• తాజా వార్తలు
  •  

బిట్‌కాయిన్ గురించి తెలుసు.. లైట్ కాయిన్ అంటే ఏమిటో తొలిసారి తెలుసుకోండి!

బిట్‌కాయిన్‌.. నిజంగా ఇదో సంచ‌ల‌నం. డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఇది రేపిన ప్ర‌కంప‌న‌లు మామూలుగా లేవు. ఒక్కసారిగా విలువ‌ను 1000 డాల‌ర్ల‌కు పెంచేసుకుని దూసుకుపోతోంది బిట్‌కాయిన్‌. బిట్‌కాయిన్ నీడ‌లో ఏ డిజిట‌ల్ క‌రెన్సీ ఎద‌గ‌ద‌ని నిపుణులంతా అనుకున్నారు. కానీ వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ లైట్ కాయిన్ వ‌చ్చేసింది. చాప‌కింద నీరులా త‌న విలువ‌ను పెంచుకుంటూ వేగంగా విస్త‌రిస్తోంది లైట్ కాయిన్‌. మ‌రి ఏమిటీ లైట్ కాయిన్‌.. ఏంటీ దాని క‌థ చూద్దామా...

లేటుగా వ‌చ్చినా...
క్రిప్టో క‌రెన్సీ అంటేనే బిట్‌కాయిన్ అనే ముద్ర ప‌డిపోయింది. ఎక్క‌డ చూసినా బిట్‌కాయిన్ గురించి చ‌ర్చే. కానీ ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతోంది. ఈ రంగంలోకి కాస్త ఆల‌స్యంగానే వ‌చ్చినా ఇప్పుడు లైట్‌కాయిన్ అంద‌రి దృష్టిలో ప‌డిపోయింది. క్రిప్టో క‌రెన్సీల క్ర‌మంలోవ‌చ్చిన నాలుగో టైప్ ఇది. కానీ బిట్ కాయిన్‌కు పోటీ ఇచ్చేలా ఉంది దీని ఎదుగుద‌ల‌. ప్ర‌స్తుతం దీని విలువ 320 డాల‌ర్ల‌కు పెరిగిపోయింది. ఎంత‌గా అంటే బిట్‌కాయిన్ పెరుగుద‌ల శాతం 1731గా ఉంటే.. లైట్ కాయిన్ మాత్రం 7291 శాతం ఉండ‌డం విశ్లేష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. త్వ‌ర‌లోనే బిట్‌కాయిన్ విలువ‌కు స‌మీపంగా ఇది వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని వారు అంటున్నారు.

లైట్ వెయిటే గానీ..
క్లోన్ క్రిప్టో క‌రెన్సీ కోవ‌కు చెందిందే ఈ లైట్ కాయిన్‌. బిట్ కాయిన్ గోల్డ్ క‌ల‌ర్‌లో ఉంటే లైట్ కాయిన్ సిల్వ‌ర్ రంగు పులుముకుని ఉంటుంది.  సాటోషి న‌క‌మోటో తయారు చేసిన ఈ క్రిప్టో క‌రెన్సీ లైట్ వెయిట్ ఉంటుంది కానీ దీని ధ‌ర మాత్రం చాలా భార‌మే. సాధార‌ణంగా బిట్‌కాయిన్ ట్రాన్సాక్ష‌న్‌కు 10 నిమిషాల స‌మం ప‌డితే.. లైట్ కాయిన్ కేవ‌లం 2.5 నిమిషాల్లోనే ప‌ని పూర్తి చేస్తుంది.  అంటే మిగిలిన  క్రిప్టో క‌రెన్సీల‌తో పోలిస్తే దీని ట్రాన్సాక్ష‌న్ వేగం నాలుగు రెట్లు ఎక్కువ‌మ‌న్న మాట‌.  అంతేకాదు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న బిట్ కాయ‌న్లు 21 మిలియ‌న్లు అయితే.. లైట్ కాయిన్లు ఏకంగా 84 మిలియ‌న్లు కావ‌డం విశేషం.

జన రంజకమైన వార్తలు