• తాజా వార్తలు

ప్రివ్యూ - మ్యాక్ ఓఎస్‌.. హై సియెర్రా

యాపిల్ ప్రొడ‌క్ట్స్ అంటేనే క్వాలిటీ.  అందుకే మిగ‌తా కంపెనీల ప్రొడ‌క్ట్స్ కంటే కాస్ట్ ఎక్కువ‌గా ఉన్నా ఒక‌సారి యాపిల్ ప్రొడ‌క్ట్ వాడిన‌వాళ్లు మ‌ళ్లీ వేరేదానివైపు చూడ‌రు. అది ఐఫోన్ అయినా.. యాపిల్ మ్యాక్ అయినా ఓసారి వాడితే ఫిదా అయిపోతారంతే.  యాపిల్ ఈ ఏడాది వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో ఎనౌన్స్ చేసిన మ్యాక్ ఓఎస్ హైసియెర్రా విశేషాలేంటో చూడండి.  
న్యూ ఫైల్ సిస్టం (APFS)
మ్యాక్ ఓఎస్ హై సియెర్రాలో కొత్తగా వ‌చ్చిన మార్పుల్లో ఇదే మొద‌టి.   APFS (యాపిల్ ఫైల్ సిస్టం) పేరిట ఇంప్రూవ్డ్ ఫైల్ సిస్టంను తీసుకొచ్చింది.  సెక్యూరిటీ, రిల‌య‌బులిటీ, ఫైల్ ట్రాన్స్‌ఫ‌ర్‌లో వేగం దీనికి ఉన్న అడ్వాంటేజెస్‌. హోల్ డిస్క్‌ను, ఇండివిడ్యువ‌ల్ ఐట‌మ్స్‌ను సెప‌రేట్ కీస్‌తో ఎన్‌క్రిప్ట్ చేసుకోవ‌చ్చు. ఈ కొత్త ఫైల్ సిస్ట‌మ్ బ్యాక‌ప్స్‌కు బెట‌ర్ ప్రెసిష‌న్ తీసుకొస్తోంది.  ఇప్ప‌టివ‌ర‌కు ఫైల్ సిస్టం ఓ ఫైల్‌ను ఒక సెకండ్ ప్రెసిష‌న్‌తో స్టాంప్ చేస్తుండ‌గా హై సియ‌ర్రాలో ఇది ఒక నానో సెకన్‌కు త‌గ్గ‌తుంది. ఫ్లాష్ స్టోరేజ్ డిజైన్ చేసిన తొలి ఫైల్ సిస్టం కూడా ఇదే.  

స‌ఫారీ అప్‌డేట్స్ (Safari Updates)
మ్యాక్ ఓఎస్ హై సియ‌ర్రాలో వ‌చ్చిన మ‌రో మేజ‌ర్ అప్‌డేట్ స‌ఫారీ.  క్రోమ్ యూజ్ చేయ‌ని యూజ‌ర్ల కోసం ఈ డిఫాల్ట్ యూజ‌ర్ చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  క్రోమ్ బ్రౌజ‌ర్లో మ‌ల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఒక ట్యాబ్‌లో ఉండే ఆడియో ఓపెన్ అయిపోతుండ‌డం మ‌న‌కు త‌ర‌చూ జ‌రుగుతుంది. స‌ఫారీ బ్రౌజ‌ర్లో ఆడియో బ్లాక్ అయ్యే ఉంటుంది. మీరు ఆథ‌రైజ్ చేస్తేనే సౌండ్ వ‌స్తుంది. బ్రౌజింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ బేస్డ్‌గా మీకు వ‌చ్చే యాడ్స్ విష‌యంలోనూ ప్రైవ‌సీ ఉండేలా స‌ఫారీ చూస్తుంది.  ఒక‌సారి మీరేదైనా వెబ్‌సైట్‌ను మీకు న‌చ్చిన‌ట్లు క‌స్ట‌మైజ్ చేసుకుంటే మ‌రోసారి ఆ సైట్‌కు వెళ్లిన‌ప్పుడు సేమ్ క‌స్ట‌మైజేష‌న్‌ను స‌ఫారీ ఆటోమేటిగ్గా ఇస్తుంది.  
* మ్యాక్ ఫీచ‌ర్ల‌లో కీల‌క‌మైన Spotlight ను మ‌రింత ఇంప్రూవ్ చేశారు. ఇది గూగుల్ డెస్క్‌టాప్ వెర్ష‌న్‌లా ప‌ని చేస్తుంది.  బ్రౌజ‌ర్‌ను ఓపెన్ చేసిన‌ట్టే దీన్ని ఓపెన్ చేసి బ్రౌజ్ చేసుకోవ‌చ్చు.  
*   గ్రాఫిక్స్ పెర్‌ఫార్మెన్స్‌, వీఆర్ సపోర్ట్ ను ఇంక్రీజ్ చేశారు.  
*  ఫొటోస్ అప్‌డేట్స్‌:  మీడియా టైప్‌ను బ‌ట్టి ఆల్బ‌మ్‌ను సార్ట్ చేయ‌డానికి కొత్త సైడ్‌బార‌న్‌ను తీస‌కొచ్చారు.  లైవ్ ఫోటోను కూడా జిఫ్‌గా మార్చే ఏర్పాట్లు చేశారు. ఫొటోస్‌లో ఉన్న ఫొటోల‌ను థ‌ర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా ఎడిట్ చేయొచ్చు
* ఈ మెయిల్ అప్‌డేట్స్:   Apple Mail  పేరుతో కొత్త మెయిల్ యాప్ ను తీసుకొచ్చారు. ఇది స్ప్లిట్ స్క్రీన్ వ్యూను ఇస్తుంది. 0
* ఐ క్లౌడ్ ఫైల్ షేరింగ్‌: iCloud File Sharingతో ఐవోఎస్ డివైస్‌ల్లో ఉన్న ఫైల్‌ను మ్యాక్ ఓఎస్‌తో షేర్ చేసుకోవ‌చ్చు.  ఫైల్ లింక్స్‌ను మెసేజ్ లేదా ఈ మెయిల్ చేస్తే రెసిపెంట్ దాన్ని చూడొచ్చు లేదా ఆ ఫైల్‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు కూడా.  


 

జన రంజకమైన వార్తలు