• తాజా వార్తలు
  •  

రిల‌య‌న్స్ జియో ఫోన్ వ‌ర్సెస్ ఎయిర్‌టెల్ 4జీ ఫోన్.. రెండింట్లో ఏది ఉత్త‌మం?

రియ‌ల‌న్స్ జియో ఫోన్‌..ఇదో పెద్ద సంచ‌ల‌నం ఇప్పుడు. ఉచితంగా డేటా, కాల్స్ ఇచ్చి ప్ర‌కంప‌న‌లు రేపిన రియ‌ల‌న్స్‌. జియో ఫీచ‌ర్ ఫోన్‌తో మ‌రోసారి వినియోగ‌దారుల‌ను త‌న‌వైపు తిప్పుకుంది. ఇప్ప‌టికే ల‌క్షలాది మంది ఈ ఫీచ‌ర్ ఫోన్ కోసం బుక్ చేసుకున్నారు. రిల‌య‌న్స్ దెబ్బ‌కు మిగిలిన టెలికాం సంస్థ‌ల‌కు దిమ్మ‌తిరిగిపోతోంది. ఇప్ప‌టికే జియోకు పోటీగా డేటా ప్యాక్‌లు ప్ర‌వేపెట్టిన ఈ సంస్థ‌లు ఇక ఫోన్ విష‌యంలోనూ పోరాటానికి దిగాయి. భార‌తీ ఎయిర్‌టెల్ అందులో ముందంజ‌లో ఉంది. రిల‌య‌న్స్ జియో ఫీచ‌ర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్  4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేస్తోంది. మ‌రి ఈ రెండు ఫోన్ల‌లో ఏది ఉత్త‌మం?

కార్బ‌న్‌తో క‌లిసి...
రిల‌య‌న్స్ జియో ఫీచ‌ర్ ఫోన్‌ను దెబ్బ కొట్టేందుకు  ఎయిర్‌టెల్ కార్బ‌న్ కంపెనీ సాయాన్ని తీసుకుంది. కార్బ‌న్ భాగ‌స్వామ్యంతో  కార్బ‌న్ ఎ40 ఇండియ‌న్ పేరుతో  4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న‌ట్లు తెలిపింది. ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.1399గా ఉంటే..  జియో ఫోన్ ధ‌ర రూ.1500గా ఉంది. కానీ 36 నెల‌ల త‌ర్వాత ఆ రిఫండ్‌ను వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని రిల‌య‌న్స్ చెప్పింది.  ఈ ప్ర‌క‌ట‌న కూడా క‌స్ట‌మ‌ర్ల‌ను విశేషంగా ఆక‌ర్షించింది. 

రెండూ రెండే..
ధ‌ర‌, రిఫండ్ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే  స్పెసిఫికేష‌న్ల విష‌యంలో ఈ రెండూ రెండే. ఎయిర్‌టెల్ 4జీ ఫోన్లో ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఉపయోగించారు. రియ‌ల‌న్స్ జియో ఫోన్‌న్‌లో క‌య్ ఓఎస్‌ను వాడారు. అయితే  ఈ విషయంలో ఎయిర్‌టెల్ ఫోన్ మార్కులు కొట్టేసింది. ఎందుకంటే     ఈ ఫోన్‌లో వాట్స‌ప్‌, ఫేస్‌బుక్ లాంటివి మ‌నం ఉప‌యోగించుకోవ‌చ్చు. కానీ రిల‌య‌న్స్ ఫోన్‌లో కుద‌ర‌దు.  అంతేకాదు ఎయిర్‌టెల్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 7.0 న‌గౌట్ వెర్ష‌న్‌తో వ‌స్తోంది.  రియ‌ల‌న్స్‌లో వాడుతున్న కియో ఓఎస్ ఇంకా  ప‌రీక్ష‌ల స్టేజ్‌లో ఉంది.  యూట్యూబ్‌, వాట్స‌ప్ ప‌ని చేయ‌వ‌వు. ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్‌లో 4 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. జియోలో 2.3 క్యూవీజీఏ డిస్‌ప్లే ఉంది. ఎయిర్‌టెల్‌లో 1.3 క్వాడ్కోర్ ప్రాసెస‌ర్,1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్ వాడుతున్నారు. జియోలో 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ స్టోరేజ్ ఉంది. అయితే ఎయిర్‌టెల్‌తో పోలిస్తే బ్యాట‌రీ విష‌యంలో జియోదే పైచేయి. 

నెట్‌వ‌ర్క్ లాకింగ్
నెట్‌వ‌ర్కింగ్ లాకింగ్ ఆప్ష‌న్ వ‌ల్ల కూడా జియో ఫోన్‌.. ఎయిర్‌టెల్ క‌న్నా వెన‌క‌బడేలా క‌నిపిస్తుంది. అంటే ఈ ఫోన్‌లో జియో సిమ్ త‌ప్ప వేరే వాటిని ఉప‌యోగించే అవ‌కాశం లేదు. కానీ ఎయిర్‌టెల్‌లో ఏ నెట్‌వ‌ర్క్ అయినా అయినా వాడొచ్చు. అంతేకాదు ఎయిర్‌టెల్‌లో డ్యుయ‌ల్ సిమ్ కూడా వాడుకోవ‌చ్చు. జియో ఫోన్ వాడిన మూడేళ్ల త‌ర్వాత   రిఫండ్ కావాలంటే డివైజ్‌ను రిల‌య‌న్స్‌కు తిరిగి ఇచ్చేయాలి. కానీ ఎయిర్‌టెల్ మ‌న ద‌గ్గ‌రే ఉంటుంది.