• తాజా వార్తలు
  •  

మ‌న ఫోన్‌లోకి ఎవ‌రైనా తొంగిచూస్తే మ‌న‌ల్ని అల‌ర్ట్ చేసే ఎల‌క్ట్రానిక్ స్క్రీన్ ప్రొటెక్ట‌ర్

 సెల్ ఫోన్ మ‌న జీవితంలో భాగ‌మైంది. అది మ‌న ప్రైవ‌సీలో భాగం. కానీ మన ఫోన్‌లోకి తొంగి చూసి మ‌న విష‌యాలు తెలుసుకునేవారిని ఎలా అడ్డుకోవాలి?  అలా మీ ప్రైవ‌సీని ఎవ‌రూ దెబ్బ‌తీయ‌కుండా మీ ఫోన్‌లోని విష‌యాల‌ను చూడ‌కుండా ఉండ‌డానికి గూగుల్ ఓ కొత్త చిట్కా క‌నిపెట్టింది. అదే ఎల‌క్ట్రానిక్ స్క్రీన్ ప్రొటెక్ట‌ర్‌.  
ఎలా ప‌ని చేస్తుంది? 
ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్  (AI) టెక్నాల‌జీతో గూగుల్ దీన్ని త‌యారుచేసింది.  ఫోన్ ఫ్రంట్ కెమెరా ఆధారంగా ఈ స్క్రీన్ ప్రొటెక్ట‌ర్  ఫోన్‌లోకి చూస్తున్న వారి ఫేస్‌ను రిక‌గ్నైజ్ చేస్తుంది. ఆ ఫేస్ ఫోన్ ఓన‌ర్‌ది కాక‌పోతే వెంట‌నే స్క్రీన్ బ్లాంక్‌గా మారిపోతుంది. ఇదంతా క్ష‌ణాల్లో జ‌రిగిపోతుంది. మీరు ప‌ర్స‌న‌ల్ మెసేజ్‌లు, ఫొటోలు చూసుకునేటప్పుడు లేదా బ్యాంకింగ్ వ్య‌వ‌హారాలు చేసేట‌ప్పుడు  ప‌క్కనున్న‌వారు మీ ఫోన్లోకి తొంగి చూసి వివ‌రాలు తెలుసుకోకుండా  దీంతో చెక్ పెట్టొచ్చు. సెక్యూరిటీ ప‌రంగా ఇదో కొత్త అడ్వాంటేజ్ కానుంది. 
ప్ర‌యోగాత్మ‌కంగా  
ప్ర‌స్తుతానికి ఇది అక‌డ‌మిక్ ఫీచ‌రే.  కాలిఫోర్నియాలో ఈ నెల రెండోవారంలో జ‌రిగిన న్యూర‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ ప్రాసెసింగ్ సిస్ట‌మ్స్ మీట్‌లో దీన్ని ప్ర‌జంట్ చేశారు. త్వ‌రలో ఫోన్ల‌కు ఈ సెక్యూరిటీ ఫీచ‌ర్ తీసుకురావడానికి గూగుల్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.  ఇప్ప‌టికే హెచ్‌ఫీ త‌న ల్యాప్‌టాప్‌ల‌కు ఇలాంటిదే "Sure View అనే టెక్నాల‌జీని తీసుకొచ్చింది. ఫేస్ రిక‌గ్నైజ్ చేసి 10 మిల్లీ సెకండ్స్‌లో స్క్రీన్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది. గూగుల్ ఎల‌క్ట్రానిక్ స్క్రీన్ ప్రొటెక్ట‌ర్‌లో అయితే 2 మిల్లీ సెకండ్స్‌లో ప‌ర్స‌న్ గేజ్‌ గుర్తిస్తుంది. 47 మిల్లీ సెకండ్స్‌లో అత‌ని ఫేస్‌ను రిక‌గ్నైజ్ చేస్తుంది. ఇంత త‌క్కువ టైంలో ఎవ‌రైనా మీ ఫోన్ చూసినా అందులో ఏముందో అత‌ని కంటికి కూడా అంద‌డం క‌ష్టం.  

జన రంజకమైన వార్తలు