• తాజా వార్తలు

ప్ర‌పంచపు తొలి బ్లాక్‌చైన్ ఫోన్ ఫెన్నీ

ఎంత ఖ‌ర్చు పెట్టి కొన్న స్మార్ట్‌ఫోన్‌కైనా ర‌క్ష‌ణ ఉందా? మ‌న డేటా ఎంత వ‌ర‌కు సుర‌క్షితం?.. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఉంది..అని గ‌ట్టిగా స‌మాధానం చెప్ప‌లేని పరిస్థితి. అందుకే పూర్తి స్థాయి సెక్యూరిటీతో త‌యారైంది బ్లాక్ చైన్ స్మార్ట్‌ఫోన్‌. యూరోపియ‌న్ దేశాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న‌బ్లాక్‌చైన్ ఫోన్ల‌లో తొలి మోడ‌ల్ ఫోన్ విడుద‌లకు సిద్ధ‌మైంది. దాని పేరే ఫెన్నీ.  మ‌రీ ఏంటి దీని ప్ర‌త్యేక‌త‌?

బ్లాక్‌చైన్ టెక్నాల‌జీతో..
ప్ర‌పంచంలో అత్యంత ప‌కడ్బందీగా ఉండే టెక్నాల‌జీగా బ్లాక్ చైన్‌కు పేరుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాల‌జీ ఆధారంగానే తాజాగా స్మార్ట్‌ఫోన్లు త‌యార‌వుతున్నాయి. ఎన్‌క్రిప్ష‌న్ ప‌రంగా మిగిలిన టెక్నాల‌జీల‌కు ధీటుగా ఉండ‌డంతో సున్నిత‌మైన స‌మాచారాన్ని చేర‌వేసేందుకు ఇది బాగా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. బిట్‌కాయిన్ ఇప్ప‌టికే 10 వేల డాల‌ర్ల మార్క్  రీచ్ కావ‌డంతో ఇప్పుడు అంద‌రూ క్రిప్టో క‌రెన్సీపై ఆధార‌ప‌డుతున్నారు. క్రిప్ట్ కరెన్సీ కూడా బ్లాక్ చైన్ టెక్నాల‌జీ ద్వారా త‌యార‌వుతుంది. ఇప్పుడు అదే బ్లాక్ చైన్ టెక్నాల‌జీతో సోల‌రిన్ కంపెనీ నుంచి వ‌చ్చింది ఫిన్నీ స్మార్ట్‌ఫోన్‌. కొత్త  ఏడాది దీన్ని లాంఛ్ చేయ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసింది ఆ సంస్థ‌.

క్రిప్టో క‌రెన్సీకి త‌గ్గ‌ట్టు..
క్రిప్టో క‌రెన్సీకి అనువుగా ఉండేట‌ట్లు ఈ బ్లాక్‌చైన్ స్మార్ట్‌ఫోన్ త‌యారైంది. సిరిన్ ల్యాబ్స్ ద్వారా రూపుదిద్దుకున్న ఈ ఫిన్ని స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలోనే అత్యంత ప‌క‌డ్బందీ స్మార్ట్‌ఫోన్ అని ఈ సంస్థ చెబుతోంది. ఎథ‌రిమ్ ద్వారా దీన్ని మార్కెట్లోకి తీసుకు రావాల‌ని సోల‌రిన్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఫిన్ని ద్వారా ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, స్మార్ట్ కాంటాక్ట్‌లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు క్రిప్టో క‌రెన్సీకి కూడా ఇది అందుబాటులో ఉంటుంది.  క్రిప్టో ఇంటిగ్రేష‌న్ కోసం ఈ కొత్త ఫోన్ ఒక ఫ్లాట్‌ఫామ్‌గా ఉప‌యోగ‌ప‌డ‌నుంది.  ఇది ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ రెండింట్లోనూ అందుబాటులోకి రానుంది. 

జన రంజకమైన వార్తలు