• తాజా వార్తలు

తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే




ఫిట్ నెస్ ట్రాక‌ర్లుగా, హెల్త్ ట్రాకర్లుగా ఉపయోగ‌ప‌డే రింగ్‌లు చూశాం. ఇప్పుడు బ‌యోమెట్రిక్ రింగ్ వ‌చ్చేసింది.  క్రెడిట్ కార్డులు, కార్ తాళాలు, డోర్ కీస్ ఆఖ‌రికి మీ ఈ మెయిల్, online account  పాస్‌వ‌ర్డ్‌ల‌ను కూడా దీనిలో స్టోర్ చేసుకుని యాక్సెస్ చేసుకోవ‌చ్చు. టోకెన్ రింగ్ పేరిట వ‌చ్చిన ఈ బ‌యోమెట్రిక్ రింగ్ ప్ర‌స్తుతం అమెరికాలోని షికాగో, మియామీ, సాల్ట్‌లేక్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే అందుబాటులో ఉంది.  వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌పంచంలో మిగిలిన ప్రాంతాల‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

ఎలా ప‌ని చేస్తుంది?
ఈ టోకెన్ రింగ్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటుంది. మీరు ఈ రింగ్‌తో క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్ష‌న్ లేదా ఏదైనా అకౌంట్‌ను యాక్సెస్ చేసిన‌ప్పుడు ఆ సెన్స‌ర్ మీ ఫింగ‌ర్  ప్రింట్‌ను అథెంటికేట్ చేస్తుంది. మీ రింగ్‌ను వేరేవారు పెట్టుకుంటే ఇందులో ఉండే ఇన్‌ఫ్రా రెడ్ సెన్స‌ర్ దాన్ని ప‌నిచేయ‌నివ్వ‌దు.  
* ప్లెయిన్ జేన్ ప్లాటినంతో త‌యారుచేయబ‌డింది.
* 50 మీట‌ర్ల లోతు వ‌ర‌కు వాట‌ర్ రెసిస్టెంట్‌.
* ఫింగ‌ర్ ప్రింట్‌, ఐఆర్ సెన్స‌ర్ల‌తో సెక్యూరిటీ సైడ్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. 
* ఛార్జింగ్ క్రెడిల్ మీద పెడితే రింగ్ ఛార్జ్ అవుతుంది. బ్యాట‌రీని ఫుల్ ఛార్జింగ్ చేస్తే మూడువారాల‌పాటు వాడుకోవ‌చ్చు.  \

కారు స్టార్ట్ చేయొచ్చు.. డోర్ లాక్ తీయొచ్చు.
ఈ టోకెన్ రింగ్‌లో ఎన్ఎఫ్‌సీ ఎనేబుల్డ్ వేరియంట్ కూడా ఉంది. దీనితో మీ కారును కీ లేకుండా స్టార్ట్ చేయొచ్చు. కీస్ లేకుండానే ఇంటి డోర్ తీసేయొచ్చు.  సాధార‌ణ రింగ్ ఖ‌రీదు 249 డాల‌ర్లు (16వేల రూపాయ‌లు).. కాగా ఎన్ఎఫ్‌సీ ఎనేబుల్డ్ టోకెన్ రింగ్ ధ‌ర 349 డాల‌ర్లు  (దాదాపు 26వేల  రూపాయ‌లు) . Tokenize వెబ్‌సైట్‌లో ప్రీ ఆర్డ‌ర్ చేస్తే డిసెంబ‌ర్ నుంచి షిప్పింగ్ ప్రారంభ‌మ‌వుతుంది.  

జన రంజకమైన వార్తలు