• తాజా వార్తలు

8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజితో నూబియా జ‌డ్ 17... జూన్ 6న రిలీజ్‌

ఇండియ‌న్ స్మార్టుఫోన్ మార్కెట్లో స్పీడు పెంచుతున్న నూబియా మ‌రో కొత్త ఫోన్ ను లాంఛ్ చేయ‌డానికి రెడీ అవుతోంది. అందుకు జూన్ 6ను ముహూర్తంగా నిర్ణ‌యించుకుంది. 'జ‌డ్‌17'ను ఈ నెల 6వ తేదీన దీన్ని విడుద‌ల చేయ‌నుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజి... 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో దీన్ని విడుద‌ల చేస్తున్నారు. 6జీబీ వేరియంట్ ధ‌ర రూ.26,490 కాగా 8జీబీ వేరియంట్‌ రూ.32,170కి ల‌భ్యం కానుంది. రెండు రియ‌ర్ కెమేరాల్లో ఒక‌టి ఏకంగా 23 మెగా పిక్సెళ్లు కావ‌డం విశేషం. అలాగే ఇది వాట‌ర్ రెసిస్టెంట్ ఫోన్‌
స్పెక్స్‌
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్
1920 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్
64/128 జీబీ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
వాట‌ర్ రెసిస్టెంట్
12, 23 మెగాపిక్స‌ల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 4.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
3200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0

జన రంజకమైన వార్తలు