• తాజా వార్తలు
  •  

వాట్సాప్ vs గూగుల్ తేజ్ vs పేటీఎం ఏది బెస్ట్?

గతంలో నగదు బదిలీ చేయాలంటే బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వచ్చేంది. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సీన్ మారిపోయింది. బ్యాంకింగ్ యాప్స్‌తో పేమెంట్ చేయ‌డం మ‌రింత ఈజీ అయిపోయింది. త్వరలో రాబోతున్న యూపీఐ విధానంతో నగదు చెల్లింపులు డెడ్ ఈజీ కానున్నాయి. ఇప్పటికే గూగుల్ తేజ్, పేటీఎం ద్వారా వినియోగదారులు నగదు బదిలీ చేస్తున్నారు. వీటికి పోటీగా వాట్సాప్ కూడా పేమెంట్స్ ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  నగదు చెల్లించాలంటే ఆయా బ్యాంకుల యాప్స్ లేదా పేటీఎం, గూగుల్ తేజ్ లాంటి వాలెట్స్ వాడాల్సిన అవ‌స‌రం లేకుండా మ‌నం మెసేజ్‌ల కోసం వాడుకునే వాట్సాప్‌తోనే పూర్తి చేసుకోవ‌చ్చు. అయితే వాట్సాప్, గూగుల్ తేజ్, పేటీఎం వీటిలో నగదు చెల్లింపులకు ఏది బెస్ట్‌? అన్న ప్రశ్న‌కు స‌మాధాన‌మే ఈ ఆర్టికల్ .
 ఇండియాలో వాట్సాప్ యూజర్లకు ఇప్పుడు UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌)ను ఉపయోగించి డబ్బులు చెల్లించవచ్చు, పొందవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ కొంత‌మందికి అందుబాటులోకి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి రానుంది. NPCI  (నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా ప్రవేశపెట్టిన UPI అనేది ఒక పేమెంట్ ఫ్లాట్ పాం. ఈ ఫ్లాట్ ఫాం ద్వారా నగదు పంపించేవారి బ్యాంక్ అకౌంట్ నుంచి రిసీవ‌ర్ అకౌంట్ కు డైరెక్ట్‌గా మ‌నీ పంపిస్తుంది. నగదు పంపే వ్యక్తి .. వాలెట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించాల్సిన అవసరం లేదు.  
వాట్సాప్ లో UPI 
సెట్టింగ్స్ పేజీలోని పేమెంట్ ఆప్షన్ ద్వారా వాట్సాప్ పేమెంట్ యాక్సెస్ చేయవచ్చు. దానిపై ట్యాప్ చేస్తే, వెరిఫికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు యూజర్లు తమ బ్యాంకు అకౌంట్‌కు లింక‌యి ఉన్న మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. గూగుల్ తేజ్ మాదిరిగానే ఇందులో కూడా వెరిఫికేషన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. UPIని  ఉపయోగించేవారు OTPతో  వెరిఫై చేస్తే చాలు. ఇందుకోసం నాలుగు అంకెల పిన్ నెంబర్ క్రియేట్ చేయాలి. ప్రతిసారి ట్రాన్సాక్షన్స్ చేసేట‌ప్పుడు పిన్ త‌ప్ప‌నిస‌రిగా ఎంట‌ర్‌చేయాలి. పిన్ నెంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ పేమెంట్ పేజీలో కనిపిస్తాయి. యూజర్లు చాట్ విండోను ఓపెన్ చేసి కావాల్సిన వారికి నగదును పంపించవచ్చు. పేపర్ క్లిప్ ఐకాన్‌పై నొక్కితే పేమెంట్స్ బటన్‌కి వెళ‌తాం. ఇది పేమెంట్ పేజీలోకి తీసుకెళుతుంది. అక్క‌డ మీరు సెండ్ చేయాల‌నుకున్న అమౌంట్‌ను ఎంట‌ర్ చేస్తే చాలు. 
పేటీఎం
పేటీఎంలో యూపీఐ పేమెంట్... హోంపేజీలోని ఇన్‌బాక్స్‌లో ఉంటుంది. ఈ యాప్‌లో ఉన్న మెసెంజ‌ర్ స‌ర్వీస్‌తో యూజ‌ర్లు త‌మ ఫ్రెండ్స్‌తో చాటింగ్ కూడా చేసుకోవ‌చ్చు. 
* యూజర్లు ఎవ‌రయినా ఫ్రెండ్‌తో చాట్ విండోను ఓపెన్ చేసి...ఆ విండో కింది భాగంలో ఉన్న రుపీ ఐకాన్ పై నొక్కండి. ఇప్పుడు యూపీఐ  పేమెంట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 
*  అయితే దీనికి ముందు  యూజర్లు త‌మ అకౌంట్‌ను భీమ్ యూపీఐ సెక్షన్ లో ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది.
* ఫ్రెండ్స్ కే కాదు..  ఏదైనా కొనాల‌న్నా, స‌ర్వీస్‌కు బిల్ పే చేయాల‌న్నా పేటీఎం యూపీఐని వాడుకోవ‌చ్చు.దీనికి పేటీఎంలో మ‌నీ రిసీవ్ చేసుకునే వ్య‌క్తి ఫోన్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. లేదా QR కోడ్ స్కాన్ చేయాలి.  ఈ ఫీచర్స్ వాట్సాప్ లో ఇంకా అందుబాటులోకి రాలేదు.
గూగుల్ తేజ్ 
గూగుల్ తేజ్ కూడా ఒక పేమెంట్ యాప్.  హోం పేజీలో రైట్ సైడ్ హోం పేజీని చూపిస్తుంది. 
* యూజర్స్ గూగుల్ కాంటాక్ట్స్‌కు మ‌నీ పంప‌వ‌చ్చు. 
* సినిమా టిక్కెట్లు కొనుక్కోవ‌చ్చు. డీటీహెచ్ రీఛార్జ్ చేసుకోవ‌చ్చు. ప‌వ‌ర్‌బిల్లులు క‌ట్ట‌వచ్చు. ఆన్‌లైన్ స్టోర్స్‌లో బిల్ పే చేయొచ్చు. 
* యూపీఐ ఐడీ లేదా IFSC కోడ్‌తో ఉన్నబ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉపయోగించి  పేమెంట్ చేయొచ్చు. 
* గూగుల్ తేజ్ కేస్ మోడ్ అనే ప్ర‌త్యేక ఫీచ‌ర్ ఉంది. దీంతో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారా ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ తేజ్ యూజర్ల‌కు ఆడియో క‌మాండ్స్ ఉపయోగించి వారి బ్యాంక్ అకౌంట్‌కు డ‌బ్బులు పంపించేయోచ్చు. 
ఫైన‌ల్‌గా చెప్పాలంటే..
వాట్సాప్‌లో పేమెంట్ ఆప్ష‌న్  కేవలం ఫ్రెండ్స్, ఫోన్‌లో కాంటాక్స్ట్‌కు మాత్రమే పరిమితం. వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్ ప‌ని చేస్తుంది. గూగుల్ తేజ్ యాప్ లేని వారికి కూడా వారి బ్యాంక్ అకౌంట్‌కు డ‌బ్బులు పంపించ‌డానికి గూగుల్ తేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  పేటీఎంలోని యూపీఐ కూడా వాట్సాప్ మాదిరిగానే ప‌ని చేస్తుంది. అంటే రిసీవ‌ర్‌కు కూడా పేటీఎం యాప్ ఉండాలి. అయితే దీనితో పేటీయం యూపీఐ పేమెంట్స్‌ను కూడా అనుమ‌తిస్తుంది.