• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ: స్మార్ట్‌ఫోన్ పిచ్చి నుంచి మిమ్మ‌ల్ని బ‌య‌ట‌పడేసే స‌బ్‌స్టిట్యూట్ ఫోన్ ఇదే

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే మ‌నం ఊరికే ఉంటామా! క్ష‌ణం తీరిక లేకుండా ఆ ఫోనే లోకంగా ఉంటాం. అన్నింటికి యాప్‌లు వ‌చ్చేశాక ఇక ఫోన్‌ను వ‌దల్లేక‌పోతున్నాం. ఒక్క మాట‌లో చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ల‌కు బానిస‌లుగా మారిపోయాం. పెద్ద వాళ్ల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే చిన్న పిల్లలు సైతం ఆండ్రాయిడ్ ఫోన్‌కు ఎడిక్ట్  అయిపోతున్నారు. ఇది వారి మీద ఎంతో ప్ర‌భావం చూపిస్తోంది. మ‌రి స్మార్ట్‌ఫోన్ ఎడిక్ష‌న్‌ను మానిపించి మ‌న‌ల్ని మ‌ళ్లీ మామూలు స్థితికి తీసుకు రావ‌డానికి ఒక స‌బ్‌స్టిట్యూట్ ఫోన్ అందుబాటులోకి వ‌చ్చింది. అదేంటో చూద్దామా..

అబాక‌స్ లాంటి...
ఆస్ట్రేలియ‌న్ డిజైన‌ర్  కెల్‌మెన్స్ ఈ స‌బ్‌స్టిట్యూట్ స్మార్ట్‌ఫోన్‌ను త‌యారు చేశాడు. అత‌ను ఒకే పోలిక‌తో ఉన్న ఐదు ఫోన్ల‌ను  రూపొందించాడు. బ్లాక్‌పోలీక్సీ మిథ‌లీన్ ప్లాస్టిక్‌తో ఈ ఫోన్లు త‌యార‌య్యాయి. ఈ ఫోన్ల ఫై భాగంలో కొన్ని రాళ్లు మ‌న‌కు క‌నిపిస్తాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే స‌బ్‌స్టిట్యూట్ ఫోన్ అబాక‌స్ మాదిరిగా ఉంటుంది. ఈ స్టోన్స్ సాయంతో యూజ‌ర్లు ఫోన్‌ను స్క్రోల్‌, పించ్‌, స్వైప్ చేయ‌చ్చ‌ని కెల్‌మెన్స్ చెబుతున్నాడు. దీనిలో వాడిన మెకానిజం మ‌న‌ల్ని ఫోన్ త‌క్కువ‌గా ఉప‌యోగించేలా చేస్తుంది. 

త్వ‌ర‌లో వ‌స్తున్నాయ్‌..
అయితే స‌బ్‌స్టిట్యూట్ ఫోన్లు ఇంకా త‌యారీ ద‌శ‌లోనే ఉన్నాయి. అవి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. వియ‌న్నా డిజైన్ వీక్‌లో ఈ స‌బ్‌స్టిట్యూట్ ఫోన్‌ను ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించారు. ఇదెలా ఉందంటే స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చిన కొత్త‌లో రిటైల‌ర్లు డ‌మ్మీ ఫోన్ల‌ను ఇచ్చి ప‌రిశీలించ‌మ‌నేవాళ్లు. స‌బ్‌స్టిట్యూట్ ఫోన్ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది.  మీకు నిజంగా  స్మార్ట్‌ఫోన్ అడిక్ష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని అనుకుంటే ఈ డ‌మ్మీ ఫోన్లు మంచి ప్ర‌త్యామ్నాయం. ఉదాహ‌ర‌ణ‌కు ఐఫోన్ 6  డ‌మ్మీ  కావాలంటే మీరు 19.99 డాల‌ర్లు పెట్టి ఫోన్ కొనాల్సి ఉంటుంది. మ‌రి ఈ ఫోన్లు అడిక్ష‌న్ నుంచి ఎంత‌వ‌ర‌కు త‌గ్గిస్తాయో చూడాలి.

జన రంజకమైన వార్తలు