• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - ఏమిటీ ఫేస్ బుక్ జాబ్స్? మనకు నిజంగా ఉపయోగమేనా ?

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం అయిన ఫేస్ బుక్ గురించి ఈ మధ్య బాగా వినిపిస్తున్న అంశం ఫేస్ బుక్ జాబ్స్. ఫేస్ బుక్ లో ఈ జాబ్ అప్లికేషను ఫీచర్ ఇండియా తో పాటు 40 దేశాలలో ఈ రోజు నుండీ లాంచ్ చేస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. ఈ ఫీచర్ గత సంవత్సరమే US మరియు కెనడా లలో లాంచ్ చేయబడింది. ఈ ఫీచర్ ద్వారా లోకల్ బిజినెస్ లలో ఏర్పడే ఉద్యోగాలను ఆయా ప్రదేశాలలో ఉండే నిరుద్యోగ యువతకు ఫేస్ బుక్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఫేస్ బుక్ కల్పిస్తుంది. అసలు ఈ ఫేస్ బుక్ జాబ్స్ ఏంటి? ఇవి ఎలా కనిపిస్తాయి? వీటిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? తదితర అంశాలను ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

ఫేస్ బుక్ జాబ్స్ ఎలా పనిచేస్తుంది?

ఫేస్ బుక్ యొక్క వెబ్ వెర్షన్ అయిన facebook.com/jobs లో ఉండే జాబ్స్ డాష్ బోర్డు లో మనం జాబ్స్ కోసం వెదకవచ్చు. మొబైల్ లో అయితే యాప్ లోని Explore సెక్షన్ లో ఈ జాబ్ ల వివరాలను చూడవచ్చు. ఈ జాబ్ లొకేషన్ లు మీరు ఉన్న ప్రదేశానికి 161 కిలోమీటర్ ల వ్యాసార్థం లో ఉంటాయి. అంటే మీరు ఉన్న ప్రదేశానికి  చుట్టుప్రక్కలా 161 కిలోమీటర్ల వ్యాసార్థం లో ఏ జాబ్ పోస్ట్ అయినా మీకు ఇట్టే తెలిసిపోతుంది.

ఫేస్ బుక్ జాబ్స్ కు అప్లై చేయడం ఎలా?

ముందుగా మీరు ఏదైనా జాబ్ వివరాలను ఫేస్ బుక్ లో చూశారు అనుకోండి. దానిక్రిందే అప్లై అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఒక అప్లికేషను ఫాం ఓపెన్ అవుతుంది. అది మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ లో ఉన్న మీ వివరాలను డిఫాల్ట్ గా తీసుకుంటుంది. ఆ వివరాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఫారం పూర్తి చేయడం అయిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ అప్లికేషను ఆ జాబ్ పోస్ట్ చేసిన కంపెనీ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ అప్లికేషను యొక్క స్టేటస్ ను మెసెంజర్ ద్వారా ఆ కంపెనీ వాళ్ళు తెలియజేస్తారు.

ఫేస్ బుక్ జాబ్ అలర్ట్స్

ఉద్యోగార్థులు దీనిద్వారా క్రమంగా జాబ్ అలెర్ట్ లను, నోటిఫికేషన్ లను కూడా పొందవచ్చు. ఫేస్ బుక్ జాబ్స్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే క్రమంగా మీకు జాబ్ అలర్ట్స్ పంపబడతాయి.మీ విద్యార్హతలు, ఆసక్తులు, ఇష్టమైన రంగం లాంటి వివర్లను పూర్తి చేసి సబ్ స్క్రైబ్ చేసుకుంటే ఆయా ఉద్యోగాలు ఫేస్ బుక్ లో పోస్ట్ అయినపుడు వాటికి సంబందించిన అలెర్ట్ లను మీరు పొందుతారు.

ఫేస్ బుక్ జాబ్స్ లో జాబ్ లిస్టింగ్స్

మీ దగ్గర ఉన్న ఉద్యోగాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం కూడా చాలా సులువు. జాబ్ టైటిల్, జాబ్ రకం, శాలరీ తదితర వివరాలను పూర్తి చేసి జాబ్ లిస్టింగ్స్ లో సబ్మిట్ చేయాలి. ఇది ఫేస్ బుక్ పేజి లోని జాబ్స్ దాష్ బోర్డు లోనూ, ఈ ఉద్యోగం పట్ల ఆసక్తి కలిగి ఉన్న వారి న్యూస్ ఫీడ్ లోనూ కనిపిస్తుంది. ఆ జాబ్ కు వచ్చిన అప్లికేషను లను బాట్టి దరఖాస్తుదారునితో కాంటాక్ట్ అవడం, ఇంటర్ వ్యూ లను సెట్ చేసుకోవడం లాంటివి మెసెంజర్ ద్వారా చేసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు