• తాజా వార్తలు
  •  

నాలుగు కెమెరాలతో హానర్ 9 ఐ

వీవో, ఒప్పో, శాంసంగ్ లాంటి దిగ్గ‌జ కంపెనీల‌కు పోటీగా భార‌త్‌లో దూసుకుపోతున్న సెల్‌ఫోన్ బ్రాండ్ హాన‌ర్‌. హువాయ్ కంపెనీకి చెందిన ఈ బ్రాండ్  ఇప్పుడు మార్కెట్లో మిగిలిన సెల్‌ఫోన్ కంపెనీల‌కు గ‌ట్టిపోటీనే ఇస్తోంది. గ‌తంలో హాన‌ర్ 8 ప్రొతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ మోడ‌ల్‌.. తాజాగా హాన‌ర్ 9ఐ మోడ‌ల్‌తో ముందుకొచ్చింది. నాలుగు కెమెరాలు, బెజెల్ లెస్ ఫుల్ విజ‌న్ డిస్‌ప్లే లాంటి యూనిక్ ఆప్ష‌న్ల‌తో ఈ మోడ‌ల్ మార్కెట్లో హాట్ హాట్‌గా మారింది.  బ‌డా సెల్ మోడ‌ల్స్‌కు గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని చెబుతున్న హానర్ 9ఐ ప్ర‌త్యేక‌త‌లేంటో చూద్దామా...

4 జీబీ ర్యామ్‌.. 64 జీబీ స్టోరేజ్‌
ఇటీవ‌ల వ‌స్తున్న హై ఎండ్ ఫోన్ల‌లో ఎక్కువ‌శాతం 3 జీబీ ర్యామ్ సామ‌ర్థ్యం ఉన్న‌వే. కానీ హాన‌ర్ 9ఐలో మాత్రం 4 జీబీ ర్యామ్ కెపాసిటీ ఉంది. 64  జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ మరో ప్రత్యేకత. 5.9 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లేతో పాటు నాలుగు కెమెరాలు ఉండ‌డం అన్నిటి కంటే ఆస‌క్తిని రేపుతున్న అంశం.  ప్రిమియం లుక్‌తో ఉన్న హాన‌ర్ 9ఐలో 13 మెగా పిక్స‌ల్ ప్రైమ‌రీకెమెరాతో పాటు 2 మెగా పిక్స‌ల్ సెకండ‌రీ కెమెరా, రేర్ 16 మెగా పిక్స‌ల్ సెన్సార్ కెమెరా, 2 మెగా పిక్స‌ల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి.  ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని వాతావ‌ర‌ణాల్లో, అన్ని యాంగిల్స్‌లో ఫొటోల‌ను క్లారిటీగా తీసేందుకు ఈ కెమెరాలు ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. 

అదిరే డిస్‌ప్లే
ఇప్పుడు వ‌స్తున్న 5.5 అంగుళాల డిస్‌ప్లే కాకుంఆ హాన‌ర్ 9ఐలో 5.9 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో హైలైట్ ఇదే. ఎఫ్‌హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్‌తో ఫోన్ లుక్కే మారిపోయింది.  దీనిలో ఉన్న పాత ఫీచ‌ర్ ఏంటంటే  యూఎస్‌బీ పోర్ట్‌, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ విత్ జాక్ మాత్ర‌మే. మిగిలిన ఫీచ‌ర్ల‌న్నీ దాదాపు కొత్త‌వే. దీనిలో హ్యువీయ్‌కు చెందిన కిరిన్ 659 ఆక్టా కోర్ ప్రాసెస‌ర్ వాడారు.  దీంతో ఫోన్ వేగం మ‌రింత పెర‌గ‌నుంది.  3340 ఎంఏహెచ్ బ్యాట‌రీతో ఇది మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఆండ్రాయిడ్ 7.0 న‌గౌట్ ఓఎస్‌ను ఉప‌యోగించారు దీనిలో.  ఇన్ని అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఉన్న దీని ధ‌ర రూ.17,999గా ఉంది.