జియో ఫెన్సింగ్ అంటే ఓ జియోగ్రాఫికల్ ఏరియా చుట్టూ మనమే గీసుకునే ఓ ఊహాజనిత హద్దు. అంటే ఓ వర్చ్యువల్ బౌండరీ అన్నమాట. ఈ జియోఫెన్సింగ్ రేంజ్‌లోకి మన డివైస్ ఎంటర్ కాగానే దాన్ని గుర్తించి మనకు కావాల్సిన మెసేజ్‌లు, అలర్ట్స్, సోషల్ మీడియా యాడ్స్ ఇలాంటివన్నీ అందిస్తుంది. అంటే ఒక లొకేషన్ బేస్డ్ సర్వీస్‌లా పని చేస్తుంది. మనం ఆఫీస్‌లో మాత్రమే చూస్తే చాలనుకునే మెయిల్స్, మెసేజ్‌లు వంటి వాటికి అక్కడ జియో ఫెన్సింగ్ క్రియేట్ చేసుకుంటే అక్కడే వదిలేసి ప్రశాంతంగా ఇంటికి రావచ్చు. మళ్లీ మనం ఆఫీస్ ఏరియాలోకి వెళ్లినప్పుడు ఆ అలర్ట్స్, మెయిల్స్, మెసేజ్‌లు వస్తాయి. ఇంటి వరకే పరిమితం చేయాలనుకునే సోషల్ మీడియా అకౌంట్లు, ఫ్యామిలీ, రిలేటివ్స్ వాట్సాప్ గ్రూప్‌లు వంటివాటికి ఇంటి పరిధిలో జియో ఫెన్సింగ్ పెట్టుకోవచ్చు. అలా మన స్మార్ట్ డివైస్‌కు మనమే గీసుకోగలిగే హద్దే జియో ఫెన్సింగ్
ఎలా పని చేస్తుంది?
ఈ జియో ఫెన్సింగ్‌లో ఒక యాప్ లేదా సాఫ్ట్వేర్ .. జీపీఎస్, ఆర్ ఎఫ్ఐడీ, వైఫై, సెల్యూలర్ డేటాల్లో ఏదో ఒకదానితో పని చేస్తుంది. మనం ఆ జియోఫెన్సింగ్లోకి ఎంటరవగానే మన మొబైల్ డివైస్ యాక్టివేట్ అయి మనం ప్రీ డిఫైన్ చేసుకున్న అలర్ట్స్, మెసేజ్‌లు వస్తాయి. ఇందుకోసం ముందుగా జీపీఎస్ లేదా ఆర్ఎఫ్ఐడీ అనేబుల్డ్ సాఫ్ట్‌వేర్‌తో స్పెసిఫిక్ లొకేషన్లో వర్చ్చువల్ బౌండరీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దీనికి మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి.
ఏమిటి ఉపయోగం?
పర్సనల్ యూజ్తోపాటు ఏదైనా ఏరియాను మానిటర్ చేయడానికి కూడా జియోఫెన్సింగ్‌ను యూజ్ చేసుకోవచ్చు. అక్కడికి ఎవరు వచ్చి వెళుతున్నారో చూసేందుకు వాడుకోవచ్చు. కంపెనీలు, సంస్థలకు ఇది బాగా ఉపయోగం. సంస్థలో పనిచేసేవారు కంపెనీ ప్రాపర్టీని మిస్యూజ్ చేయకుండా కూడా దీనితో సూపర్వైజ్ చేయవచ్చు.
* ఆటోమొబైల్ ఇండస్ట్రీల్లో వెహికల్స్‌ను, పెద్ద పెద్ద పశుక్షేత్రాల్లో పశువులు పక్కదారి పట్టకుండా ఈ జియో ఫెన్సింగ్‌ను వాడుతున్నారు.
* డ్రోన్లకు కూడా జియో ఫెన్సింగ్‌ను ప్రీప్రోగ్రామ్ చేస్తారు.
* మార్కెటింగ్ సంస్థలు, హాస్పిటాలిటీ బిజినెస్‌లో ఉన్నవారు కూడా ఈ జియోఫెన్సింగ్‌ను క్రియేట్ చేస్తున్నారు. వారి సంస్థలున్న ప్రాంతంలోకి మన డివైస్ వెళ్లగానే తమ హోటల్లో స్టే చేయమని, పలానా రెస్టారెంట్లో భోంచేస్తే కూపన్ అని ఇలా బిజినెస్ చేసుకుంటున్నారు. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు మనకు కూడా ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది.
* స్మార్ట్ అప్లయన్సెస్‌కు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఫ్రిజ్‌లో పాలు అయిపోయాయని, మీరు ఇంటికెళుతున్నారు కాబట్టి రైస్‌కుక్కర్ లేదా గీజర్ ఆన్ చేయాలా అని సజెషన్స్ పంపిస్తుంది.