• తాజా వార్తలు
  •  

రివ్యూ - ఆండ్రాయిడ్ గో యాప్స్ వ‌ర్సెస్ రెగ్యుల‌ర్ యాప్స్.. ఏంటి తేడా?

గూగుల్ కొత్త‌గా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ వేరియంట్ ఆండ్రాయిడ్ గో గురించి అంద‌రూ వినే ఉంటారు. ఇది కేవ‌లం ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్‌ఫోన్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మా? అందుకే ఆండ్రాయిడ్ గో ద్వారా ఆండ్రాయిడ్ గో యాప్‌ల‌ను రిలీజ్ చేయ‌డానికి గూగుల్ ప్ర‌య‌త్నాల్లో ఉంది. త‌క్కువ డేటాను ఖ‌ర్చు చేస్తూ ఎక్కువ ఫ‌లితాన్ని ఇవ్వ‌డ‌మే ఈ యాప్‌ల ప్ర‌త్యేక‌త‌. అయితే సాధార‌ణ యాప్‌ల‌కు ఆండ్రాయిడ్ గో యాప్‌ల‌కు ఉన్న ప్ర‌ధాన తేడా ఏమిటి? అస‌లు ఆండ్రాయిడ్ గో యాప్‌ల వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి?

గూగుల్ గో వ‌ర్సెస్ గూగుల్ 
రెగ్యుల‌ర్ గూగుల్ యాప్‌ల‌తో పోలిస్తే ఈ యాప్‌లు చాలా సింపుల్‌. లైట్ యాప్‌లు. సింపుల్‌గా ఉండి క్లియ‌ర్‌గా డివైజ్ అయిన యాప్‌లు ఇవి. వాయిస్ సెర్చ్‌, మ్యాప్‌లు, జీఐఎఫ్‌, గూగుల్ ట్రాన్స్‌లేట్ లాంటి ఫీచ‌ర్లు ఈ యాప్‌ల ప్ర‌త్యేక‌త‌. ఇవి సైజు కేవ‌లం 12 ఎంబీ మాత్ర‌మే. అదే సాధార‌ణ యాప్‌లు అయితే 166 ఎంబీ సైజు ఆక్ర‌మిస్తాయి. గూగుల్ గో యాప్‌ల‌కు,సాధార‌ణ యాప్‌ల‌కు ఉన్న తేడా ఇదే. అయితే గూగుల్ గోలో గూగుల్ ఫీడ్ లాంటి ఫీచ‌ర్లు లేవు.  అయితే మీరు ఆదా చేసుకునే స్పేస్‌తో పోలిస్తే ఇలాంటి ఫీచ‌ర్లు లేక‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా అనిపించ‌దు.

గూగుల్ గో మ్యాప్స్ వ‌ర్సెస్ గూగుల్ మ్యాప్స్‌
మ్యాప్‌ల విష‌యంలో మాత్రం గూగుల్ గోదే కాస్త పైచేయి. ఎందుకంటే సైజు తక్కువ‌గా ఉండి.. వేగంగా ప‌ని చేయ‌డం గూగుల్ గో మ్యాప్స్ ప్ర‌త్యేక‌త‌. దీని ఏపీకే సైజు కేవ‌లం 0.09 ఎంబీ మాత్ర‌మే. కానీ సాధార‌ణ మ్యాప్ యాప్‌లు మాత్రం 48 ఎంబీ సైజుతో ఎక్కువ స్పేస్ ఆక్ర‌మిస్తాయి.అంతేకాక ఫీచ‌ర్ల ప‌రంగా చూసినా సాధార‌ణ మ్యాప్ యాప్‌ల కంటే గూగుల్ గో యాప్‌లే ముందంజ‌లో నిలుస్తాయి. ఇన్‌స్టాల్ చేసిన త‌ర్వాత మ్యాప్స్ గో కేవ‌లం 221 కేబీ సైజు మాత్ర‌మే ఆక్ర‌మిస్తాయి. కానీ సాధార‌ణ గూగుల్ మ్యాప్ యాప్‌లు మాత్రం ఇన్‌స్టాలేష‌న్ త‌ర్వాత 135 ఎంబీ సైజు తీసుకుంటాయి. 

ఫైల్స్ గో
సాధార‌ణంగా గూగుల్ డివైజ్‌ల‌లో ఫైల్ మేనేజ‌ర్ ప్ర‌త్యేకంగా ఉండ‌దు. దాన్ని ప్లే స్టోర్ నుంచి ఫైల్ మేనేజ‌ర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.కానీ ఆండ్రాయిడ్ గో వాడుతున్న డివైజ్‌లో మాత్రం గూగుల్ ప్ర‌త్యేకంగా ఫైల్స్ గో అనే ఇన్‌బిల్ట్ యాప్‌ను అందిస్తోంది. ఇది కూడా ఫైల్ మేనేజ‌ర్ మాదిరిగానే ఉంటుంది. దీని సాయంతో సుల‌భంగా ఫైల్స్ ట్రాన్స‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఫైల్స్‌, ఫొటోలు, వీడియోలు దాచుకోవ‌చ్చు. ఫైల్స్ గో కూడా చాలా లైట్ యాప్‌. ఇది కేవ‌లం 14.41 ఎంబీ మాత్ర‌మే స్పేస్ ఆక్ర‌మిస్తుంది.