అయితే ఇవేమీ లేకుండా నేరుగా సుల‌భంగా పేమెంట్ చేసే అవ‌కాశం ఉంటే! ఇలాగే ఆలోచించింది సింపుల్ అనే స్టార్ట‌ప్‌. ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా పేమెంట్ చేయ‌డానికి ఖాతా అనే అనే ఆప్ష‌న్‌ను తీసుకొచ్చింది. అంటే ఇదో లెడ్జ‌ర్ టైపు. మ‌రి ఏంటీ ఖాతా...ఇది క‌స్ట‌మ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఏంటీ ఖాతా!
ఇండియ‌న్ స్టార్ట‌ప్ సింపుల్ బ్రైయిన్ చైల్డ్ ఖాతా.  సింపుల్ స్టార్ట‌ప్ ఒక పేమెంట్ ప్లాట్‌ఫామ్‌. థ‌ర్డ్ పార్టీ స‌ర్వీసులైన జొమాటొ, బుక్ మై షోల లాంటి వాటిని పేమెంట్ గేట్ వేల‌ను క‌ల్పించ‌డం కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది. అయితే అన్ని ట్రాన్సాక్ష‌న్ల‌ను ఒకే బిల్‌గా రూపొందించి ప్ర‌తి 15 రోజుల‌కు పేమెంట్ చేసేలా చేయ‌డం కోస‌మే ఖాతా అనే ఆప్ష‌న్ క్రియేట్ చేసింది. దీని వ‌ల్ల ఉప‌యోగం ఏంటంటే కొత్త‌గా ఈ స‌ర్వీసును ఉప‌యోగించుకునేవాళ్లు వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌లు ఎంట‌ర్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. చేయాల్సింద‌ల్లా చాలా సింపుల్‌. మీకు కావాల్సిన ఐట‌మ్‌ను కార్ట్‌లోకి యాడ్ చేసుకుని..ఆర్డ‌ర్ ఓకే చేయాలి.  చివ‌రిగా వ‌చ్చేదే సింపుల్ బిల్ కింద లెక్క‌. 

బ్యాంక్ అకౌంట్, వ్యాలెట్ బ్యాలెన్స్ బాధ‌లేదు
ఇందులో ఉన్న మ‌రో సౌల‌భ్యం ఏమిటంటే ఏదైనా ఆన్‌లైన్‌లో కొనేట‌ప్పుడు బ్యాంక్ వివ‌రాలు ఇవ్వాలి... వ్యాలెట్‌లో డ‌బ్బులు యాడ్ చేయాలి లాంటి టెన్ష‌న్లు అక్క‌ర్లేదు. శాంపిల్ అనేది క్రెడిట్ సిస్ట‌మ్‌పై ప‌ని చేస్తుంది. అంటే బిల్స్‌ను నెలాఖ‌ర్లోనో లేదా నెల మ‌ధ్య‌లోనో క్లియ‌ర్ చేస్తే చాలు తిరిగి మ‌ళ్లీ శాంపిల్ స‌ర్వీసుల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. కొత్త యూజ‌ర్ల‌కు ఈ క్రెడిట్ లిమిట్ రూ.2500.  కొత్త‌గా ఈ సర్వీసును వాడుకునే వాళ్ల‌కు కొన్ని ఆఫ‌ర్లు ఇస్తోంది ఈ సంస్థ‌.

జన రంజకమైన వార్తలు