• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ: యూపీఐ 2.0 విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ కానుందా!

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ)  ఒక సంచ‌ల‌నం. భార‌త్‌లో డిజిట‌ల్ పేమెంట్ విధానం బాగా విస్త‌రించేందుకు యూపీఐ గొప్ప‌గా ఉప‌యోగ‌పడింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ ఫ్లాట్‌పామ్‌ను ఉప‌యోగించుకుని చాలా పేమెంట్ యాప్‌లు వినియోగ‌దారుల‌ను త‌మ‌వైపు తిప్పుకున్నాయి. పేటీఎం, మొబిక్‌విక్‌, ఫోన్ పే యాప్ ఏదైనా ఫ్లాట్‌ఫామ్ మాత్రం యూపీఐనే! ఐతే తాజాగా యూపీఐలో కొత్త వెర్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. అదే యూపీఐ 2.0 ఇది ఒక విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ‌గా నిలువ‌నుంద‌ని నిపుణులు అంటున్నారు,

ఇక హ‌వా యూపీఐ 2.0దే!
డీమానిటైజేష‌న్ స‌మ‌యంలో భార‌త్‌లో అడుగుపెట్టిన  యూపీఐ నెమ్మ‌దిగా విస్త‌రించింది. దాదాపు ప్ర‌తి పేమెంట్ యాప్ ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉప‌యోగించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో భాగంగా వ‌చ్చిన యూపీఐ 2.0 ప్ర‌కంప‌న‌లు రేప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మొబైల్ వాలెట్స్‌కు ఇది ప్ర‌త్యామ్నాయంగా మార‌నుంది.  మీ బ్యాంకు నుంచి వేరే బ్యాంకుకు లావాదేవీలు చేయ‌డానికి ఇక మొబైల్ వాలెట్స్‌తో ప‌ని లేదు. అంతా యూపీఐ 2.0తోనే అన్ని ప‌నులు అయిపోయే అవ‌కాశాలున్నాయి. యూపీఐ ట్రాన్సాక్ష‌న్లు ఇప్పుడు ఎంత‌గా పెరిగిపోయాయంటే ఒక్క గ‌త నెల‌లోనే 76.7 మిలియ‌న్ల ట్రాన్సాక్ష‌న్లు జ‌రిగాయి. సెప్టెంబ‌ర్‌తో పోలిస్తే (30.8 మిలియ‌న్లు) ఇది రెట్టింపు. ఈ నేప‌థ్య‌యంలో యూపీఐ 2.0  రావ‌డం ట్రాన్సాక్ష‌న్ల‌ను మ‌రింత పెంచుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.

గూగుల్ టెజ్ రాక‌తో....
గూగుల్ టెజ్ రాక‌తో భార‌త్‌లో ఆన్‌లైన్ మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్‌లు బాగా పెరిగిపోయాయి. దీనికి కూడా యూపీఐనే కార‌ణం. యూపీఐ ఫ్లాట్‌ఫాంతో గూగుల్ టెజ్ వేగంగా విస్త‌రించంది. దీంతో మ‌నీ పంపడం చాలా చాలా సుల‌భం అయిపోయింది. దీనికి తోడు స్క్రాచ్ కార్డుల పేరుతో క్యాష్ బ్యాక్‌లు కూడా ఇస్తుండ‌డంతో క‌స్ట‌మ‌ర్లు కూడా గూగుల్ టెజ్‌ను చాలా ఎక్కువ‌గా వాడుతున్నారు.  యూపీఐ వాడ‌కం విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో ఇందులో బెస్ట్ వెర్ష‌న్‌ను విడుద‌ల చేయాల‌ని ఆ సంస్థ నిర్ణ‌యించింది. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) త్వ‌ర‌లోనే యూపీఐ 2.0ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహ‌కాలు చేస్తోంది. అయితే డిజిట‌ల్ వాలెట్స్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఈ యూపీఐ 2.0 మార‌బోతుంద‌ని అధికారులు అంటున్నారు. బ‌యోమెట్రిక్ అథంటికేష‌న్, ప్రి ఆథ‌రైజ్డ్ ట్రాన్సాక్ష‌న్లు లాంటి ఆప్ష‌న్లు  దీనిలో ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు