స్మార్టు ఫోన్ మార్కెట్లో ఆదిలోనే తన ముద్ర చాటుకున్న అసుస్ తన జెన్ ఫోన్ సిరీస్ లో మరో కొత్త ఫోన్ జెన్ ఫోన్ ఏఆర్ ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గూగుల్ టాంగో , డేడ్రీమ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. ఇటీవల ఫేస్బుక్, ట్విట్వర్ ద్వారా దీనికి సంబంధించిన ఒక టీజర్ ను అసుస్ రిలీజ్ చేసింది.
యూజర్లు వీఆర్ కంటెంట్‌ను రూపొందించుకునేందుకు వీలుగా జెన్ యుఐ వీఆర్ 360 ఫీచర్ ఇందులో ఉంటుందని సమాచారం. వర్చువల్ రియాల్టీ, ఆగ్మెంటెడ్ రియాల్టీ ఫీచర్లు కూడా ఉంటాయి. దీంతో గూగుల్ డే డ్రీమ్, టాంగో, వీఆర్ ఏఆర్ అన్నీ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది.
అయితే.. దీని ధర, విడుదల తేదీ మాత్రం ఇంతవరకు సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.
అసుస్ జెన్‌ఫోన్ ఏఆర్ స్పెసిఫికేషన్లు
* 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
* 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
* 2.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్
* 8 జీబీ ర్యామ్,
* 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్,
* 23 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
* 3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం