• తాజా వార్తలు
  •  

త్వ‌ర‌లో క్యాబ్‌లాగే ఛార్టెడ్ ఫ్లైట్ స‌గం ధ‌ర‌కే బుక్ చేసుకోవ‌చ్చ‌ట 

ఓలా, ఉబెర్‌లో క్యాబ్ బుక్ చేసుకున్న‌ట్లే ఛార్టెడ్ ఫ్లైట్స్ కూడా బుక్ చేసుకోవ‌చ్చ‌ట. అది కూడా స‌గం ధర‌కే వ‌చ్చే అవ‌కాశం ఉంది. రీజ‌న‌ల్ క‌నెక్టివిటీ స్కీం కింద ఇండియన్ గ‌వ‌ర్న‌మెంట్ దేశంలో ప్ర‌జ‌లకు విమాన‌యానాన్ని చౌక‌లో అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కీం కింద ఎయిర్ క్రాఫ్ట్ ఛార్ట‌ర్ కంపెనీల‌న్నీ ఒకే ఫ్లాట్‌ఫాం మీద‌కు తెచ్చి 50% వ‌ర‌కు డిస్కౌంట్‌తో ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించాల‌న్న‌ది ప్లాన్‌.  

మార్కెట్ పెంచుకోవ‌డానికి ప్లానింగ్‌
ఇండియాలో 129 జ‌న‌ర‌ల్ ఏవియేష‌న్ ఆప‌రేట్ల‌రున్నారు. ఇందులో 60 వ‌ర‌కు  విమాన‌యాన సంస్థ‌లు. మిగిలిన‌వి కేవ‌లం హెలికాప్ట‌ర్లు మాత్ర‌మే న‌డిపిస్తాయి.  వీటిలో క్రాఫ్ట్ అద్దెకు తీసుకుంటే రిట‌ర్న్ ఛార్జిని కూడా క‌లిపి వేస్తున్నారు.  ఆరు నుంచి 9 సీట్లున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఒక గంట‌కు రెంట్‌కు తీసుకోవాలంటే 1,50,000ల నుంచి 2 లక్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ అవుతుంది. రిట‌ర్న్ ఛార్జిని త‌గ్గించ‌గ‌లిగితే 50% వ‌రకు డిస్కౌంట్ ఇవ్వ‌చ్చ‌ని కంపెనీలు అంటున్నాయి.  మార్కెట్‌ను పెంచుకోవ‌డానికి హాలీడే ప్యాకేజీల కోసం క్రాఫ్ట్‌ల‌ను అద్దెకిచ్చేందుకు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. 
ఎయిర్ అంబులెన్స్‌లు కూడా డిస్కౌంట్‌లో 
న్యూఢిల్లీ బేస్డ్ ఫ్లాప్స్ ఏవియేష‌న్ దేశంలోనే తొలి ఎక్స్‌క్లూజివ్ ఎయిర్ అంబులెన్స్ స‌ర్వీస్‌ను ఈ నెలాఖ‌రున ప్రారంభిస్తోంది. మార్కెట్ రేట్ కంటే 20% త‌క్కువ‌కే ఈ స‌ర్వీస్‌ను అందిస్తామ‌ని కంపెనీ ఎండీ అమిత్ కుమార్ చెప్పారు.  ప్ర‌స్తుతం గౌహ‌తి నుంచి ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్ తీసుకెళ్లాలంటే 5 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తున్నారు. గౌహతి నుంచి ప్రారంభించి రాయ్‌పూర్‌, పాట్నా, కోచి, సూర‌త్‌, విశాఖ‌పట్నంల‌కు కూడా ఎయిర్ అంబులెన్స్ స‌ర్వీస్‌లు ప్రారంభించాల‌న్న‌ది ఫ్లాప్స్ ఏవియేష‌న్ ప్లాన్.  ఇన్సూరెన్స్ కంపెనీల‌తో టై అప్ చేసుకుని ఛార్జీల త‌గ్గించాల‌ని చూస్తున్నారు.  

జన రంజకమైన వార్తలు