• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - వాల్లెట్లకు పెద్ద బాడ్ న్యూస్,వాట్సాప్ పే వచ్చేస్తుంది

ఇప్పుడు న‌డుస్తోంది డిజిట‌ల్ యుగం. పేమెంట్ యాప్‌ల హ‌వా ఎక్కువ‌గా ఉంది  ఇప్పుడు. ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ కూడా చివ‌రికి ఒక పేమెంట్ యాప్‌తో బ‌రిలో దిగింది. తేజ్ అనే పేమెంట్  యాప్ ఇప్పుడు పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టిస్తోంది. క్యాష్‌బ్యాక్‌లు ఇస్తూ, ఓచ‌ర్లు ఉచితంగా ఇస్తూ తేజ్ యాప్ దూసుకుపోతోంది. అయితే ఈ యాప్‌కు పోటీగా మ‌రో యాప్ రాబోతోంది. అది  ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనే! సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ హౌస్ వాట్స‌ప్ త్వ‌ర‌లోనే ఒక పేమెంట్ యాప్‌ను తేబోతోంది. దానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇటీవ‌లే లైవ్ లొకేష‌న్ షేరింగ్‌, డిలీట్ ఫ‌ర్ ఎవ్రివ‌న్ లాంటి అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో ముందుకొచ్చిన వాట్స‌ప్‌.. త్వ‌ర‌లోనే పేమెంట్స్ యాప్‌ను కూడా తెర మీద‌కు తెస్తోంది.

ప్ర‌పంచంలోనే తొలిసారి భార‌త్‌లో..
ప్ర‌పంచంలోనే తొలిసారి భార‌త్‌లో  వాట్స‌ప్.. త‌న పేమెంట్స్ యాప్‌ను భార‌త్‌లో తీసుకు రానుంది. ప్ర‌స్తుతం డెవ‌ల‌ప‌ర్స్ ఈ యాప్‌ను టెస్ట్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే బేటా ప్రొగ్రామ్ ద్వారా దీన్ని విడుద‌ల చేస్తున్నారు.  డిసెంబ‌ర్ నాటిక‌ల్లా భార‌త్‌లో పూర్తి స్థాయిలో తీసుకురానుంది. ఫేస్‌బుక్ ఆధ్వ‌ర్యంలోని వాట్స‌ప్‌.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకోవాలని ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ యాప్ ఎలా ప‌ని చేస్తుంది?
వాట్స‌ప్ యాప్‌తో పేమెంట్స్ చేయ‌డం చాలా సుల‌భం.  కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా పేమెంట్స్ చేసేయ‌చ్చు.
1. ఇమేజ‌స్‌, డాక్యుమెంట్స్ షేర్ చేసిన‌ట్లు పేమెంట్స్ కూడా వ‌ర్క్ అవుతుంది. ఎటాచ్‌మెంట్ ఐకాన్ మీద క్లిక్ చేయ‌గానే పేమెంట్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 

2. ఆ త‌ర్వాత పేమెంట్ యాప్ మీద క్లిక్ చేయాలి.  ఆ త‌ర్వాత మీరు పంపాల‌నుకున్న అమౌంట్ వాల్యూని ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత సెండ్ చేయాలి. అంతే యూపీఐ ద్వారా మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ అయిపోతాయి.

3. ఆ త‌ర్వాత రిసీవ‌ర్‌కు మ‌నీ వ‌చ్చిన‌ట్లు మెసేజ్ అందుతుంది  అయితే ఈ పేమెంట్‌ను రిసీవ‌ర్ యాక్సెప్ట్ చేయ‌చ్చు లేదా రిజెక్ట్ చేయ‌చ్చు.

డిజిట‌ల్ పేమెంట్స్ యాప్స్‌కు ప్ర‌మాద‌మా?
ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌డిజిట‌ల్ యాప్స్‌కు ప్ర‌మాదం ముంచుకొచ్చిన‌ట్లేనా? .. వాట్స‌ప్ పేమెంట్స్ యాప్ రాక‌తో ఇది నిజ‌మే అనిపిస్తోంది. గూగుల్ తేజ్‌తో పాటు పేటీఎం, మొబిక్‌విక్, ఫోన్ పే లాంటి యాప్‌ల‌కు తాజా పేమెంట్స్ యాప్ ప్ర‌మాద‌క‌ర‌మే అని చెప్పొచ్చు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు