• తాజా వార్తలు
  •  

రివ్యూ - సెల్ఫీ ల‌వ‌ర్స్ కోసం వ‌చ్చేసింది జియోమి రెడ్‌మి వై1

 జియోమి .. భార‌త్‌లో ఈ బ్రాండ్‌కో విలువ ఉంది. త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది ఈ ఫోన్ త‌యారీ సంస్థ‌. ముఖ్యంగా రెడ్ మి స్మార్ట్‌ఫోన్లు భార‌త్‌లో వేగంగా విస్త‌రించాయి. శాంసంగ్ త‌ర్వాత ఎక్కువ‌మంది వాడే  ఫోన్ల‌లో జియోమి అగ్ర‌స్థానంలో నిలిచింది. ముఖ్యంగా రెడ్‌మి అయితే ఆన్‌లైన్ సేల్స్ ద్వారా రికార్డే నెల‌కొల్పింది. ఇంత‌టి ఫేమ్ సంపాదించుకున్న జియోమి..మార్కెట్లోకి మ‌రో ఫోన్‌ను వ‌దిలింది. ఇప్పుడు న‌డుస్తోంది సెల్ఫీ కాలం కావ‌డంతో రెడ్‌మి వై1 ఫోన్ పేరుతో  ఒక కొత్త మోడ‌ల్‌ను అందుబాటులోకి తెచ్చింది జియోమి. సెల్ఫీ ల‌వ‌ర్ కోసం ఇదో మంచి ప్ర‌త్యామ్నాయ‌మ‌ని ఆ సంస్థ తెలిపింది.

బ‌డ్జెట్ ఫోన్‌
రెడ్ మి ఇప్ప‌టిదాకా విడుద‌ల చేసిన ఫోన్ల‌న్నీ మ‌ధ్య త‌ర‌గ‌తిని దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన‌వే. రూ.8999 బ‌డ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది షియోమి. రెడ్ మి వై1 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ అందుబాటు ధ‌ర‌తో మంచి ఫీచ‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటోంది. 5.5 అంగుళాల డిస్‌ప్లే, హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు 16 మెగా పిక్స‌ల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లాంటి ఆఫ‌ర్లు ఉంటాయి. లెనొవో కే8 ప్ల‌స్‌కు గ‌ట్టిపోటీగా బ‌రిలో దిగిన రెడ్‌మి ఎఫ్‌1 ఫీచ‌ర్ల విష‌యంలోమాత్రం ముందంజ‌లో ఉంది.  రెడ్‌మి నోట్‌4కు మించిన ఫీచ‌ర్లు దీనిలో ఉండ‌డంతో వినియోగ‌దారులకు బాగా న‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. 

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌
రెడ్ మి వై1లో 3 జీబీ ర్యామ్ ఉంది.  ఇదేకాక 32 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ  దీని సొంతం. 153 గ్రాముల బ‌రువున్న ఈ ఫోన్‌...  దీంతో దీని బ‌రువు కూడా త‌క్కువే. స్లిమ్ మెట‌ల్‌బాడీతో లుక్ వైజ్‌గా మార్కులు కొట్టేస్తుంది ఈ  ఫోన్‌. ప్రైమ‌రీ కెమెరాకు కుడి వైపు ఉండే ఎల్ఈడీ ఫ్లాష్ ఈ ఫోన్‌లో మ‌రో ప్ర‌త్యేక‌త‌. యూఎస్‌బీ పోర్ట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్ దీనిలో ఉన్న మ‌రో ఆప్ష‌న్లు. ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ లాంటి సెక్యూరిటీ ఆప్ష‌న్ కూడా దీనిలో ఉన్న మ‌రో పార్ట్‌.  3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ  దీనిలో ఉన్న మ‌రో స్పెష‌ల్‌. 13 మెగా పిక్స‌ల్  ప్రైమ‌రీ కెమెరా, 16 మెగా పిక్స‌ల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో సెల్ఫీలు మ‌రింత  అందంగా వ‌స్తాయి.

జన రంజకమైన వార్తలు