• తాజా వార్తలు

ప‌వ‌ర్ బ్యాంకుల్లో విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ మాడ్యుల‌ర్ ప‌వ‌ర్ బ్యాంక్‌

మ‌నం స్మార్ట్‌ఫోన్ ఉప‌యోగిస్తున్నామంటే క‌చ్చితంగా బ్యాట‌రీతో సంబంధం ఉంటుంది. బ్యాట‌రీ ఎంత బాగుంటునే మ‌నం అంత‌గా ఫోన్‌ను ఉప‌యోగించేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ యాప్‌లు పెరిగిపోయాక‌.. వాడ‌కం ఎక్కువైన త‌ర్వాత బ్యాట‌రీ ఎంతో సేపు నిల‌వ‌ట్లేదు. ఈ  నేప‌థ్యంలో మ‌న‌కు  అందుబాటులోకి వ‌చ్చాయి ప‌వ‌ర్ బ్యాంకులు. అంటే మ‌నం బ్యాట‌రీ అయిపోతుంద‌న్న చింత లేకుండా ఎక్క‌డైనా ఎప్పుడైనా ఫోన్‌లోకి ప‌వ‌ర్ నింప‌డ‌మే వీటి ప‌ని. ముఖ్యంగా ప్ర‌యాణాల్లో.. ఇంటికి దూరంగా ఉన్న స‌మ‌యంలో ప‌వ‌ర్ బ్యాంకులు గొప్ప‌గా ప‌ని చేస్తాయి. అయితే ఈ ప‌వ‌ర్ బ్యాంకుల్లోనే ఒక విధ్వంస‌క‌ర ఆవిష్క‌ర‌ణ వ‌చ్చింది అదే సినోవొల్ట్  మాడ్యుల‌ర్ ప‌వ‌ర్ బ్యాంకు. మ‌రి దాని విశేషాలేంటో చూద్దాం..

20,000 ఎంఏహెచ్‌తో..
సాధార‌ణంగా ప‌వ‌ర్ బ్యాంకులు 11 వేల ఎంఏహెచ్ సామ‌ర్థ్యం ఉంటే అబ్బో అహో అని అనుకుంటాం.. కానీ దానికి రెట్టింపు సామ‌ర్థ్యం ఉన్న ప‌వ‌ర్ బ్యాంకు అందుబాటులోకి వ‌స్తే!!  ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం.. సెకన్ల వ్య‌వ‌ధిలో బ్యాట‌రీని ఫుల్ చేసే మాడ్యుల‌ర్ ప‌వ‌ర్ బ్యాంకు త‌యారైంది. దీని సామర్థ్యం 20 వేల ఎంఏహెచ్‌. సినోవోల్ట్ పేరుతో వ‌స్తున్న ఈ ప‌వ‌ర్ బ్యాంకు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. దీనికి 10 యూనిక్ పోర్టులు ఉంటాయి. దీనిలో క్విక్ ఛార్జింగ్ టెక్నాల‌జీ మాత్ర‌మే కాదు డేటా ట్రాన్స‌ఫ‌ర్ ఎబిలిటీ కూడా ఉంది. 

మోటో,  ఎల్జీ సార‌థ్యంలో..
ఈ మాడ్యుల‌ర్ ప‌వ‌ర్ బ్యాంకులను త‌యారు చేయ‌డానికి  దిగ్గ‌జ సంస్థ‌లు మొట‌రోలా, ఎల్జీ ముందుకొచ్చాయి. ఇప్ప‌టికే దీనికి సంబంధించి ప్రొడ‌క్ష‌న్ కూడా మొద‌లైపోయింది. స్నాప్ ఆన్ మాడ్యుల్స్ టెక్నాల‌జీతో   అనుసంధానం అయి ఉండే ఈ ప‌వ‌ర్ బ్యాంకులు అత్యంత వేగంగా డివైజ్‌ను ఛార్జ్ చేయ‌డం వీటి ప్ర‌త్యేక‌త‌. 10 యూనిక్ పోర్టుల‌కు 100 వాట్స్ ప‌వ‌ర్ స‌ప్ల‌య్ చేయ‌డం  వీటి ప్ర‌త్యేక‌త‌. దీనిలో  5 పోర్టుల యూఎస్‌బీ అడాప్ట‌ర్‌, బ్లూటూత్‌, 4.1 స్పీక‌ర్‌, 12 వోల్ట్స్ కార్ అడాప్ట‌ర్ లాంటి ఆప్ష‌న్లు కూడా ఉన్నాయి. ఈ మాడ్యుల్స్‌ను సినోవొల్ట్ ప‌వ‌ర్ బ్యాంకుల‌కు ఈ ప‌క్క అయినా అమర్చుకోవ‌చ్చు. ఇది చాలా స్లిమ్‌గా ఉండి మీకు ఎక్క‌డైనా ఇమిడిపోతుంది.  ముఖ్యంగా ట్రావెలింగ్‌లో ఇదెంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో ఉండే బ్లూటూత్ స్పీక‌ర్‌, ఫ్లాష్‌లైట్ మాడ్యుల్స్ చాలా ఆస‌క్తిక‌ర‌మైన ఆప్ష‌న్లు.

జన రంజకమైన వార్తలు