• తాజా వార్తలు

2017లో గూగుల్ తెచ్చిన  ఈ 9 యాప్స్‌.. మ‌న‌కెంత ఉప‌యోగ‌మో తెలుసా? 

మ‌రో 10 రోజుల్లో 2017 ముగిసిపోతుంది.  ఈ ఏడాది గూగుల్ చాలా కొత్త యాప్స్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. అందులో తొమ్మిది యాప్స్  స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.  కొన్ని ఆండ్రాయిడ్‌లో మ‌రికొన్ని  ఐవోఎస్‌లో ప‌ని చేస్తాయి. కొన్ని యాప్స్ రెండింటిలోనూ ప‌ని చేస్తాయి.  
గూగుల్ తేజ్ 
గూగుల్ నుంచి వ‌చ్చిన పేమెంట్ సొల్యూష‌న్ యాప్ ఇది.  ఇండియాకే మాత్ర‌మే ప‌రిమిత‌మైన యాప్‌. ఈ యూపీఐ బేస్డ్  యాప్ ద్వారా మ‌నీని డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచే వాడుకోవ‌చ్చు.  ఈ వాలెట్ల‌లో లోడ్ చేసుకుని అక్క‌డి నుంచి వాడుకోవాల్సిన ప‌ని లేదు. ఇంగ్లీష్‌, హిందీతో పాటు బెంగాలీ, గుజ‌రాతీ, కన్న‌డ‌, త‌మిళ్‌, తెలుగు, మ‌రాఠీ లాంటి రీజ‌న‌ల్ లాంగ్వేజెస్‌లో  యాప్ ఇంట‌ర్‌ఫేస్ ఉంది. 
స్క్ర‌బ్బీస్‌
ఇది ఐవోఎస్ డివైస్‌ల్లో మాత్ర‌మే ప‌ని చేస్తుంది. ఈ కెమెరా బేస్డ్ యాప్  వీడియో ప్లే బ్యాక్ స్పీడ్‌, డైరెక్ష‌న్‌ను మానిప్యులేట్ చేసి వీడియో లూప్స్‌ను క్రియేట్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా వీడియో షూట్ చేస్తే ప్లేతోపాటు షేరింగ్ కూడా ఫింగ‌ర్ టిప్స్ మీద చేసేయొచ్చు. 
స్టోరీబోర్డ్ 
స్టోరీ బోర్డ్ ఆండ్రాయిడ్ ఓన్లీ యాప్‌. మీ వీడియోస్ కామిక్స్‌గా మారుస్తుంది. వీడియోను డిఫ‌రెంట్ ఫ్రేమ్స్‌తో క‌స్ట‌మైజ్ చేస్తుంది. 
సెల్ఫిస్మో
సెల్ఫీ ల‌వ‌ర్స్‌కి బాగా న‌చ్చే యాప్ సెల్ఫిస్మో. ఈ యాప్‌ను ఓపెన్ చేస్తే మీరు ఫోజివ్వ‌గానే ఆటోమేటిగ్గా  ఫొటో తీస్తుంది. మీరు ఫోజ్ మార్చిన‌ప్పుడ‌ల్లా ఫొటో క్యాప్చ‌ర్ చేస్తుంది. అయితే ఈ ఇమేజెస్ బ్లాక్ అండ్ వైట్‌లో మాత్ర‌మే వ‌స్తాయి.  ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లో కూడా వాడుకోవ‌చ్చు. 
డాటాలీ
డాటా వినియోగాన్ని మేనేజ్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డే యాప్ ఇది. మీరుడేటాను ఎలా వాడుతున్నారు? ఎలా కంట్రోల్ చేసి సేవ్ చేసుకోవాలో చూపిస్తుంది. ప్ర‌తి యాప్‌లో డేటా యూసేజ్‌ను కంట్రోల్ చేయ‌డానికి, రియ‌ల్‌టైమ్ యాప్ యూసేజ్‌ను మానిట‌ర్ చేయ‌డానికి ఫీచ‌ర్లున్నాయి.  ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆండ్రాయిడ్ యూజ‌ర్ల కోసం గూగుల్ దీన్ని త‌యారుచేసింది. 
ఫైల్స్ గో
ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్ వెర్ష‌న్ లోని గో ఎడిష‌న్‌లో భాగంగా గూగుల్ ఫైల్స్ గో యాప్‌ను లాంచ్ చేసింది.  ఇది ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ మేనేజ‌ర్‌లా ప‌ని చేస్తుంది.   కేవ‌లం 6 ఎంబీ సైజ్‌లో ఉండే ఈ యాప్ మీ ఫోన్లో డూప్లికేట్ ఫైల్స్‌ను డిలీట్ చేయ‌డం, ఎక్స్‌ట్రా లార్జ్ ఫైల్స్‌ను మీ నోటీస్‌కు తేవ‌డం చేస్తుంది.  
గూగుల్ ఏరియో
ఆండ్రాయిడ్ యూజర్ల‌కు మాత్ర‌మే ప‌నికొచ్చే హైప‌ర్ లోక‌ల్ యాప్ ఇది. ఫుడ్ డెలివ‌రీ, బ్యూటీ, హోం మెయింట‌నెన్స్‌, రిపేర్స్‌,ఇన్‌స్ట‌లేష‌న్‌, ఫిట్‌నెస్‌, క్లీనింగ్  వంటి స‌ర్వీస్‌లను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ముంబ‌యి, బెంగ‌ళూరు, ఢిల్లీ , గుర్‌గావ్‌ల్లోని ఆండ్రాయిడ్ యూజ‌ర్స్‌కు ప‌ని చేస్తుంది.  
గూగుల్ ఒపీనియ‌న్ రివార్డ్స్‌
గూగుల్ యాప్స్‌ను రివ్యూ చేసి ఫ్రీ క్రెడిట్ గెలుచుకోవ‌డానికి ఈ యాప్‌ను రిలీజ్ చేసింది. స‌ర్వేస్ పార్టిసిపేట్ చేయ‌డం, యాప్స్ రివ్యూస్ వంటివి చేయ‌డం ద్వారా మీకు క్రెడిట్స్ వ‌స్తాయి. దీంతో ప్లే స్టోర్‌లో పెయిడ్ యాప్స్ కొనుక్కోవ‌చ్చు. 
యూట్యూబ్ గో 
2016లోనే లాంచ్ అయిన యూట్యూబ్‌గో యాప్ ఇండియాకు ఈ సంవ‌త్స‌ర‌మే వ‌చ్చింది.   ఈ యాప్‌తో మీరు యూట్యూబ్‌లో నుంచి వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. చూడొచ్చు.  ఎంత ఎంబీ యూజ్ చేయాలో సెలెక్ట్ చేసుకోవ‌చ్చు. మీ కాంటాక్ట్స్‌తో వాటిని షేర్ చేసుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు