• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - ఏమిటీ మైక్రోసాఫ్ట్ బిగ్ బ్లూ బ‌స్‌? 

ఇండియా టెక్నాల‌జీలో దూసుకెళుతోంది. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్‌, ఆన్‌లైన్లోనే అన్నీ చ‌క్క‌బెట్టుకోగ‌ల‌గ‌డం, స్మార్ట్‌ఫోన్ల‌తో అన్నీ టెక్నాల‌జీ బేస్డ్ వ్య‌వ‌హారాలు ఇలా టెక్నాల‌జీ ముందుకెళుతోంది.  నాణేనికి మ‌రోవైపు చూస్తే ఇంకా ల‌క్షలాది  వ్యాపార సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌లు టెక్నాల‌జీకి చాలా దూరంగా  ఉండిపోయాయి. అవి ఇప్ప‌టికీ ఆఫ్‌లైన్ మార్కెట్‌నే న‌మ్ముకుని ముందుకెళుతున్నాయి. ఇండియా లాంటి పెద్ద దేశంలో వ్యాపారం విస్త‌రించుకోవాలంటే ఇలాంటి కంపెనీలన్నింటికీ టెక్నాల‌జీని ద‌గ్గ‌ర చేయాలి. ఈ కాన్సెప్ట్‌తోనే టెక్నాల‌జీ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ బ్లూ బ‌స్ ను తీసుకొచ్చింది. 
మార్కెట్ పెర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణాలివీ.. 
ఇండియాలో 5 కోట్ల 10 ల‌క్ష‌ల మంది చిన్న‌, మ‌ధ్య‌త ర‌హా  వ్యాపారులున్నారు.  వీరిలో చాలా మంది వ్యాపారుల‌కు టెక్నాల‌జీ మీద అవేర్‌నెస్ లేదు. రెండోది టెక్నాల‌జీమీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయ‌డానికి అంగీక‌రించని ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కావ‌డం ఇలాంటి కార‌ణాల‌తో టెక్నాల‌జీ ఇండియాలోని చిన్న‌, మ‌ధ్య‌తర‌హా వ్యాపారాల్లో టెక్నాల‌జీని అంత‌గా చొప్పించ‌డం కంపెనీల వ‌ల్ల కావ‌డం లేదు.  దీన్ని క‌వ‌ర్ చేసి బిజినెస్ పెంచుకోవ‌డానికి గూగుల్ ఇటీవ‌ల చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారుల కోసం ఫ్రీ టూల్స్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కొత్త దారి ఎంచుకుంది.  ఒక పెద్ద బ‌స్సును దేశ‌మంత‌టా తిప్పుతోంది. 
ఈ బ‌స్‌లో ఏముంటాయి? 
చిన్నత‌ర‌హా వ్యాపారుల‌కు కూడా బిజినెస్‌లో ఉప‌యోగ‌ప‌డే టూల్స్‌, సాఫ్ట్‌వేర్స్ వంటి వాటి గురించి ఇందులో చూపించి వ్యాపారుల‌కు వివ‌రిస్తారు. దానివల్ల బిజినెస్‌ను ఎలా డెవ‌ల‌ప్ చేసుకోవ‌చ్చు, మేన్ ప‌వ‌ర్‌ను త‌గ్గించుకుని మెషీన్ యూజ్ చేసుకోవ‌డం ఎలా అనేది చూపిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఈ ఫ్రీక్స్ టెక్నాల‌జీస్ అనే సంస్థ బిజినెస్ ప‌ర్స‌న్స్ ఈజీగా ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలో సొల్యూష‌న్స్ చెబుతుంది. జీఎస్టీతో టాక్స్ క‌న్స‌లెంట్ల‌కు చిరువ్యాపారులు కూడా వేల‌కు వేలు చెల్లించాల్సి వ‌స్తున్న ప‌రిస్థితుల్లో అంత‌కంటే చౌక‌గా, ఈజీగా ట్యాక్స్ ఫైలింగ్ సొల్యూష‌న్స్ ఉన్నాయ‌ని ఆ కంపెనీ రిప్రంజెంటేటివ్స్ డిమాన్‌స్ట్రేట్ చేసి చూపిస్తారు.  ఇలాంటివి టెక్ బేస్డ్ బిజినెస్ సొల్యూష‌న్స్ ఆఫ‌ర్ చేసే సంస్థ‌లు  ఈ బిగ్ బ్లూ బ‌స్‌లో ప‌లు ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డి చిన్న వ్యాపారుల‌ను అవేర్ చేసి బిజినెస్ పెంచుకోవాల‌న్న‌ది ప్లాన్‌. ఈ బ‌స్ ఢిల్లీ నుంచి ప్రారంభ‌మైంది. ప‌లు ప్రాంతాల్లో తిరిగి ల‌క్నో చేరింది. ఇలా దేశ‌మంతటా తిరిగి టెక్నాల‌జీమీద చిరువ్యాపారుల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. చాలా కాస్ట్ ఉంటాయ‌ని, స‌ర్వీసింగ్ క‌ష్ట‌మ‌ని టెక్ ప్రొడ‌క్ట్స్‌కు దూరంగా ఉండేవారిని ఆ యాంగిల్‌లోనూ ఎడ్యుకేట్ చేస్తారు. ఇండియా లాంటి విభిన్న నేప‌థ్యాలున్న మార్కెట్లో త‌మ ప్రొడ‌క్ట్స్ మార్కెటింగ్‌కు వారి ద‌గ్గ‌ర‌కే వెళ్ల‌డమే మేల‌నే ఉద్దేశంతోనే ఈ బ‌స్ యాత్ర మొద‌లుపెట్టామంటోంది మైక్రోసాఫ్ట్‌. 

జన రంజకమైన వార్తలు