• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - ఏమిటీ షియోమి బ్లాక్ షార్ప్ , గిఫ్ట్ కార్డ్‌, వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్‌ ?

మొబైల్ ఫోన్ సేల్స్‌లో ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ సాధించిన షియోమి మ‌రింత దూకుడుగా ముందుకెళుతోంది. సెల్‌ఫోన్ల‌తోపాటు యాక్సెస‌రీస్‌, కొత్త‌గా టీవీలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవ‌రికైనా గిఫ్ట్ ఇవ్వ‌డానికి వీలుగా గిఫ్ట్ కార్డ్‌లు, సొంత వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్‌తోపాటు గేమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షార్క్‌ను కూడా రంగంలోకి దింపుతోంది.
 

ఎంఐ గిఫ్ట్ కార్డ్స్‌
మీ ఫ్రెండ్స్‌, రిలేటివ్స్ ఎవ‌రికైనా ఎంఐ ప్రొడ‌క్ట్స్ కొనుక్కోవ‌డానికి వీలుగా గిఫ్ట్ కార్డులు ఇచ్చే సౌక‌ర్యం ఇది. ఎంఐ గిఫ్ట్ కార్డ్ ప్రోగ్రాం కింద 100 రూపాయ‌ల నుంచి 10వేల రూపాయ‌ల వ‌ర‌కు విలువైన ఈ-గిఫ్ట్ కార్డ్‌ల‌ను వారికి మెయిల్ ద్వారా పంపించ‌వచ్చు. Mi.com లేదా Mi Store appలో ఈ గిఫ్ట్ కార్డ్‌లు అందుబాటులో ఉంటాయి. ర‌క‌ర‌కాల డిజైన్ల‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. కావాలంటే మీరు ఇమేజ్‌, మెసేజ్ పెట్టి క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు కూడా.  వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన గిఫ్ట్ కార్డ్ తీసుకుని సెండ‌ర్ ఇన్ఫో, రెసిపెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్‌, మెసేజ్‌, గిఫ్ట్ కార్డ్ అమౌంట్‌, డెలివ‌రీ డేట్ ఫిల్ చేసి క్రెడిట్ /  డెబిట్ కార్డ్స్ వాలెట్స్ లేదా యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయొచ్చు. అవ‌త‌లి వ్య‌క్తికి మెయిల్ ద్వారా మీరు పంపిన గిఫ్ట్ కార్డ్ వెళుతుంది. దీన్ని రిడీమ్ చేసుకోవాలంటే Mi Store app > My account > Add Gift Cardను క్లిక్ చేయాలి. ఇప్పుడు మెయిల్‌లో వ‌చ్చిన 16అంకెల గిఫ్ట్ కార్డ్ నెంబ‌ర్‌, 6 అంకెల పిన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. Add Gift Card బ‌ట‌న్ నొక్కితే ఆ అమౌంట్ మీ ఎంఐ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. దీంతో మీరు 12 నెల‌ల్లోగా ఏదైనా ఎంఐ ప్రొడ‌క్ట్ కొనుక్కోవాలి. ఒకేసారి 10 వ‌ర‌కు గిఫ్ట్ కార్డుల రిడీమ్ చేసుకునే సౌక‌ర్యం కూడా ఉంది.
 

షియో ఏఐ వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్‌
మ‌రోవైపు షియోమి త‌న సొంత వ‌ర్చువ‌ల్ అస్టిసెంట్  షియో ఏఐ (Xiao AI)ని కూడా ఇండియ‌న్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కొత్త Mi MIX 2sతోపాటు ఈ ఏఐ కూడా అందుబాటులోకి వ‌స్తుంది. ప్ర‌స్తుతం షియోమి విడుద‌ల చేసిన ఈ షియో ఏఐ వీడియోలో వాయిస్ అసిస్టెంట్ చైనీస్ వాయిస్ క‌మాండ్స్‌తో రిమైండ‌ర్స్ సెట్ చేయడం, స్మార్ట్ లైట్స్‌ను కంట్రోల్ చేయ‌డం, వెద‌ర్ రిపోర్ట్ చెప్ప‌డం వంటి ప‌నులు చేస్తుంది. ఇండియ‌న్ మార్కెట్‌లో చాలా పొటెన్షియ‌ల్ ఉంద‌ని ఎంఐ గుర్తించింది కాబ‌ట్టే ఈ వాయిస్ అసిస్టెంట్‌ను ఇండియాలోనూ ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. కాబ‌ట్టి ఇంగ్లీష్‌లో కూడా దీన్ని తీసుకొచ్చే అవ‌కాశాలున్నాయి. 
 

షియోమి బ్లాక్ షార్క్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ 
గేమింగ్ ప్రియుల కోసం షియోమి త‌న ఫ‌స్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌.. షియోమి బ్లాక్ షార్క్‌ను లాంచ్ చేయ‌బోతోంది.  ఈ నెల 13న చైనాలో దీన్ని లాంచ్ చేస్తుంది.  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 చిప్‌సెట్‌, 8 జీబీ ర్యామ్‌తో త‌యార‌యిన ఈ ఫోన్‌కు రెండు వైపులా బిల్ట్ ఇన్ జాయ్ స్టిక్ ఉంటుంది.  ఏరోస్పేస్ గ్రేడ్ కూలింగ్ సొల్యూష‌న్ దీని ప్ర‌త్యేక‌త‌. ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఓఎస్‌తో న‌డిచే ఈ ఫోన్ 32 జీబీ, 64 జీబీ,128 జీబీ స్టోరేజ్‌తో వ‌స్తుంది.
 

జన రంజకమైన వార్తలు