• తాజా వార్తలు

ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌ రివ్యూ.. సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మాత్ర‌మే బెట‌ర్ ఛాయిస్

ఆసుస్ గ‌త నెల చివ‌రిలో లాంచ్ చేసిన ఆసుస్ జెన్ ఫోన్ లైవ్ బ‌డ్జెట్ రేంజ్‌లో సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మంచి ఛాయిస్. ఇప్ప‌టివ‌ర‌కు స్మార్ట్‌ఫోన్‌ల్లో లేని విధంగా లైవ్ బ్యూటిఫికేష‌న్ ఫీచ‌ర్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌.. మార్కెట్లోకి వ‌చ్చింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ సైట్ల‌లో లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే ఈ ఫీచ‌ర్ ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌కు కీల‌క‌మైంది. 9,999 రూపాయ‌ల ధ‌ర‌తో వ‌చ్చిన ఈ ఫోన్ ప్ల‌స్‌, మైన‌స్ పాయింట్లేంటో చూద్దాం.
ప్ల‌స్ పాయింట్లు
* బ‌డ్జెట్ రేంజ్‌లోనే మంచి డిజైన్. 720x1280 పిక్సెల్ రిజ‌ల్యూష‌న్‌తో 5 అంగుళాల హెచ్‌డీ బాగుంది. క‌ల‌ర్స్ బ్రైట్‌గా, వైబ్రంట్ గా క‌నిపిస్తున్నాయి. బ్లూలైట్ ఫిల్ట‌ర్ , ఆసుస్ ట్రూ వివిడ్ టెక్నాల‌జీ వాడ‌డంతో డిస్‌ప్లే క‌ళ్ల‌కు స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది.
* ఓఎస్‌: ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో. ఇక‌పై వ‌స్తున్న ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ ఓ.. ఓఎస్‌తో రానున్నందున ఇది కొద్దిగా నిరాశ‌ప‌రిచే అంశ‌మే. అయితే సాఫ్ట్ వేర్ ట్వీక్స్ బాగున్నాయి.
* యాప్ ఐకాన్స్ క‌ల‌ర్‌ఫుల్ గా ఉన్నాయి. నోటిఫికేష‌న్ ప్యాన‌ల్ లో ఐకాన్స్ రెగ్యుల‌ర్ కంటే కాస్త పెద్ద‌వి. యాప్ డ్రాయ‌ర్‌ను మ‌న‌కు కావాల్సిన‌ట్లు క‌స్ట‌మైజ్ చేసుకునే ఫెసిలిటీ బాగుంది.
* మొబైల్ మేనేజ‌ర్‌: బ్యాట‌రీని విప‌రీతంగా తినేసే యాప్‌ల‌ను స్కాన్ చేసి వాటిని కంట్రోల్ చేయ‌గ‌లిగే మొబైల్ మేనేజ‌ర్ ఫీచ‌ర్ మంచి ఎసెట్‌. దీంతో బ్యాట‌రీ బ్యాక‌ప్ పెర‌గ‌డ‌మే కాదు స్టోరేజ్ స్పేస్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్రీ అప్ చేసుకోవ‌చ్చు.
* వీడియో క్వాలిటీ, సౌండ్ అవుట్‌పుట్ , కాల్ క్వాలిటీ బాగున్నాయి.
* లైవ్ బ్యూటిఫికేష‌న్ ఫీచ‌ర్ ఉన్న 5 ఎంపీ సెల్ఫీ కెమెరా స్కిన్ టోన్‌ను పెంచి మంచి లుక్ ఇస్తుంది.
మైనస్ పాయింట్లు
* ఇమేజ్ గ్యాల‌రీ స్లోగా లోడ్ అవుతుంది.
* మ‌ల్టీ టాస్కింగ్‌లో ఫోన్ లాగ్ అవుతుంది.
* గేమ్స్ ఆడినా, గూగుల్ మ్యాప్స్ ఉప‌యోగించినా ఫోన్ అర‌గంట‌కే హీటెక్కుతుంది.
* లోలైట్‌లో ఫొటోలు స‌రిగా రావ‌డం లేదు. కెమెరా, బ్యాట‌రీ రెండూ యావ‌రేజే ఓవ‌రాల్‌గా చూస్తే డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్‌, బ్యూటిఫికేష‌న్ యాప్ ప్ల‌స్‌పాయింట్లు. ఈ లైవ్ బ్యూటిఫికేష‌న్ యాప్ గురించి ప‌క్క‌న‌పెడితే ఈ ప్రైస్ రేంజ్‌లో దీనికంటే మంచి ఆల్ట‌ర్‌నేట్ ఫోన్స్ ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు