• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - గుర‌క‌ను నియంత్రించే స్మార్ట్ బెడ్ ర‌డీ

గురక ఎంత భ‌యంక‌ర‌మో  అనుభ‌వించేవారికే తెలుస్తుంది. గుర‌క పెట్టేవాళ్ల కంటే వారితో పాటు ఉండేవాళ్లకు ఇంకా న‌ర‌కం. అలాంటి గుర‌క‌ను అరిక‌ట్ట‌డానికి కొత్త ప‌రిష్కారం వ‌చ్చేసింది. అదే స్మార్ట్ బెడ్‌.. గ‌తేడాది జ‌రిగిన‌  క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ షోలో హోం అప్ల‌య‌న్సెస్ కేట‌గిరీలో ఫ‌స్ట్ ప్రైజ్ కొట్టేసింది. ఈ గుర‌క‌ను అరిక‌ట్టే ఈ కొత్త‌ర‌కం ప‌రుపు గురించి తెలుసుకుందామా?
స్లీప్ నెంబ‌ర్ 360
యూఎస్ బేస్డ్ కంపెనీ సెలెక్ట్ కంఫ‌ర్ట్  ఓ స్మార్ట్ ప‌రుపును త‌యారు చేసింది. దీన్నిలాస్‌వెగాస్‌లో గ‌త సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ షోలో  ఫ‌స్ట్‌టైం ప్ర‌ద‌ర్శించారు. స్లీప్ నెంబ‌ర్ 360 అని పిలిచే ఈ  బెడ్ దానిమీద  ప‌డుకున్న‌వాళ్లు గుర‌క పెడితే ఆటోమేటిగ్గా  అడ్జ‌స్ట్ అవుతుంది.దీంతో గుర‌క‌పెట్టేవాళ్లు త‌మ పొజిష‌న్ మార్చుకుంటారు. అలా గుర‌కను కంట్రోల్ చేయ‌వ‌చ్చ‌న్న‌ది ఫార్ములా.
ఇలా ప‌నిచేస్తుంది
ఈ ప‌రుపులో రెండు ఎయిర్ ఛాంబ‌ర్స్ ఉంటాయి. ప‌రుపులో ఉండే ఆటోమేటిక్ స్నోర్ డిటెక్ష‌న్‌, ఎడ్జ‌స్ట్‌మెంట్ టెక్నాల‌జీ ఆధారంగా ఎయిర్ ఛాంబ‌ర్స్ ఎడ్జ‌స్ట్ అవుతుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు  నిద్ర పోతున్న వ్యక్తి గుర‌క‌పెడితే అత‌ను ప‌డుకున్న‌వైపు ప‌రుపులో ఉన్న ఎయిర్ ఛాంబ‌ర్‌పై ఒత్తిడి పెరిగి అది పైకి లేస్తుంది. దీంతో గుర‌క పెడుతున్న ప‌ర్స‌న్ అడ్జ‌స్ట్ అయి ప‌డుకుంటాడు. దాంతో గుర‌క ఆగిపోతుంది. ఈ బెడ్ మీ నిద్ర స‌మ‌యాన్ని అంచ‌నా వేసి రోజూ మీరు లేచే టైమ్‌కి ఆటోమేటిగ్గా మిమ్మ‌ల్ని నిద్ర లేపుతుంది. 

జన రంజకమైన వార్తలు