• తాజా వార్తలు

ఎల్జీ క్యూ 6 .. ఎలా ఉందంటే

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఎల్జీకి ఈ ఏడాది అంత‌గా క‌లిసిరాలేద‌నే చెప్పాలి. ఫ్లాగ్‌షిఫ్ ఫోన్ల సిరీస్‌లో ఇంత‌కుముందు LG తీసుకొచ్చిన‌ G6 మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ బాగున్నా దాన్ని సేల్స్‌గా క‌న్వ‌ర్ట్ చేయ‌డంలో కంపెనీ స‌క్సెస్ కాలేక‌పోయింది. దీంతో ఇప్పుడు ఎల్జీ బ‌డ్జెట్ రేంజ్ ఫోన్ల‌లోనే ప్రీమియం ఫీచ‌ర్స్‌ను ఇస్తూ క్యూ సిరీస్ ఫోన్ల‌ను తీసుకొచ్చింది. దీనిలో Q6 మోడ‌ల్‌ను మూడు ర్యామ్ వేరియంట్ల‌తో జులైలో రిలీజ్ చేసింది. ఇండియాలో 3జీబీ ర్యామ్‌తో రిలీజ‌యిన LG Q6 మోడ‌ల్ ధ‌ర 15వేల రూపాయ‌ల‌లోపే ఉంది. ఈ ఫోన్ ఎలా ఉందో రివ్యూ చూడండి.  
ప్ల‌స్‌పాయింట్స్ 
* 5.5 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ,  స్లిమ్ స్క్రీన్ బోర్డ‌ర్స్ 
* 2160x1080 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో టాల‌ర్ యాస్పెక్ట్ రేషియోలో చూడ‌డ‌డానికి బాగుంది
* 700 సిరీస్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ఉంది. ప్రీమియం ఫోన్ల‌లో మాత్ర‌మే వ‌చ్చే ఈ మెటీరియ‌ల్ బ‌డ్జెట్ ఫోన్‌లో ఇచ్చారు.
* కుడివైపు ప‌వ‌ర్‌, వాల్యూం బ‌ట‌న్స్ ఉన్నాయి. ఎడ‌మ‌వైపు రెండు సిమ్‌కార్డ్ స్లాట్స్‌తోపాటు ఎస్డీ కార్డ్‌కు కూడా స్లాట్ ఉంది. 
* ఫేస్ రిక‌గ్నిష‌న్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించి ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవ‌చ్చు.  అయితే మీ ఫేస్ బదులు మీ ఫొటో పెట్టినా కూడా ఫోన్ అన్‌లాక్ అవ‌డం ఇబ్బందిక‌ర‌మే. అయితే ఫేస్ రిక‌గ్నిష‌న్తోపాటు ప్యాట్ర‌న్ లేదా పిన్ సెట్ చేసుకోవ‌చ్చు. ఇది ఎక్స్‌ట్రా సెక్యూరిటీ ఫీచ‌ర్‌. 
* స్నాప్‌డ్రాగ‌న్ క్వాల్‌కామ్  435 ప్రాసెస‌ర్‌
* గ్రాఫిక్స్ కోసం  Adreno 505 GPU 
* ఆండ్రాయిడ్ 7.1.1. నూగ‌ట్ ఓఎస్‌
* ఆన్‌స్క్రీన్ నావిగేష‌న్ స్ట్రిప్‌ను  రీఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు. 
* సెట్టింగ్స్ యాప్‌ను ట్యాబ్స్‌గా డివైడ్ చేసుకోవ‌చ్చు. 
* మ‌ల్టీ టాస్కింగ్ బాగా చేయొచ్చు. యాప్స్ క్విక్‌గా లోడ్ అవుతున్నాయి.
* 3డీ గేమ్స్ కూడా మంచి ఫ్రేమ్‌రేట్స్‌తో ర‌న్ అవుతున్నాయి. 

మైన‌స్ పాయింట్స్ 
* నోటిఫికేష‌న్ బార్ లేదు.. కాబ‌ట్టి ప్ర‌తిసారి డిస్‌ప్లేను ట‌ర్న్ చేసి చూసుకోవాలి. 
* ఫోన్ బ్యాక్‌సైడ్ ఇచ్చిన ప్లాస్టిక్ కేస్ ఈజీగాగీత‌లు ప‌డే అవ‌కాశం ఉంది. 
* ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్ లేదు.
*  యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లేదు
* డ‌య‌ల‌ర్ యాప్ లో వీడియో కాలింగ్‌కు డైరెక్ట్ ఆప్ష‌న్ లేదు. 
* గేమ్స్ ఆడుతున్న‌ప్పుడు ఫోన్ మెట‌ల్ ఫ్రేమ్ హీటెక్కుతోంది.
* 13 ఎంపీ రియ‌ర్ కెమెరాతో ల్యాండ్ స్కేప్స్‌ను, పెద్ద ఆబ్జెక్ట్‌ను ఫొటో తీసిన‌ప్పుడు అంత క్వాలిటీ లేదు. 
* ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్ష‌న్ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌

ఈ ఫీచ‌ర్లు సూప‌ర్ 
* ఎల్జీ మొబైల్ స్విచ్‌:  దీంతో మీ ఓల్డ్ డివైస్‌లోని డేటాను క్యూ 6కి మైగ్రేట్ చేసుకోవ‌చ్చు. 
* రిమోట్ కాల్ స‌ర్వీస్ :  దీంతో ఎల్జీ క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌ప‌ర్స‌న్ మీ ఫోన్‌ను రిమోట్ యాక్సెస్‌తో కంట్రోల్ చేసి ప్రాబ్ల‌మ్స్ ఫిక్స్ చేయొచ్చు.  చిన్న‌చిన్న ఫిజిక‌ల్  ప్రాబ్ల‌మ్స్‌కీ స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్లే బాధ త‌ప్పుతుంది. 
* Capture+: ఈ టూగుల్‌తో స్క్రీన్‌షాట్స్ మీద డ్రా చేయొచ్చు లేదా టెక్స్ట్ యాడ్ చేసుకోవ‌చ్చు. 
*  LG Smart World: ఎల్జీ ప్రొడ‌క్ట్‌ల‌కు సంబంధించిన స‌మాచారం మొత్తం అందించే ఈ పోర్ట‌ల్ బాగా యూజ్‌ఫుల్‌. 
* Game battery saver:  ఈ ఫీచ‌ర్‌ను ఎనేబుల్ చేసుకుంటే గేమ్స్ ఆడేట‌ప్పుడు వాటి రిజ‌ల్యూష‌న్‌ను త‌గ్గించి ప‌వ‌ర్‌ను సేవ్ చేస్తుంది. అయితే ఫ్రేమ్ రేట్ కొంత ఇబ్బందవుతుంది. 
* Break time:  గేమ్ ఆడుతూ ఫోన్‌ను ఐడ‌ల్‌లో ఉంచితే గేమ్స్‌ను పాజ్ చేసి, స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను త‌గ్గించి  ప‌వ‌ర్‌ను సేవ్ చేస్తుంది. 
ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. 
మొత్తంగా చూస్తే క్యూ 6 .. డిజైన్, స్టైల్‌ప‌రంగా బాగున్నా కెమెరా క్వాలిటీ, బ్యాట‌రీ పెర్‌ఫార్మెన్స్ యావ‌రేజే.  గేమ్స్‌, యాప్స్ స్పీడ్ గా ర‌న్ అయ్యేలా ప‌వ‌ర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్ కావాలంటే ఈ ప్రైస్ రేంజ్‌లో రెడ్‌మీ, శాంసంగ్ లాంటి కంపెనీలు చాలా మోడ‌ల్స్ ఆఫ‌ర్ చేస్తున్నాయి.  సో క్యూ 6 అంత బెట‌ర్ ఆప్ష‌న్ కాద‌న్న‌ది ఎక్స్‌ప‌ర్ట్స్ ఒపీనియ‌న్‌.  

జన రంజకమైన వార్తలు