• తాజా వార్తలు

ఐ ఫోన్ 8 మొబైల్ ఫోన్ లలో తేనున్న 3 విప్లవాత్మక మార్పులు

ఐ ఫోన్ నుండి గత సంవత్సరం సెప్టెంబర్ లో చివరిసారిగా ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అయితే అప్పటినుండీ ఐ ఫోన్ యొక్క తర్వాతి ఉత్పాదన అయిన ఐ ఫోన్ 8 యొక్క డిజైన్ మరియు పనితీరు పై రకరకాల ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఐ ఫోన్ 8 యొక్క డిజైన్ లో 8 మేజర్ మార్పులు ఉండనున్నాయి. వాటి గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.
షేప్ చేంజ్
ఫోర్బ్స్ యొక్క కథనం ప్రకారం ఆపిల్ తన ఐ ఫోన్ 8 యొక్క న్యూ డిజైన్ లో 18: 5-9 యాస్పెక్ట్ రేషియో ను పరిచయం చేయనుంది. ఇది కొద్దిగా సామ్సంగ్ గాలాక్సి s8 మరియు LG జి 6 ను పోలి ఉంది.
ఇది చిప్ సెట్ మేకర్ అయిన TSMC ద్వారా వెల్లడించబడింది.
ఈ సరికొత్త యాస్పెక్ట్ రేషియో తో ఈ ఐ ఫోన్ 8 అనేది ఒక ఎలాంగేటెడ్ లుక్ ను కలిగి ఉండనుంది. ఈ సరికూత డిజైన్ వలన ఐ ఫోన్ 8 యొక్క డిస్ప్లే సైజు లో కొంచెం పెరుగుదల ఉండనుంది. అదేసమయం లో చేతిలో పట్టుకోవడానికి సౌకర్యంగా ఉండే విధంగా ఇది వీలైనంత సన్నగా ఉండనుంది.
అయితే ఇందులో ఉండే బ్యాక్ బటన్ ప్రాబ్లెం పై మరింత పరిశోధన జరుగుతుంది.
సరికొత్త ఫంక్షన్ ఏరియా
డిస్ప్లే కు ఉన్న ఎలాంగేటెడ్ డిస్ప్లే సైజు వలన దేవకీ యొక్క ఓవర్ అల్ డిజైన్ తో పాటు పనితీరు లో కూడా అనేక మార్పులు ఉండనున్నాయి. ఇందులో ఉండే టచ్ ఐడి మెకానిజం డిస్ప్లే కి ఇంటిగ్రేట్ అయ్యి ఉంది.
స్క్రీన్ కు క్రింద ఉండే ముఖ్యమైన ఫంక్షన్ ఏరియా మాక్ బుక్ ప్రో స్టైల్ లో ఉండే టచ్ బార్ మాదిరిగా ఉండనుంది. ఇది హోం బటన్ యొక్క స్థానాన్ని కాంటెక్స్ కంట్రోల్ ల ద్వారా భర్తీ చేయనుంది.
దీనియొక్క ఫ్రంట్ కెమెరా డిస్ప్లే క్రింద ఉండదు.
AR రెడీ కెమెరా
ఐ ఫోన్ 8 తీసుకువస్తున్న మార్పులలో అతి ముఖ్యమైనది అగ్మెంటేడ్ రియాలిటీ రెడీ కెమెరా. ఈ సరికూత కెమెరా ఇన్ విజిబుల్ ఇన్ఫ్రా రెడ్ ఇమేజ్ సెన్సార్ లతో ఎక్విప్ అయి ఉండనుంది.ఇది కెమెరా యొక్క క్వాలిటీ ని ఎన్ హాన్స్ చేయదు కానీ AR అప్లికేషను లను ఎనేబుల్ చేస్తుంది.
మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఐ ఫోన్ 8 అనేది ఈ సంవత్సరం అక్టోబర్ లో లాంచ్ అవ్వనుంది.

జన రంజకమైన వార్తలు