• తాజా వార్తలు
  •  

గూగుల్ ఇమేజెస్‌కి ఏడు బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌త్యామ్నాయాలు

ఒక్క చిత్రం వెయ్యి మాట‌ల‌కు స‌మానం అంటారు. అందుకే న్యూస్‌పేప‌ర్లు, టీవీ ఛాన‌ల్స్‌నుంచి సోష‌ల్ మీడియాలో చిట్‌చాట్స్ వ‌ర‌కూ అన్నింటికీ ఇమేజెస్ అంత కీల‌కంగా మారాయి. సాధార‌ణంగా మ‌న‌కు ఇమేజ్ కావాలంటే గూగుల్ ఇమేజ్‌లోకి  వెళ్లి కీవ‌ర్డ్ టైప్ చేసి సెర్చ్ చేసేస్తాం. కానీ గూగుల్‌తో స‌మానంగా మంచి ఇమేజ్‌లు అందించే ప్ర‌త్యామ్నాయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం.. కుదిరితే ఓ ట్ర‌య‌ల్ వేసేయండి మ‌రి.  
1. టినీ ఐ (Tineye)
ఇదొక రివ‌ర్చ్ ఇమేజ్ సెర్చ్ ఇంజ‌న్‌. గూగుల్ కీ వ‌ర్డ్‌తో ఇమేజ్ సెర్చ్ చేసిన‌ట్లే దీనితో ఇమేజ్‌ను బ‌ట్టి దాని వివ‌రాలు తెలుసుకునే రివ‌ర్స్ సెర్చ్ ప‌ని చేస్తుంది. సోష‌ల్ మీడియాలో లేదా గూగుల్ ఇమేజెస్‌లో మీరు ఏదైనా ఇమేజ్‌ను చూసి అది ఎక్క‌డైనా వాడాల‌నుకుంటే దాని వివ‌రాలు తెలుసుకోవ‌డానికి ఈ టినీ ఐ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇమేజ్‌ను లేదా దాని యూఆర్ఎల్‌ను ఈ సెర్చ్ ఇంజిన్‌లో అప్‌లోడ్ చేస్తే ఆ ఇమేజ్ డిటెయిల్స‌న్నీ తెలుస్తాయి.  
2. అన్‌స్ప్లాష్  (Unsplash)
క్రియేటివ్ కామ‌న్స్ లైసెన్స్ కింద ఉన్న ఇమేజ్‌లు మాత్ర‌మే దీనిలో దొరుకుతాయి. వీటిని ఫ్రీగా వాడుకోవ‌చ్చు. ఎంతో మంది ఫొటోగ్రాఫ‌ర్లు ఈ సైట్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన‌ హై క్వాలిటీ ఇమేజ్‌లు దీనిలో వేల కొద్దీ ఉంటాయి. అవి కూడా కేటగిరీ వారీగా సెర్చ్ చేసుకోవ‌చ్చు. 
3. పిక్సాబే (Pixabay)
పిక్సాబేలో 12 లక్ష‌ల‌కుపైగా ఇమేజ్‌లు ఉన్నాయి. అవి కూడా హై క్వాలిటీవి. మీరు సెర్చ్ చేసిన ఇమేజ్ దొరికితే దాన్ని డిఫ‌రెంట్ సైజ‌స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. హై రిజ‌ల్యూష‌న్‌తో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రిజిస్ట‌ర్ చేసుకోవాలి.ఇది కూడా ఫ్రీయే.  క్లాస్‌రూమ్‌లో, ఆఫీస్‌లో మీరు సెర్చ్ చేయాల‌నుకుంటే సేఫ్ సెర్చ్ మోడ్ అనేబుల్ చేసుకోవ‌చ్చు.  
4. పిక్‌విజార్డ్ (PikWizard)
పిక్ విజార్డ్ మ‌రో మంచి సెర్చ్ ఇంజిన్‌.   హైక్వాలిటీ ఇమేజ్‌లను కేటగిరీ, కీవ‌ర్డ్స్‌, ఫేవ‌రెట్స్‌,ట్రెండింగ్ ఇలా ర‌క‌ర‌కాలుగా బ్రౌజ్ చేసుకుని వాడుకోవచ్చు.  మీరు బ్లాగ‌ర్ లేదా రైట‌ర్ అయితే ఇందులో ఉండే editorial ఆప్ష‌న్ యూజ్ చేసుకుంటే మ‌రింత లోతుగా సెర్చ్ చేసుకోవ‌చ్చు. ఫొటో తీసిన ఫొటోగ్రాఫ‌ర్స్‌కి క్రెడిట్స్ ఇస్తుంది ఈ సైట్‌. అందుకే ఇమేజ్ తీసుకునేముందు రూల్స్ చూడండి. 
5. ఫొటోస్ ఫ‌ర్ క్లాస్ (Photos for Class)
క్లాస్‌రూమ్‌లో ప్రొజెక్ట్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డే స్ట‌ఫ్ ఇది. టీచ‌ర్స్ స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్ప‌డానికి ఉప‌యోగ‌ప‌డే ఇమేజ్‌లు దొరుకుతాయి. దీనిలో ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఆథ‌ర్ క్రెడిట్స్‌, సైటేష‌న్స్ ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్ అవుతాయి. 
6. డ్రైవ‌ర్ లేయ‌ర్ (Driver Layer) 
గూగుల్‌, ఫ్లిక‌ర్ త‌ర్వాత అతి పెద్ద డేటా ఇమేజ్ బ్యాంక్ ఉన్న సైట్ ఇదే. ఇందులో దాదాపు 1000 కోట్ల ఇమేజ్‌లు ఉంటాయి.  గూగుల్ లాగే సైజ్‌, డేట్‌, టైం, కీవ‌ర్డ్స్‌తో సెర్చ్ చేసుకోవ‌చ్చు.  
7. ఫ్లిక‌ర్ (Flickr) 
ఫ్లిక‌ర్‌లో లైసెన్స్‌డ్‌, నాన్ లైసైన్స్‌డ్ ఇమేజ్‌లు కూడా ఉంటాయి. వీటిని కీవ‌ర్డ్స్‌, లైసెన్స్‌ల ఆధారంగా సెర్చ్ చేసి తెలుసుకోవ‌చ్చు.  క‌ల‌ర్‌ను బ‌ట్టి సెర్చ్ చేయ‌గ‌లిగే సూప‌ర్ ఫీచ‌ర్ ఫ్లిక‌ర్ సొంతం.  

విజ్ఞానం బార్ విశేషాలు