• తాజా వార్తలు
  •  

2017 లో అంతరించిన 10 పెద్ద టెక్నాలజీ లు

ప్రపంచం లో అన్ని రంగాల్లో జరిగే విధంగానే డిజిటల్ ప్రపంచం లో కూడా గ్యాడ్జేట్ లు మరియు టెక్నాలజీ లు వస్తూ, పోతూ ఉంటాయి. 2017 వ సంవత్సరం లో కూడా వివిధ టెక్నాలజీ లు ఇలాగే మాయం అయిపోయాయి. వీటిలో చాలావరకూ ఒకప్పుడు మన జీవితాలను శాసించినవే. అలాంటి ఒక 10 టెక్నాలజీ ల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

విండోస్ ఫోన్                                                   

ఎట్టకేలకు విండోస్ ఫోన్ శకం ఈ సంవత్సరం తో ముగిసినట్లు మైక్రో సాఫ్ట్ ప్రకటించింది. మైక్రో సాఫ్ట్ అధికారిక ట్విట్టర్ ఎకౌంటు నుండి వెలువడిన వరుస ట్వీట్ల ద్వారా ఇకపై విండోస్ మొబైల్ కు కొత్త ఫీచర్ లు గానీ హార్డ్ వేర్ ను గానీ డెవలప్ చేయడం లేదని ప్రకటించారు. అయితే ఇప్పటికే వాడుకలో ఉన్న విండోస్ ఫోన్ లకు మాత్రం బగ్ ఫిక్సింగ్, సెక్యూరిటీ అప్ డేట్ ల లాంటివి కొనసాగుతాయి.

మైక్రో సాఫ్ట్ కినెక్ట్         

ఎక్స్ బాక్స్ 360 మరియు ఎక్స్ బాక్స్ వన్ గేమింగ్ కన్సోల్ ల యొక్క మోషన్ సెన్సింగ్ యాక్సేసరి అయిన కినెక్ట్ అనే ప్లగ్ ఆన్ ను కూడా ఇకనుండి ఆపివేస్తున్నట్లు మాతృసంస్థ అయిన మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 2010 వ సంవత్సరం లో మార్కెట్ లోనికి ప్రవేశించిన ఈ కినెక్ట్ అత్యంత వేగo గా అమ్ముడుపోయిన డివైస్ గా ఎక్స్ బాక్స్ గిన్నిస్ రికార్డు నెలకొల్పడం లో కీలక పాత్ర వహించింది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో ఇది కనుమరుగు అయినప్పటికీ దీని కోర్ సెన్సార్ మాత్రం ఇంకా ఉంటుంది.

3D టీవీ లు         

గత కొద్ది సంవత్సరాల క్రితం వరకూ ఈ 3D టీవీ లు అనేవి హాటెస్ట్ టెక్నాలజీ గా ఉండేవి. అయితే 2017 సంవత్సరానికి వచ్చేసరికి అతి పెద్ద టీవీ బ్రాండ్ లు అయిన LG మరియు సోనీ లాంటి కంపెనీలు తమ టీవీ లకు 3D టెక్నాలజీ ని అందించడం మానివేసాయి. మరొక పెద్ద బ్రాండ్ అయిన సామ్సంగ్ 2016 లోనే ఈ విభాగం నుండి తప్పుకుంది. TCL మరియు షార్ప్ లాంటి ఇతర కంపెనీలు కూడా ఈ 3D టీవీ ల గురించి ఇంతవరకూ ఏ ప్రకటనా చేయలేదు. ఈ ట్రెండ్ చూస్తుంటే 3D టీవీ లు ఇక మాయం అయినట్లే అనిపిస్తుంది.

ఆపిల్ ఐ పోడ్ షఫుల్ మరియు ఐ పాడ్ నానో

ఆపిల్ యొక్క మోస్ట్ పాపులర్ డివైస్ లు అయిన ఐ పోడ్ మరియు ఐ పాడ్ నానో లకు ఆపిల్ ఈ సంవత్సరం వీడ్కోలు పలికింది. ఆపిల్ యొక్క ఐకానిక్ MP3 ప్లేయర్ లు అయిన ఈ రెండూ ఇంటర్ నెట్ సామర్థ్యం విషయం లో కొంత వెనుకబడి ఉన్నాయి. అలాగే గత రెండు సంవత్సరాల నుండీ ఇవి అప్ డేట్ చేయబడలేదు.

AIM ఇన్ స్టంట్ మెసేజింగ్ పయనీర్

AOL యొక్క ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ అయిన AIM కూడా ఇదే సంవత్సరం మూతపడింది. 20 సంవత్సరాల పాటు నిరాటంకంగా నడిచిన ఇది గత డిసెంబర్ 15 వ తేదీన ఆపివేయబడినట్లు కంపెనీ ఒక ప్రకటన లో తెలిపింది.

గూగుల్ టాంగో

ఈ సంవత్సరం మొదట్లో టాంగో ను ఆపి వేస్తున్నట్లు  ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఫోన్ లకు అగ్మెంటేడ్ రియాలిటీ బేస్డ్ యాప్ లను టాంగో డెవలప్ చేస్తుంది.

గూగుల్ క్రోమ్ యాప్స్      

ఈ డిసెంబర్ లో విండోస్, మాక్ క్రోమ్ యొక్క లైనక్స్ వెర్షన్ లకు క్రోమ్ వెబ్ స్టోర్ యొక్క యాప్ సెక్షన్ ను ఆపి వేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇంతకుముందు ఇన్ స్టాల్ చేసిన యాప్ లు మాత్రం టెక్నికల్ గా  2018 మొదటి త్రైమాసికం వరకూ పనిచేస్తాయని గూగుల్ వెల్లడించింది.

G టాక్

2005 లో మార్కెట్ లోనికి ప్రవేశించిన మెసేజింగ్ ఫ్లాట్ ఫాం అయిన జి టాక్ లేదా జి చాట్ అధికారికంగా క్లోజ్ అయింది. ఇది గూగుల్ హాంగ్ ఔట్స్ ద్వారా రీ ప్లేస్ చేయబడింది.

మైక్రో సాఫ్ట్ గ్రూవ్ మ్యూజిక్

మైక్రోసాఫ్ట్ నుండి ఈ ఆర్టికల్ లో వస్తున్న వాటిలో ఈ గ్రూవ్ మ్యూజిక్ మూడవది. డిసెంబర్ 31 నుండీ ఈ గ్రూవ్ మ్యూజిక్ సర్వీస్ లను నిలిపివేస్తున్నట్లు మైక్రో సాఫ్ట్ ప్రకటించింది. ఇన్ బిల్ట్ గ్రూవ్ మ్యూజిక్ మాత్రం కొనసాగుతుంది.

నింటెండో ఎంటర్ టెయిన్ మెంట్ సిస్టం ( NES క్లాసిక్ ఎడిషన్ )

2017 లో అంతరించిపోతున్న మరొక పెద్ద గాడ్జెట్ ఈ NES క్లాసిక్ ఎడిషన్. ఈ సంవత్సరం తో దీని సర్వీస్ లు నిలిపివేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

 

 

 

 

 

 

 

 

 

విజ్ఞానం బార్ విశేషాలు