• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - ఏంటీ ఫుచ్‌సియా...గూగుల్‌కు దీనికి ఏంటి సంబంధం!

ఫుచ్‌సియా... ఇటీవ‌లే వినబ‌డుతోంది దీని పేరు. మ‌రి ఏంటి ఫుచ్‌సియా.. గూగుల్‌కు దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ..ఫుచ్‌సియా అనేది ఒక కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌. గూగుల్ ఇటీవ‌లే దీన్ని డెవ‌ల‌ప్ చేసింది. మ‌రి ఆండ్రాయిడ్ లేదా క్రోమ్‌కు ఫుచ్‌సియాకు ఏంటి తేడా! ఈ మూడూ ఒక‌టేనా.. లేదా ఆండ్రాయిడ్‌, క్రోమ్‌ల‌లో ఒక‌దాన్ని రీప్లేస్ చేయ‌డానికే ఫుచ్‌సియాను రంగంలోకి దింపిందా..! చూద్దాం...

రెండేళ్ల క్రిత‌మే..
ఫుచ్‌సియా తొలిసారిగా 2016 ఏడాది మ‌ధ్య‌లో టెక్ ప్ర‌పంచంలోకి వ‌చ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి గూగుల్ ప్ర‌త్యేకంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. అయితే ఇదో యూనివ‌ర్స‌ల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అని.. ఒకే ఓఎస్ ఉండాల‌న్న ఉద్దేశంతోనే గూగుల్ దీన్ని రూపొందించిన‌ట్లు టెక్నాల‌జీ ప్రెస్ పేర్కొంది. దీంతో హైఫార్మ‌ర్‌మెన్స్ మాత్ర‌మే కాదు లో ప‌వ‌ర్ స్మార్ట్‌వాచ్‌లు, ప‌వ‌ర్‌ఫుల్ డెస్క్‌టాప్‌లు, ఫోన్లు, ట్యాబ్‌లెట్లు, స్మార్ట్ హోమ్ అప్లైయిన్‌సెన్స్ న‌డ‌వ‌డానికి ఫుచ్‌సియా సాఫ్ట్‌వేర్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ట‌. మ‌రోవైపు మైక్రోసాఫ్ట్ విండోస్ 10ను యూనివ‌ర్స‌ల్ ఓఎస్ చేయాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంది. ఐఫోన్లోనూ కొత్త ఓఎస్ ఉప‌యోగించ‌డానికి కూడా ఆ సంస్థ ప్ర‌య‌త్నించింది.

ఆండ్రాయిడ్‌, క్రోమ్‌లో..
సాధార‌ణంగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ల‌లో ఆధునాతంగా మోడిఫై చేసిన లిన‌క్స్ కెర్న‌ల్ వెర్ష‌న్‌ను ఉప‌యోగిస్తారు. సంప్ర‌దాయం కెర్న‌ల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ క‌న్నా.. మైక్రో కెర్న‌ల్ భిన్నంగా ఉంటుంది. దీని స‌మ‌ర్థ‌త‌, స‌ర‌ళ‌త సాధార‌ణ ఓఎస్ క‌న్నా భిన్నం. ఈ ఓఎస్ త‌ర్వాత టెక్నో జ‌న‌రేష‌న్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది గూగుల్ ఆలోచ‌న‌. అందుకే ఫుచ్‌సియా ఓఎస్‌ను రంగంలోకి దించింది. ఫుచ్‌సియాతో పాటు జిర్‌కోన్‌ను కూడా గూగుల్ డెవ‌ల‌ప్ చేసింది. ఫుచ్‌సియా ఓపెన్ సోర్స్‌. గూగుల్ కంపెనీయే దీన్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. పార్ట‌న‌ర్ కంపెనీలు అమ్మిన సాఫ్ట్‌వేర్‌ల‌లో ఉప‌యోగించినా కూడా గూగుల్ నియంత్ర‌ణ ఉంటుంది.  దీంతో డెవ‌ల‌ప‌ర్స్ అప్లికేష‌న్లు ఎక్కువ సంఖ్య‌లో క్రియేట్ చేయ‌చ్చు. ఫుచ్‌సియా యాప్‌లు కూడా అందులో భాగ‌మే. వీటిని ఆండ్రాయిడ్‌కు త‌గ్గ‌ట్టుగా డెవ‌ల‌ప్ చేస్తున్నారు. దీని కోసం ఫ్ల‌ట‌ర్ సాఫ్ట్‌వేర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది ఆండ్రాయిడ్‌, ఐఎస్ మ‌రియు ఫుచ్‌సియా మ‌ద్య వీలైనంత ఎక్కువ కాంపాట‌బిలిటీని తీసుకొస్తుంది.

జన రంజకమైన వార్తలు