• తాజా వార్తలు
  •  

యాపిల్ వాచ్‌3, 4కే యాపిల్ టీవీల్లో ఉన్న సూప‌ర్ ఫీచ‌ర్లు తెలుసా? 

యాపిల్ సెప్టెంబ‌ర్ ఈవెంట్ అంటే ఐఫోన్ కొత్త మోడ‌ల్ వ‌స్తుంద‌ని ఐ ఫోన్ ల‌వ‌ర్స్ ఎంతో ఇంట‌రెస్ట్ చూపిస్తారు.  ఐఫోన్‌తోపాటు యాపిల్ వాచ్‌లు వంటి యాక్సెస‌రీస్‌ను,  టీవీల వంటి ఇత‌ర ప్రొడ‌క్ట్‌ల‌ను కూడా యాపిల్ లాంచ్ చేస్తుంది. మంగ‌ళ‌వారం క్యూప‌ర్టిన్‌లో జ‌రిగిన  ఈవెంట్‌లో ఐఫోన్ 8, 8 ప్ల‌స్‌,  ఐఫోన్ టెన్‌తో పాటు యాపిల్ వాచ్‌3, 4కే యాపిల్ టీవీల‌ను కూడా లాంచ్ చేసింది. 


యాపిల్‌ వాచ్ 3.. ఫోన్ అక్క‌ర్లేకుండానే కాల్స్ చేసుకోవ‌చ్చు  
ఇది యాపిల్ వాచ్‌సిరీస్‌లోమూడోది.   యాపిల్‌ గతంలో విడుదల చేసిన వాచ్‌ల‌ను ఐ ఫోన్‌కు క‌నెక్ట్ చేసినా డేటా ట్రాన్స్‌మిష‌న్ కుదిరేది కాదు. కానీ కొత్త యాపిల్ వాచ్ 3 ఈ ఫెసిలిటీని కూడా యూజ‌ర్‌కు తీసుకొచ్చింది.  దీన్ని ఐఫోన్ లాగానే డైరెక్ట్ గా  LTE నెట్‌వ‌ర్క్‌కు  క‌నెక్ట్  చెయ్యొచ్చు.  ఐఫోన్‌ నెంబరే దీనికీ వర్తిస్తుంది. వాచ్ స్క్రీన్ మీద 4 డాట్స్ స్టేట‌స్ బార్ ఉంటుంది. దానితోపాటు ఓ ఐకాన్ కూడా క‌నిపిస్తుంది.  LTE నెట్‌వ‌ర్క్‌ను సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆన్‌, ఆఫ్ చేసుకోవ‌చ్చు.   డ్యూయ‌ల్ కోర్ ప్రాసెస‌ర్ ఉండ‌డం వ‌ల్ల ఈ వాచ్ గ‌తంలో వ‌చ్చిన వాచ్‌ల కంటే 70% స్పీడ్‌గా ప‌ని చేస్తుంది. W2 chip చిప్‌తో వైర్‌లైస్‌గా ప‌ని చేస్తుంది. బ్యాట‌రీ యూసేజ్‌ను కూడా 85% త‌గ్గిస్తుంది.
ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఈ వాచ్ పెట్టుకుని ఎంత దూర‌మైనా వెళ్ల్లిపోవ‌చ్చు. ఎందుకంటే దీని నుంచి ఫోన్ అవ‌స‌రం లేకుండా నేరుగా  కాల్స్ చేసుకోవ‌చ్చు.  యాపిల్‌ వాచ్‌ 3, యాపిల్‌ మ్యూజిక్‌ ఉంటే మొబైల్ క‌నెక్ష‌న్‌ ద్వారా మ్యూజిక్ వినొచ్చు.  
* సైజ్ కూడా యాపిల్‌ వాచ్ 2 అంతే ఉంది.  
* ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌, స్విమ్మింగ్ చేసేట‌ప్పుడు హార్ట్ రేట్ ఎలా ఉందో  తెలుసుకోవచ్చు. 
* ఈ నెల 22 నుంచి యూఎస్‌, యూకేల్లో దొరుకుతుంది. ధ‌ర 329 డాల‌ర్లు ( 21,051 రూపాయ‌లు).


4కే యాపిల్‌ టీవీ 
 హై డెఫినిషన్‌ 4కే యాపిల్‌ టీవీ సెట్‌టాప్ బాక్స్‌ను  కూడా ఈవెంట్లో లాంచ్ చేశారు. దీంతో పిక్చ‌ర్ మ‌రింత డెప్త్‌, క్లియ‌ర్‌గా ఉంది.   ఐఫోన్‌, ఐప్యాడ్ కంపాట‌బులిటీ దీనికున్న మ‌రో స్పెషాలిటీ.    tvOS 11 తో ర‌న్ అవుతుంది. ఈ కొత్త ఓఎస్‌లో  టీవీ డార్క్ అండ్ నైట్ మోడ్స్‌కు ఆటోమేటిగ్గా స్విచ్ అవుతుంది. 
యాపిల్‌ టీవీపై పనిచేసే యాపిల్‌ టీవీ యాప్‌ అమెరికాతో పాటు బ్రిటన్‌లోనూ పనిచేస్తుంది.  
* ఎయిర్‌ప్లే 2, ఎయిర్ పాడ్స్‌ను కూడా స‌పోర్ట్ చేస్తుంది కాబ‌ట్టి ఇంట్లో వాళ్ల‌ను డిస్ట్ర‌బ్ చేయ‌కుండా అవి పెట్టుకుని టీవీ చూడొచ్చు.
* అమెజాన్ ప్రైమ్ వీడియోను కూడా ఈ టీవీలో చూడొచ్చు. 
ధర కూడా 179 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. స్టోరేజి కెపాసిటీని బ‌ట్టి ధ‌ర పెరుగుతుంది. సెప్టెంబ‌ర్ నుంచి యూఎస్‌, యూకేల్లో దొరుకుతుంది.

విజ్ఞానం బార్ విశేషాలు