• తాజా వార్తలు
  •  

గూగుల్ గో యాప్ రివ్యూ

గూగుల్ ఇండియా గ‌త వారం ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో గూగుల్ గో యాప్‌ను రిలీజ్ చేసింది. ఇది ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న గూగుల్ యాప్‌కు స్ట్రీమ్‌లైన్ చేసిన వెర్ష‌న్‌.  వెబ్‌లో ఈజీగా, ఫాస్ట్‌గా డిస్క‌వ‌ర్‌, ఎక్స్‌ప్లోర్‌, షేర్ చేయ‌డానికి ఈ గూగుల్ గో యాప్‌ను తీసుకొచ్చిన‌ట్లు గూగుల్ ప్ర‌క‌టించింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్ష‌న్‌, ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ల కోసం త‌యారు చేసిన ఆండ్రాయిడ్ గో బేస్డ్ ఫోన్ల‌లో ప్రీ లోడ్ చేసి ఇస్తామ‌ని గూగుల్ ప్ర‌క‌టించింది. గూగుల్ గో యాప్ సైజ్ 5 ఎంబీ. కాబట్టి త‌క్కువ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉండే ఫోన్ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 
ఎక్స్‌ట్రా లాంగ్వేజ్
ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ వాడేవారిని కూడా ఇంట‌ర్నెట్‌కు ద‌గ్గ‌ర చేయాల‌నే ఉద్దేశంతో ఆండ్రాయిడ్ గో ఓఎస్ తీసుకొచ్చిన గూగుల్‌.. ఇప్పుడు గూగుల్ గో యాప్ ద్వారా దాన్ని మ‌రింత ముందుకు తీసుకెళుతోంది. దీనిలో డిఫాల్ట్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్‌)తోపాటు మ‌రో అడిష‌నల్ లాంగ్వేజ్‌ను ఎంచుకోవ‌చ్చు. బంగ్లా, హింఈ, నేపాలీ,పంజాబీ లాంటి రీజ‌న‌ల్ లాంగ్వేజ‌స్ ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఆఫ్రికాన్స్‌, డచ్, ఫిలిఫ్పినో లాంటి విదేశీ భాష‌ల‌ను కూడా సెలెక్ట్ చేసుకోవ‌చ్చు.
త‌క్కువ డేటా యూసేజ్
లైట్ యాప్ కాబ‌ట్టి డేటాను కూడా త‌క్కువ‌గా వాడుకుంటంఓది.  పాత గూగుల్ యాప్ కంటే 40%  త‌క్కువ డేటా యూజ్ చేసుకునేలా దీన్ని డిజైన్ చేశారు.  లేటెస్ట్ ఆండ్రాయిడ్  ఓరియో ఓఎస్‌తో ర‌న్న‌వుతున్న స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్‌ను మూడుగంట‌లు యూజ్ చేస్తే 330 ఎంబీ  డేటా ఖ‌ర్చ‌యింది. అదే ఫోన్‌లో గూగుల్ గో యాప్‌ను వేసి అంతే టైం వాడితే జ‌స్ట్ 32 ఎంబీనే యూజ్ చేసుకుంది. 
 tap-first ఇంట‌ర్‌ఫేస్
బేసిక్ ఇంట‌ర్నెట్ యూజ‌ర్స్ కోసం ప్ర‌ధానంగా తీసుకొచ్చిన యాప్ కాబ‌ట్టి ఇంట‌ర్‌ఫేస్ ఈజీగా ఉంది. tap-first ఇంట‌ర్‌ఫేస్ ఉండ‌డం వ‌ల్ల స్క్రీన్ మీద ఎక్కువ టైప్ చేయ‌క్క‌ర్లేదు. ఇది యూనిఫైడ్ స్క్రీన్ కావ‌డంతో సెర్చ్‌, వాయిస్ సెర్చ్ లాంటి గూగుల్ స‌ర్వీసెస్‌ల‌న్నీ వ‌ర్క‌వుట్ అవుతాయి. స్క్రీన్ కింద భాగంలో సెర్చ్ బార్‌, వాయిస్ సెర్చ్ కోసం డెడికేటెడ్ బ‌ట‌న్ ఉన్నాయి. సెర్చ్ బార్‌ను క్లిక్ చేస్తే ట్రెండింగ్ ఏమిటో చూపిస్తాయి. వాటిని టాప్ చేస్తే డైరెక్ట్‌గా ఆ ఇష్యూకు సంబంధించిన హోంపేజీలోకి డైరెక్ట్ చేస్తుంది. మీ సెర్చ్ రిజ‌ల్ట్స్ కి సంబంధించి అది క్రికెట్‌, సినిమా, ఎల‌క్ష‌న్ ఏవైనా సరే రెగ్యుల‌ర్ అప్‌డేట్స్ కావాల‌నుకుంటే నోటిఫై చేసుకోవ‌చ్చు. రియ‌ల్ టైం అప్‌డేట్స్‌ను మీకు అందిస్తుంది.
* ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ లాంటి పాపుల‌ర్ సైట్ల‌కు సంబంధించి గూగుల్ గోలో షార్ట్ క‌ట్స్ ఉన్నాయి. వాటిని టాప్ చేస్తే డైరెక్ట్‌గా సైట్లోకి తీసుకెళ‌తాయి.  మీకు కావాల్సిన సైట్ల‌తో ఈ షార్ట్ క‌ట్స్‌ను క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు.
* మొత్తంగా చూస్తే గూగుల్ గో యాప్ స్లీక్‌గా, సింపుల్‌గా, క్లీన్‌గా ఉంది. అందుకే ఫ‌స్ట్ టైమ్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు ఈ యాప్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఆండ్రాయిడ్ 4.3, ఆ త‌ర్వాత వ‌చ్చిన ఓఎస్‌ల‌తో న‌డిచే ఫోన్ల‌లో గూగుల్ గో యాప్‌ను వాడుకోవ‌చ్చు.

విజ్ఞానం బార్ విశేషాలు