• తాజా వార్తలు

రివ్యూ.. బెస్ట్ ఎడ్యుకేష‌న్ యాప్ బైజూ 

క్వాలిటీ ఎడ్యుకేష‌న్ కోసం ఒక‌ప్పుడు ట్యూష‌న్లు చెప్పించుకునేవారు. బాగా చ‌దివేవాళ్ల‌తో క‌లిసి కంబైన్డ్ స్ట‌డీస్ చేసేవారు. టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అయ్యాక వాటి అవ‌స‌రం బాగా త‌గ్గింది. ముఖ్యంగా హయ్య‌ర్ క్లాసెస్ స్టూడెంట్స్ కోసం యాప్ బేస్డ్ ఎడ్యుకేష‌న్ కూడా బాగా ప‌నికొస్తోంది.   మొబైల్ డేటా కాస్ట్ త‌గ్గ‌డంతో అంద‌రికీ అందుబాటులోకి కూడా వ‌చ్చిన‌ట్ల‌యింది. ఇలాంటి ఎడ్యుకేష‌న్ యాప్స్‌లో టాప్ యాప్‌.. బైజూ (Byju).

20 ల‌క్ష‌ల మంది ఫాలోయ‌ర్స్ 
బైజూ యాప్‌ని 20 ల‌క్ష‌ల మంది  స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు. వీళ్లంద‌రూ ఫ్రీ గా యూజ్ చేస్తున్న‌వారు.  పెయిడ్ యూజ‌ర్స్  20వేల మంది.   ఈ యాప్ యూజ‌ర్ల సంఖ్య మంత్లీ 20% వ‌ర‌కు పెరుగుతోంది.  దీంతోపాటు పెయిడ్ యూజ‌ర్ల సంఖ్య‌లో కూడా గ్రోత్ క‌నిపిస్తోంది.  బైజూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ట‌ర్ చేసుకుంటే ఫ్రీ ట్ర‌య‌ల్ వ‌స్తుంది. దీంతో సాటిస్ పై అయితే స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవ‌చ్చు. ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న లోక‌ల్ లాంగ్వేజ్‌ల్లోనూ కంటెంట్‌ను తీసుకొస్తోంది. ఇటీవ‌ల పేరెంట్ యాప్స‌ను కూడా తీసుకొచ్చింది. దీంతో త‌మ పిల్ల‌ల పెర్‌ఫార్మెన్స్‌ను వాళ్లు చెక్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. వ‌ 

బైజూలో బెస్ట్ ఫీచ‌ర్స్ 
1. ఫుల్ సిల‌బ‌స్ క‌వ‌రేజ్ 
 స‌బ్జెక్ట్ సిల‌బ‌స్‌ను పూర్తిగా క‌వ‌ర్ చేస్తుంది. ఎగ్జామ్ వ్యూలో కాకుండా స‌బ్జెక్ట్ గెయినింగ్ ప‌ర్‌స్పెక్టివ్‌తో బైజూ లెస‌న్స్‌ను క‌వ‌ర్ చేస్తుంది. నీట్‌, జేఈఈవ వంటి ఎగ్జామ్స్ రాసేవారి కోసం సబ్జెక్ట్‌ను  ఎన‌లైజ్ చేస్తూ హై క్వాలిటీ  ప్రిప‌రేష‌న్ కూడా చేసుకోవ‌చ్చు. స్టూడెంట్స్ త‌మ‌కు కావాల్సిన కోర్సును యాప్‌లో సెల‌క్ట్ చేసుకుని ప్రిపేర్ కావ‌చ్చు. 
2. వీడియో లెక్చ‌ర్స్ (ఇంట‌రాక్టివ్‌) 
 ఈ యాప్‌లో వ‌చ్చే  లెక్చ‌ర్స్ నార్మ‌ల్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ కూడా అర్ధం చేసుకునేలా ఉంటాయి. లెక్చ‌ర్స్‌తోపాటు 7 నుంచి 10 క్లాస్‌ల విద్యార్థుల‌కు క్యాట్‌, యూపీఎస్సీ ప‌రీక్ష‌ల్లో వ‌చ్చేలాంటి  మోడ‌ల్ క్వ‌శ్చ‌న్స్ కూడా ఇస్తారు. 
3. మాక్ టెస్ట్స్ 
 ప్ర‌తి చాప్ట‌ర్‌కు మాక్ టెస్ట్‌లు ఉంటాయి. జేఈఈ, నీట్ ప‌రీక్ష‌ల బేస్డ్‌గా కూడా ప‌రీక్ష‌లు ఉంటాయి. 10వ క్లాస్ త‌ర్వాత 11,12 క్లాస్‌లు (ఇంట‌ర్మీడియ‌ట్‌) చ‌దివాక ఈ ఎగ్జామ్స్ రాసేవారికి ఇది చాలా యూజ్ అవుతుంది.  ఈజీ టు డిఫిక‌ల్ట్ వ‌ర‌కు వివిధ స్టేజ్‌ల్లో ఎగ్జామ్ ఉంటుంది.  స్టూడెంట్స్ త‌న‌కు న‌చ్చిన రేంజ్ ను సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. 
4. ఆల్‌రౌండ్ అనాల‌సిస్‌
ఈ యాప్‌తో స్టూడెంట్స్  పెర్‌ఫార్మెన్స్‌ను అన‌లైజ్ చేసుకోవ‌చ్చు. ప్రిప‌రేష‌న్ త‌మ టార్గెట్ ను రీచ్ అయ్యేలా ఉందో లేదో వాళ్లే ఎసెస్ చేసుకోవ‌చ్చు. 
5 లెర్నింగ్ స్టైల్స్ 
ఒక్కో విద్యార్థికి ఒక్కో ర‌కం లెర్నింగ్ స్టైల్ ఉంటుంది.  కొంత‌మంది ప‌దే ప‌దే చ‌దువుతారు. కొంత‌మంది ఎనాల‌సిస్ చేసుకుని చ‌దువుతారు.  ర‌క‌ర‌కాల లెర్నింగ్ మెథ‌డ్స్‌ను యాప్ ప్రొవైడ్ చేస్తుంది. 

జన రంజకమైన వార్తలు